ETV Bharat / business

సెబీ చీఫ్‌ చుట్టూ వివాదం - సమన్లు జారీ చేసిన పార్లమెంటరీ ప్యానెల్‌ - Summons To SEBI Chief - SUMMONS TO SEBI CHIEF

Parliamentary Panel PAC Summons SEBI Chief Madhabi Puri : సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురీ బచ్‌ చుట్టూ వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ ఆమెకు సమన్లు జారీ చేసింది.

SEBI chief Madhabi Puri Buch
SEBI chief Madhabi Puri Buch (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2024, 12:40 PM IST

Parliamentary Panel PAC Summons SEBI Chief Madhabi Puri : సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురీ బచ్‌కు పార్లమెంటరీ కమిటీ (PAC) సమన్లు జారీ చేసింది. అక్టోబర్‌ 24న కమిటీ ముందుకు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. అదానీ వ్యవహారానికి సంబంధించిన సెబీ చీఫ్‌పై హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసిన నేపథ్యంలో, దేశంలోని టాప్ రెగ్యులేటరీ అథారిటీల పనితీరును సమీక్షించాలని పీఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే సమన్లు జారీ చేసినట్లు సమాచారం. మాధబి పురీ బచ్‌తో పాటు ఆర్థికశాఖ, ట్రాయ్‌ అధికారులకు కూడా పీఏసీ సమన్లు జారీ చేసింది.

పార్లమెంటరీ కమిటీ సమావేశానికి సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌, ట్రాయ్‌ ఛైర్‌పర్సన్‌ అనిల్ కుమార్‌ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. వారి తరపున సీనియర్‌ అధికారులు సమావేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని కమిటీ సభ్యులు సూచనప్రాయంగా తెలిపారు. మాధబి పురీ బచ్‌ చుట్టూ వివాదాలు అలముకున్న నేపథ్యంలో ఈ పార్లమెంటరీ కమిటీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

సెబీ అధికారుల ఫిర్యాదుతో
గత కొన్ని వారాలుగా సెబీ ఛైర్‌పర్సన్‌ పలు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. మొన్నటి వరకు అదానీ షేర్ల వ్యవహారంతో, ఐసీఐసీఐ బ్యాంక్‌ జీతభత్యాల విషయంలో ఆమె వార్తల్లో నిలిచారు. తాజాగా సెబీ అధికారులు చేసిన ఫిర్యాదులతో మరోసారి వివాదాల్లో నిలిచారు. మాధవి పురీ బచ్‌ ఆధ్వర్యంలో నడిచే క్యాపిటల్‌ మార్కెట్స్ రెగ్యులేటర్‌ కార్యాలయంలో పని సంస్కృతిపై ఏకంగా సెబీ అధికారులే ఆమెపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

హిండెన్​బర్గ్​ సంచలన ఆరోపణలు
సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్‌ ఫండ్‌లలో మాధబి పురికి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. అదానీకి చెందిన మారిషస్, ఆఫ్‌షోర్‌ షెల్‌ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని పేర్కొంది.

'నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదానీ పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు సాగించడం గమనించాం. సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబితో అదానీ సంస్థల సంబంధాలను చూస్తే ఇది బాగా అర్థం అవుతుంది. విజిల్‌బ్లోయర్‌ పత్రాల ప్రకారం, గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్‌షోర్‌ బెర్ముడా, మారిషస్‌ ఫండ్‌లు ఉన్నాయి. ఇందులో మాధబి పురి, ఆమె భర్త ధావల్‌ బచ్‌లకు వాటాలు ఉన్నాయి' అని హిండెన్‌బర్గ్‌ తన తాజా నివేదికలో ఆరోపించింది. ఈ దంపతుల వాటాల నికర విలువ 10 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.83 కోట్ల) వరకు ఉండొచ్చని తెలిపింది. అయితే అవన్నీ తప్పుడు ఆరోపణలు అంటూ బచ్‌ దంపతులు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇన్ని వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో సెబీ చీఫ్‌నకు పార్లమెంటరీ కమిటీ నుంచి సమన్లు రావడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.