New Bikes Launched In 2024 : యువతీయువకులకు బైక్స్ & స్కూటీస్ అంటే ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ నేటి యువతీయువకుల అభిరుచులకు అనుగుణంగా లేటెస్ట్ ఫీచర్లతో, సూపర్ మోడల్ బైక్‌లను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలో 2024లో విడుదలైన బైక్స్, స్కూటర్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.
1. Royan Enfield Shotgun 650 Features : ఈ ఏడాది లాంఛ్ అయిన బెస్ట్ బైక్స్‌లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 650 ఒకటి. దీనిలో 648 cc సామర్థ్యం గల ఇంజిన్ అమర్చారు. ఇది 7250 rpm వద్ద 47.65 PS పవర్, 5250 rpm వద్ద 52 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పని చేస్తుంది. ఈ బైక్ లీటర్‌కు 22 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
Royan Enfield Shotgun 650 Price : మార్కెట్లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 650 ధర సుమారుగా రూ.3.59 లక్షల నుంచి రూ.3.73 లక్షల ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. Revolt RV400 BRZ Features : ఈ రివోల్ట్ ఆర్వీ400 అనేది ఒక ఎలక్ట్రిక్ బైక్. దీనిలో 3.24 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. దీనికి 5 సంవత్సరాలు లేదా 75,000కి.మీ వారెంటీ ఇస్తున్నారు. ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది.
Revolt RV400 BRZ Price : మార్కెట్లో ఈ రివోల్ట్ ఆర్వీ 400 బైక్ ధర సుమారుగా రూ.1.27 లక్షల నుంచి రూ.1.44 లక్షల వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. Kawasaki Eliminator Features : ఈ కవాసకి ఎలిమినేటర్ బైక్‌లో 451 cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అమర్చారు. ఇది 9000 rpm వద్ద 45 PS పవర్, 6000 rpm వద్ద 42.6 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ లీటర్‌కు 30 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ సింగిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది.
Kawasaki Eliminator Price : మార్కెట్లో ఈ కవాసకి ఎలిమినేటర్ బైక్ ధర సుమారుగా రూ.5.62 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. Jawa 350 Features : ఈ జావా 350 బైక్‌లో 334 cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అమర్చారు. ఇది 22.57 PS పవర్, 28.1 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ లీటర్‌కు 30 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ బైక్ మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
Jawa 350 Price : మార్కెట్లో ఈ జావా 350 బైక్ ధర సుమారుగా రూ.2.15 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. Husqvarna Svartpilen 401 Features : ఈ హుస్క్వర్నా స్వర్ట్పిలెన్ 401 బైక్‌లో 373 cc సామర్థ్యంగల ఇంజిన్ అమర్చారు. ఇది 9000 rpm వద్ద 44 HP పవర్, 7000 rpm వద్ద 37 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ లీటర్‌కు 29 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ నాలుగు వేరియంట్లో లభిస్తుంది.
Husqvarna Svartpilen 401 Price : మార్కెట్లో ఈ హుస్క్వర్నా స్వర్ట్పిలెన్ 401 బైక్ ధర సుమారుగా రూ.1.55 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
6. Honda NX500 Features : ఈ హోండా ఎన్ఎక్స్500 బైక్‌లో 471 cc సామర్థ్యంగల ఇంజిన్ అమర్చారు. ఇది 8600 rpm వద్ద 47.5 PS పవర్, 6500 rpm వద్ద 43 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ లీటర్‌కు 27.78 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
Honda NX500 Price : మార్కెట్లో ఈ హోండా ఎన్ఎక్స్500 ధర సుమారుగా రూ.5.90 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
7. Hero Xtreme 125R Features : ఈ హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ బైక్‌లో 124.7 cc సామర్థ్యంగల ఇంజిన్ అమర్చారు. ఇది 8350 rpm వద్ద 11.55 PS పవర్, 6000 rpm వద్ద 10.5 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ లీటర్‌కు 66 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
Hero Xtreme 125R Price : మార్కెట్లో ఈ హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ బైక్ ధర సుమారుగా రూ.95,000 నుంచి రూ.90,500 వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
8. Bajaj Chetak Premium Features : భారతదేశంలో ఒకప్పుడు బజాజ్ చేతక్ స్కూటర్ ఎంతో పాపులర్. అందుకే బజాజ్ఆటో కంపెనీ దానిని మరలా ఎలక్ట్రిక్ వెర్షన్‌లోకి తెచ్చింది. దీనిలో 3.2 కిలోవాట్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని అమర్చారు. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 127 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఈవీ స్కూటర్‌తో గరిష్ఠంగా గంటకు 73 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు.
Bajaj Chetak Premium Price : మార్కెట్లో ఈ బజాజ్ చేతక్ ప్రీమియం స్కూటర్ ధర సుమారుగా రూ.1.44 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
9. Ather 450 Apex Features : బెంగళూరు బేస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాన్యుఫాక్చురర్ ఏథర్ ఎనర్జీ ఈ 2024లో ఏథర్ 450 అపెక్స్ బైక్‌ను లాంఛ్ చేసింది. దీనిలో 3.7 కిలోవాట్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని అమర్చారు. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 157 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఈవీ స్కూటర్‌తో గరిష్ఠంగా గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు.
Ather 450 Apex Price : మార్కెట్లో ఈ ఏథర్ 450 అపెక్స్ స్కూటర్ ధర సుమారుగా రూ.1.89 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కొత్త కారు కొనాలా? కొద్ది రోజుల్లో లాంఛ్ కానున్న టాప్-10 మోడల్స్ ఇవే!