ETV Bharat / business

వర్షాకాలంలో ఉపయోగపడే టాప్​-10 కార్​ & బైక్ డ్రైవింగ్​ టిప్స్ ఇవే! - Monsoon Driving Tips

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 3:49 PM IST

Monsoon Driving Tips : వర్షాకాలంలో వాహనాల నిర్వహణ పెద్దసవాలే. ఎందుకంటే వర్షాల వల్ల వాహనం బాడీ మొత్తం ప్రభావితం అవుతుంది. ప్రత్యేకించి వర్షం కురుస్తుండగా డ్రైవింగ్ చేయడం పెద్ద సవాల్‌తో కూడుకున్న పనే. వానల్లో మన జర్నీ సేఫ్‌గా సాగాలంటే అప్రమత్తత అత్యవసరం. వాహనం కండిషన్‌లో ఉండటం అంతకంటే అత్యవసరం. అందుకే వర్షాకాలంలో కారు, బైక్ నిర్వహణకు సంబంధించిన టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

MONSOON BIKE DRIVING TIPS
MONSOON CAR DRIVING TIPS (ANI)

Monsoon Driving Tips : వర్షాకాలం వచ్చిందంటే చాలు వాహనదారులు అలర్ట్ కావాలి. తమ వాహనాలను కండిషన్‌లో ఉంచుకోవడంపై ఫోకస్ పెట్టాలి. లేదంటే వర్షాల వేళ సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. బైక్ అయినా, కారు అయినా అలర్ట్‌గా ఉండటం ప్రతీ వాహనదారుడి బాధ్యత. దీనివల్ల వాహనం జీవిత కాలం పెరగడంతో పాటు ప్రమాదాల ముప్పు తగ్గిపోతుంది. అందుకే వర్షకాలంలో మన భద్రతకు భరోసా ఇచ్చే కారు, బైక్ డ్రైవింగ్ టిప్స్‌ను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కారు టైర్ల నిర్వహణ కీలకం
మీ కారు టైర్ల నిర్వహణపై ప్రధానంగా శ్రద్ధ పెట్టండి. టైర్లు ఎలా ఉన్నాయి? వాటి త్రెడ్స్ డెప్త్ ఎలా ఉంది? వర్షంలో వేగంగా డ్రైవింగ్ చేస్తే టైర్లు తట్టుకోగలవా? నీటిలో స్లిప్ అయ్యే రిస్క్ ఉందా? అనే ప్రశ్నలు వేసుకోండి. మీకు ఈజీగా సమాధానాలు దొరికిపోతాయి. ఈ విశ్లేషణ ఆధారంగా టైర్ల నిర్వహణ కోసం ఏం చేయాలో అది చేయండి. ఇక టైర్లలో నిర్దిష్టంగా గాలి ఉండేలా చూసుకోండి. కారులోని క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ ఎయిడ్ ఆప్షన్లను స్విచ్ ఆఫ్ చేయండి. కారు తడిగా ఉన్నప్పుడు క్రూయిజ్ కంట్రోల్ స్విచ్ ఆఫ్ చేయడం చాలా బెటర్. కారులోని అన్ని ఎలక్ట్రికల్ సిస్టమ్‌లను ఒకసారి మెకానిక్ ద్వారా తనిఖీ చేయించండి. కారులో ఎలాంటి ఓపెన్ వైరింగ్ లేకుండా జాగ్రత్తపడండి. కారులోని మెకానికల్ సిస్టమ్‌లు, ఇంధనం ట్యాంకు, లైట్లను చెక్ చేయించుకోండి.

