ETV Bharat / business

డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్ - నేటి నుంచే అమలు - ఇకపై టెస్ట్​ కోసం RTO ఆఫీస్​కు వెళ్లనక్కరలేదు! - Driving Licence New Rules - DRIVING LICENCE NEW RULES

Driving Licence New Rules : కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని అనుకుంటున్న వారికి గుడ్ న్యూస్​. కొత్త డ్రైవింగ్ లైసెన్స్​ రూల్స్ నేటి (జూన్​ 1) నుంచే అమల్లోకి వచ్చాయి. అందువల్ల ఇకపై మీరు ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలు మీ కోసం.

new driving licence rules from june 1st, 2024
Driving Licence New rules from June 1, 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 1, 2024, 10:41 AM IST

Driving Licence New Rules : కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయాలని అనుకుంటున్నవారికి గుడ్ న్యూస్​. డ్రైవింగ్ లైసెన్స్, ట్రైనింగ్​లకు సంబంధించిన నిబంధనల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ నేటి (2024 జూన్​ 1) నుంచే అమలులోకి వచ్చాయి. కనుక ఇకపై మీరు ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లి టెస్ట్ డ్రైవ్​ చేయాల్సిన పనిలేదు. ఇంకా ఈ కొత్త నిబంధనల్లో ఎలాంటి మార్పులు వచ్చాయంటే?

ఆర్​టీఓ ఆఫీస్​కు వెళ్లాల్సిన పనిలేదు!
కొత్త రూల్స్ ప్రకారం, ఇకపై మీరు డ్రైవింగ్​ టెస్ట్​ కోసం ఆర్​టీఓ (RTO) ఆఫీస్​కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆర్‌టీఓ ఆఫీసుకు బదులుగా, ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్ల వద్దనే డ్రైవింగ్ టెస్టుకు హాజరుకావచ్చు. వారు డ్రైవింగ్ టెస్ట్​ నిర్వహించి మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. దానితో మీరు ఆర్​టీఓ ఆఫీస్​ నుంచి డ్రైవింగ్ లైసెన్స్​ పొందవచ్చు. ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసేవాళ్లు, నేరుగా ఆర్‌టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరాన్ని తొలగించడం. పూర్తిగా ఆన్​లైన్​లోనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడం.

New Rules For Private Driving Training Centres : ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలంటే, దానికి కూడా పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోసమైతే ఒక ఎకరం భూమి ఉండాలి. ఫోర్-వీలర్ డ్రైవింగ్ ట్రైనింగ్​ కోసం అయితే మరో 2 ఎకరాల భూమి అదనంగా ఉండాలి. ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్​ కలిగి ఉన్న ప్రైవేట్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు ప్రభుత్వం లైసెన్స్ జారీ చేస్తుంది.

ఈ ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్లలో ఉన్న ట్రైనర్లు కనీసం డిప్లొమా చేసి ఉండాలి. అలాగే వారికి కనీసం 5 ఏళ్ల డ్రైవింగ్ ఎక్స్​పీరియెన్స్​ ఉండాలి. బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్​పై కనీస అవగాహన ఉండాలి.

లైట్ మోటార్ వెహికల్ ట్రైనింగ్​ నాలుగు వారాల్లో లేదా కనీసం 29 గంటల్లో పూర్తి చేయాలి. ఈ శిక్షణ థియరీ, ప్రాక్టికల్ విధానాల్లో ఉండాలి. థియరీ కోసం కనీసం 8 గంటలు, ప్రాక్టికల్ కోసం కనీసం 21 గంటలు కేటాయించాలి. హెవీ మోటార్ వెహికల్స్ అయితే 6 వారాలు లేదా కనీసం 38 గంటలపాటు శిక్షణ ఉండాలి. థియరీ ఎడ్యుకేషన్ 8 గంటలు, ప్రాక్టికల్స్​ 31 గంటలు ఉండాలి.

డ్రైవింగ్ లైసెన్స్ ఫీజులు

  • లెర్నర్ లైసెన్స్ - రూ.200
  • లెర్నర్ లైసెన్స్ రెన్యువల్ - రూ.200
  • ఇంటర్నేషనల్ లైసెన్స్ - రూ.1000
  • పర్మినెంట్ లైసెన్స్ - రూ.200
  • పర్మినెంట్ లైసెన్స్ రెన్యూవల్ - రూ.200
  • డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ జారీ, రెన్యువల్ - రూ.10,000
  • డ్రైవింగ్ స్కూల్ డూప్లికేట్ లైసెన్స్ - రూ.5000

డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయండిలా!

  • ముందుగా మీరు https://parivahan.gov.in. వెబ్​ పోర్టల్ ఓపెన్ చేయాలి.
  • హోమ్‌పేజీలోని "డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు" ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • వెంటనే అప్లికేషన్ ఫారమ్​​ ఓపెన్ అవుతుంది. అవసరమైతే దాని ప్రింట్అవుట్​ తీసుకోవాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో అడిగిన వివరాలు అన్నీ నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
  • అక్కడున్న సూచనల ప్రకారం దరఖాస్తు రుసుము చెల్లించాలి.
  • మీ ప్రాధాన్యతను బట్టి మీరు ఆన్​లైన్ లేదా ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, అవసరమైన పత్రాలతో ఆర్టీఓ ఆఫీస్​కు వెళ్లాలి.
  • మీ డ్రైవింగ్ నైపుణ్యాన్ని రుజువు చేసే ఆధారాలను ఆర్టీఓకు చూపించాలి.
  • మీ డ్రైవింగ్ స్కిల్స్ పెర్ఫెక్ట్​గా ఉన్నట్లయితే, డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు.

జరిమానాలు
కొత్త నిబంధనల ప్రకారం, దాదాపు 9 లక్షల పాత ప్రభుత్వ వాహనాలను దశలవారీగా తొలగిస్తారు. పర్యావరణ కాలుష్యం తగ్గించడమే దీని లక్ష్యం. ఎవరైనా మితిమీరిన వేగంతో బండి నడిపితే రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానా విధిస్తారు. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడినట్లయితే రూ.25 వేలు జరిమానా విధిస్తారు. అంతేకాదు సదరు వాహన యజమాని డ్రైవింగ్ రిజిస్ట్రేషన్ కార్డును కూడా క్యాన్సిల్ చేస్తారు. పట్టుబడిన మైనర్​కు 25 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు డ్రైవింగ్​ లైసెన్స్ ఇవ్వరు.

ఆన్​లైన్ మోసాలు - ఎన్ని రకాలుగా చేస్తున్నారో తెలుసా? - Types Of Online Fraud

మరణించిన వ్యక్తి 'ఆధార్​' ఏమవుతుంది? ఆటోమేటిక్​గా క్లోజ్ అవుతుందా? లేదా సరెండర్ చేయాలా? - Aadhaar Of The Deceased Person

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.