OMCs Making Huge Margins In India : ముడి చమురు ధరలు తగ్గుతున్న కొద్దీ, భారత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(OMCs) పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై అధిక లాభాలు ఆర్జిస్తున్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ తెలిపింది. ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటి సంస్థలు పెట్రోల్‌పై రూ.15/లీటర్, డీజిల్‌పై రూ.12/లీటర్ లాభాలు తీసుకుంటున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఐసీఆర్ఏ ఓ నివేదిక విడుదల చేసింది.
కాగా, 2024 మార్చి నుంచి ఇంధన రిటైల్ సెల్లింగ్ ధరలు మారలేదని(చివరిసారిగా 2024 మార్చి 15న పెట్రోల్/డీజిల్‌పై రూ.2 చొప్పున తగ్గించారు) చెప్పింది. ఇటీవల నెలల్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం వల్ల ఓఎమ్‌సీల మార్జిన్లు పెరిగాయని వెల్లడించింది.
అంతకుముందు ఇదే విషయాన్ని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ తెలిపింది. ప్రభుత్వ అధీనంలో ఓఎమ్సీలకు 2023-24 మంచి ఆర్థిక సంవత్సరంగా నిలిచిందని చెప్పింది. ఈ ఏడాది ఓఎమ్‌సీలు అన్ని ఉమ్మడిగా రూ.86,000 కోట్లు లాభం ఆర్జించాయని తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి, HPCL (హిందుస్థాన్ పెట్రోలియం) రికార్డు స్థాయిలో రూ.16,014 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత సంవత్సరంలో రూ.6,980 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇదే ఆర్థిక సంవత్సరానికి BPCL లాభం (పన్ను తర్వాత) రూ. 26,673 కోట్లుగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే దాదాపు 13 రెట్లు ఎక్కువ.
'పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తే మంచిది'
ఓఎమ్‌సీలు అధిక లాభాలు ఆర్జిస్తున్నందున- పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కలిగించాలని నిపుణులు సూచిస్తున్నారు. లీడర్‌పై కనీసం రూ.2-3 వరకు తగ్గించడానికి ఓఎమ్సీలకు అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఇదిలా ఉండగా, ప్రపంచ ఆర్థిక వృద్ధి బలహీనపడటం, అమెరికా అధిక ఉత్పత్తి కారణంగా గత కొన్ని నెలల్లో క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుముఖం పట్టాయి. దీన్ని ఎదుర్కొడానికి OPEC+ దేశాలు ఉత్పత్తి కోతలను రెండు నెలల పాటు వెనక్కి నెట్టాయి. అయితే, పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితులు అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. అయినా సోమవారం చమురు ధరలు నిలకడగా ఉన్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్! ఇదే కారణం!! - Petrol Diesel Price Cut
పెట్రోల్ బంకు వాళ్లు చీట్ చేస్తున్నారా? సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టిండిలా! - Petrol Pump Scams