ఇవి కండిషన్​లో ఉండాల్సిందే!
కారులోని బ్రేక్ ప్యాడ్‌లు కండిషన్‌లో ఉండేలా చూసుకోండి. వాహనంలోని హెడ్ లైట్లు, టెయిల్ లైట్లు బాగా పని చేయాలి. వర్షాకాలంలో వీటి వినియోగం తప్పనిసరి. వర్షంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఈ లైట్ల వినియోగం ఎక్కువగా జరుగుతుంది. వీటిని చూసే ఇతర వాహనదారులు అలర్ట్ అవుతుంటారు. కారులోకి వర్షపు నీరు లీక్ అవుతోందా? ఏదైనా భాగానికి తుప్పు పట్టిందా? అనేది కూడా చూసుకోండి. తుప్పు ఉంటే వెంటనే దానికి సంబంధించిన పరిష్కారం కోసం సంబంధిత నిపుణుడిని సంప్రదించండి. వర్షాలు కురిసేటప్పుడు జర్నీ చేయాలంటే, కారులోని వైపర్‌లు, డీఫాగర్, వాషర్‌లు కండిషన్‌లో ఉండాలి. వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. వర్షాకాలంలో అతివేగంగా డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం. మన ముందు వెళ్తున్న వాహనం నుంచి కొంత దూరాన్ని మెయింటైన్ చేయాలి. సడెన్ బ్రేక్ వేద్దామనే భావన సరికాదు. ఎందుకంటే, వర్షకాలంలో సడెన్ బ్రేక్ వేస్తే కారు అదుపు తప్పే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

వానల్లో బైక్ కండీషన్‌ ఇలా!

  • వర్షకాలంలో బైక్‌లు, స్కూటర్లు కండిషన్‌లో ఉండేందుకు వాటి టైర్ల నిర్వహణకే వాహనదారులు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • వర్షకాలంలో బైక్‌పై జర్నీ చేసేటప్పుడు మంచి రెయిన్ కోట్ ధరించాలి. దీనివల్ల ప్రయాణానికి తాత్కాలికంగా ఎలాంటి ఆటంకమూ ఏర్పడదు.
  • వర్షం విపరీతంగా ఉంటే, కాసేపు ఆగిపోవడమే బెటర్. రెయిన్ కోటుపై రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్ ఉంటే చాలా సేఫ్. వీటివల్ల వెనుక నుంచి వచ్చే వాహనదారులకు వర్షంలోనూ మన కదలికలపై స్పష్టమైన క్లారిటీ వస్తుంది.
  • వాటర్ ప్రూఫ్ బూట్లు ధరిస్తే వానల్లో సౌకర్యవంతంగా డ్రైవింగ్ చేసే వీలు కలుగుతుంది.
  • వానలో మీ హెల్మెట్‌పై డార్క్ లేదా టింటెడ్ విజర్‌లను ఉపయోగించకూడదు.
  • బైక్‌లోని టైర్ల కండిషన్ ఆధారంగా మనం బ్రేకులు వేయాలి.
  • టైర్లు కండిషన్‌లో లేనప్పుడు సడెన్ బ్రేకులు ప్రమాదాలను కొనితెస్తాయి. కనుక
  • వర్షాకాలంలో సడెన్ బ్రేకులు వేయడం, వేగంగా డ్రైవింగ్ చేయడం మంచిది కాదు.
  • రోడ్లపై ఉండే లేన్ సెపరేటర్లు, జీబ్రా క్రాసింగ్‌లు, మ్యాన్‌హోల్ కవర్‌లు తడిగా ఉన్నప్పుడు జారే అవకాశం ఉంటుంది. అందుకే వర్షాకాలంలో వాటి మీదుగా వెళ్లేటప్పుడు వేగం తగ్గించాలి.
  • వర్షం పడుతుండగా డ్రైవింగ్ చేస్తున్నట్లయితే హెడ్‌లైట్‌లు ఆన్‌లో ఉంచుకోవాలి.
  • వర్షంలో తడిసిన తర్వాత బైకుల బాడీ, రీములు తుప్పు పట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే వాటిని క్లీన్‌గా సర్వీసింగ్ చేయించాలి.
  • బైక్​ చైన్ నిర్వహణపైనా శ్రద్ధ పెట్టాలి.

ఎంతో ఇష్టపడి కొత్త బైక్​ కొనుక్కున్నారా? ఈ టాప్​-10 మెయింటెనెన్స్​ టిప్స్​ మీ కోసమే! - Bike Maintenance Tips

టాటా కార్​ లవర్స్​కు గుడ్ న్యూస్​ - త్వరలో లాంఛ్​ కానున్న టాప్​-9 మోడల్స్ ఇవే! - Upcoming Tata Cars In 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.