MG Displays 3 New EV Cars In India : ఎంజీ మోటార్ ఇండియా 'MG 2.0' ఇనీషియేటివ్‌లో భాగంగా బుధవారం మూడు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో ప్రదర్శించింది. అవి : ఎంజీ 4, ఎంపీ 5, ఎంజీ సైబర్‌స్టర్. వీటిలో ఎంజీ సైబర్‌స్టర్ అనేది ఒక ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ కావడం గమనార్హం.
త్వరలోనే లాంఛ్!
వాస్తవానికి ఎంజీ మోటార్ ఇండియా తాము రూపొందించిన ఎంజీ 4 ఈవీని 2023 ఆటో ఎక్స్‌పోలోనే ప్రదర్శించింది. మళ్లీ ఇప్పుడు మిగతా రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్(ఎంజీ 5, ఎంజీ సైబర్‌స్టర్)తో కలిపి మరోసారి దానిని ప్రదర్శించింది. త్వరలోనే వీటిని లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇవే కనుక లాంఛ్ అయితే ఎంజీ కోమెట్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ కార్ల సరసన ఇవి చేరతాయి.
MG 4 EV Features :
ఎంజీ ఈవీ ఎక్స్టీరియర్ చూడడానికి స్లీక్ లైన్స్‌తో, పాలిష్డ్ సర్ఫేస్తో చాలా ఆకర్షణీయంగా ఉంది. దీనిని సైబర్‌స్టర్ రోడ్‌స్టర్ కాన్సెప్ట్‌ను ఇన్స్పిరేషన్గా తీసుకుని తీర్చిదిద్దారు.
ఇంటీరియర్ విషయానికి వస్తే, దీనిలో రెండు ఫ్లోటింగ్ స్క్రీన్లను అమర్చారు. ఒకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రెండోది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. దీనిలో సెంటర్ కన్సోల్, రోటరీ డయెల్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉన్నాయి. అలాగే దీనిలో 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, ఏడీఏఎస్ టెక్నాలజీలను పొందుపరిచారు.
MG 4 EV Powertrain Range :
ఈ ఎంజీ 4 ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. అవి: 51 కిలోవాట్, 64 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీలు. ఇవి వరుసగా 170 హెచ్‌పీ, 203 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తాయి. ఈ రెండు వెర్షన్లు కూడా 250 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తాయి. ఈ బ్యాటరీలు ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి. 150 కిలోవాట్ డీసీ ఛార్జర్‌తో వీటిని ఫాస్ట్ ఛార్జ్ చేయవచ్చు. 51 కిలోవాట్ బ్యాటరీ ఉన్న ఎంజీ 4 డ్రైవింగ్ రేంజ్ 350 కి.మీ; 51 కిలోవాట్ బ్యాటరీ ఉన్న ఎంజీ 4 రేంజ్ 452 కి.మీ రేంజ్ ఉంటుంది.
ఎంజీ+జేఎస్‌డబ్ల్యూ
భారతదేశ ఉక్కు పరిశ్రమలో అగ్రగామి సంస్థ అయిన జిందాల్ గ్రూప్ (జేఎస్‌డబ్ల్యూ), ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన మోరిస్ గ్యారేజ్ (ఎంజీ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి భారతదేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ఉత్పత్తి చేయనున్నారు. ముంబయిలో నిర్వహించిన ఈవీ కార్ల ప్రదర్శన సందర్భంగా విషయాన్ని ప్రకటించాయి.
ప్రతి నాలుగు నెలలకో కొత్త కారు లాంఛ్!
"జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ప్రపంచంలోనే ఏడో అతిపెద్ద స్టీల్ కంపెనీ. భారత్‌లో అయితే రెండో లార్జెస్ట్ కంపెనీ. మాకు 23 బిలియన్ డాలర్ల మార్కెట్ షేర్ ఉంది. ఇప్పుడు మేము ఎంజీతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాం. ఇప్పుడు మేము హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్ల తయారుచేస్తాం. ప్రస్తుతానికి పట్టణాల్లో మాత్రమే బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. కానీ రూరల్ ఏరియాల్లో అవి లభించడం లేదు. అందుకే మేము హైబ్రీడ్ కార్లను రూపొందించాలని నిర్ణయించుకున్నాం. ఈ సెప్టెంబర్ నుంచి ప్రతి మూడు, నాలుగు నెలలకు ఒక కొత్త కారు లాంఛ్ చేస్తాం. అంతే కాదు వాటిని విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం."
- సజ్జన్ జిందాల్, జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్
మారుతి సుజుకిని మించి!!
'1984లో మారుతి సుజుకి కంపెనీ భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించింది. ఫియట్, అంబాసిడర్ కార్లను వెనక్కు నెట్టి మారుతి కార్లను ప్రజలకు చేరువ చేసింది. ప్రస్తుతం 50% దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీని తన కంట్రోల్లో ఉంచుకుంది. ఇప్పుడు మేము కూడా మారుతిలాగానే ఎలక్ట్రిక్ వాహనాల ప్రొడక్షన్లో ఒక పెద్ద విప్లవం తీసుకువస్తాం. త్వరలోనే సరికొత్త టెక్నాలజీతో జేఎస్‌డబ్ల్యూ-ఎంజీ ఫస్ట్ ఇండియన్ ఎలక్ట్రిక్ కారను లాంఛ్ చేస్తాం' అని జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ పేర్కొన్నారు.
వేసవిలోనూ ఎలక్ట్రిక్ వెహికల్ మంచి కండిషన్లో ఉండాలా? ఈ 5 ప్రో టిప్స్ మీ కోసమే!
కొత్త కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్-5 వెహికల్స్ ఇవే!