ETV Bharat / business

మీరు త్వరగా కోటీశ్వరులు కావాలా? 15x15x15 రూల్ ఫాలో అయిపోండి! - 15x15x15 Investing Rule

15x15x15 Investing Rule : మీరు కోటీశ్వరులు కావాలని కలలుకంటున్నారా? ఆ కలను నిజం చేసుకునే మార్గం మీ చేతిలోనే ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌లో 15x15x15 రూల్​తో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ కలను సాకారం చేసుకోవచ్చు. అసలేంటి ఈ రూల్? ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 8, 2024, 12:07 PM IST

15x15x15 formula
mutual fund investment tips in telugu (Etv Bharat)

15x15x15 Investing Rule : డబ్బుతో నడిచే ఈ ప్రపంచంలో చాలా మంది భారీగా సంపదను సృష్టించుకోవాలని కలలుకంటుంటారు. దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవడంలో మ్యూచువల్​ ఫండ్స్​ మంచి ఆప్షన్​ అవుతాయి. అయితే ఇందులోనూ కొన్ని ట్రిక్స్​ ఉంటాయి! కొన్ని రూల్స్​ పాటిస్తే అనుకున్న దాని కన్నా తక్కువ సమయంలోనే కోటీశ్వరులు కావొచ్చు! ఇలాంటి వాటిల్లో ఒకటే ఈ '15x15x15' రూల్​. ఈ రూల్​​తో 15 ఏళ్లలోనే మీరు కోటీశ్వరులు అవ్వొచ్చు! అదెలాగంటే?

15x15x15 రూల్​ అంటే ఏంటి?
మ్యూచువల్​ ఫండ్​లో 15x15x15 రూల్​కు చాలా ప్రాముఖ్యత ఉంది. దీని ప్రకారం, మీరు 15ఏళ్ల పాటు, నెలకు రూ.15వేలు చొప్పున 15 శాతం యాన్యువల్​ రిటర్నులు ఇచ్చే మ్యూచువల్​ ఫండ్​లో సిప్​ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంది.

దీనిని మరింత వివరంగా చెప్పుకోవాలంటే, మీరు నెలకు రూ.15వేలు చొప్పున పెట్టుబడి పెట్టాలి. ఇలా 15ఏళ్ల పాటు చేయాలి. దీని వల్ల మీరు పెట్టే పెట్టుబడి మొత్తం విలువ రూ.27 లక్షలు అవుతుంది. దీనిపై మీకు 15 శాతం వార్షిక రాబడి వచ్చిందంటే చాలు. మీ చేతికి కోటి రూపాయలు వస్తాయి.

  • కావాల్సిన సంప‌ద : రూ.1 కోటి
  • 15 సంవత్సరాల్లో మీరు మదుపు చేసే మొత్తం : రూ.27,00,000
  • రాబ‌డి (15 శాతం వార్షిక అంచ‌నాతో) : రూ.74,52,946
  • మొత్తం కార్పస్​ : రూ.1,01,52,946

15x15x15 రూల్ పని చేస్తుందా?
15x15x15 రూల్ కచ్చితంగా పనిచేస్తుందని చెప్పలేం. ఎందుకంటే స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు, అస్థిరతలు చాలా సహజం. అందువల్ల అన్ని వేళలా మ్యూచువల్ ఫండ్స్​లో లాభాలు వస్తాయని చెప్పలేము. కానీ దీర్ఘకాలిక పెట్టుబడులపై మాత్రం కచ్చితంగా లాభాలు సంపాదించవచ్చని చరిత్ర చూస్తే తెలుస్తుంది.

గమనిక : 15x15x15 పెట్టుబడి సూత్రంలో చిన్న లోపం కూడా ఉంది. ఇది ఒక ఊహాజనితమైన పెట్టుబడి సూత్రం. పైగా ఇది మ్యూచువల్ ఫండ్​ పెట్టుబడులపై విధించే రుసుములు, పన్నుల గురించి ఏమీ తెలియజేయదు. అంతేకాదు మీకు వచ్చే రాబడి కచ్చితంగా 15 శాతం ఉంటుందని చెప్పలేము. ఇది పెరగవచ్చు లేదా బాగా తగ్గవచ్చు కూడా. కనుక వీటన్నింటినీ పరిగణిస్తే, మీ చేతికి వచ్చే రాబడి కొంచెం తగ్గే అవకాశం ఉంది.

పోర్ట్​ఫోలియో డైవర్సిఫికేషన్​
మీ పెట్టుబడులు వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం బంగారం, స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్, ఫిక్స్​డ్ డిపాజిట్లు లాంటి వివిధ పెట్టుబడి మార్గాల్లో మీ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. అలా కాకుండా కేవలం ఏదో ఒకదానిలో పెట్టుబడిపెడితే నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

మీ బ్యాంకులు Re-KYC అడుగుతున్నాయా? ఆన్‌లైన్‌లోనే ఈజీగా చేసుకోండిలా! - What Is Re KYC

మారుతి కార్ లవర్స్​కు గుడ్ న్యూస్​ - ఆ మోడల్స్​పై ఏకంగా రూ.74,000 డిస్కౌంట్​! - Maruti Suzuki Discounts in June 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.