ETV Bharat / business

మారుతి ఆల్టో కారు ధర తగ్గింపు-వెంటనే అమల్లోకి- ఎంతో తెలుసా? - ఆల్టో కే 10 కారుపై భారీ తగ్గింపు ధర

Maruti Alto K10 Price Cut Offer : మీరు కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మంచి ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నారా? ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి సంస్థ ఆల్టో కె10 కారుపై ధరను తగ్గించింది. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దామా మరి.

car discount offers february 2024
Maruti Alto K10 Discount Offer
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 6:54 PM IST

Maruti Alto K10 Price Cut Offer : చాలా మంది మంచి ఆఫర్లు ఉన్న సమయంలో కార్లు కొనుగోలు చేద్దామని ఎదురు చూస్తుంటారు. ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తారు. మీరు కూడా అలాంటి ఆఫర్ల కోసమే ఎదురు చూస్తున్నట్లయితే మీకో సువర్ణావకాశం వచ్చింది. ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఆల్టో కారు ధరను తగ్గించింది. ఈ ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని వివరించింది. దీంతో పాటు అనేక కంపెనీలు తమ కస్టమర్లకు డిస్కౌంట్​లను అందిస్తున్నాయి. మరి ఆ వివరాలేంటో ఓ సారి చూద్దామా?

ఏయే వేరియంట్లపై డిస్కౌంట్ ఇస్తోందంటే?
మారుతి సుజుకి సంస్థ ఆల్టో కె10 మోడల్​ కారు ధరలను సవరించింది. ఆయా వేరియంట్​లపై ఈ డిస్కౌంట్​ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయి. అయితే కారు వేరియంట్ అనుగుణంగా వాటి ధరల్లో మార్పు ఉండవచ్చు. ఆల్టో కె10 కార్ల సిరీస్​లోని VXi AGS, VXi +AGS వేరియంట్లపై రూ.5,000 తగ్గించింది. ఆల్టో కె 10 VXi AGS ధర మార్కెట్​లో సుమారుగా రూ.5.56 లక్షలు ఉండగా, VXi +AGS కారు ధర రూ.5.85లక్షలుగా ఉంది.

మిగిలిన వేరియంట్ల ధరల్లో మార్పులేదు
మారుతి ఆల్టో కె10 కారుకు సంబంధించిన మిగిలిన అన్ని వేరియంట్ల ధరల్లో ఎలాంటి మార్పులేదని సంస్థ తెలిపింది. ఆల్టో కె10 నాలుగు వేరియంట్లలో ఉండగా, వాటి ధరలు రూ.3.99 లక్షలు నుంచి 5.96 లక్షలు(ఎక్స్​ షోరూం) ఉన్నాయి.

VW Virtus Car - Discount Offer : ఈ వీడబ్ల్యూ వర్చ్యుస్​ల కారు కొనుగోలుపై రూ.52 వేల వరకు క్యాష్​బ్యాక్​ లభిస్తుంది.

VW Virtus కారుపై మీకు లభించే ఆఫర్లు ఇవే!

  • క్యాష్ బ్యాక్​ ఆఫర్​ రూ.10 వేలు
  • ఎక్స్ఛేంజీ ఆఫర్​-రూ.30వేలు
  • కార్పొరేట్​ - రూ.12వేలు
  • డిస్కౌంట్​, క్యాష్​ బ్యాక్​, ఎక్స్ఛేంజ్​ ఆఫర్​లు వీటన్నింటిని కలిపి రూ. 52 వరకు డిస్కౌంట్​ ధరతో కారు సొంతం చేసుకోవచ్చు.
  • VW Taigun : ఈ కారు కొనుగోలుపై రూ.1.3 లక్షల బెనిఫిట్స్​ను సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగంటే రూ.60 వేల రూపాయల క్యాష్​ బ్యాక్​ ఆఫర్​, రూ.40 వేల వరకు ఎక్స్ఛేంజ్​ ద్వారా, రూ.30వేలను కార్పొరేట్​ డిస్కౌంట్​తో కలిపి సుమారు రూ.1.3 లక్షల బెనిఫిట్స్​ను పొందవచ్చు.
  • Skoda Slavia, Kushaq : ఈ స్కోడా స్లేవియా కారు కొనుగోలుపై రూ.1.5లక్షల బెనిఫిట్స్​ను పొందవచ్చు.

Tata Motors - Discount Offers : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన కస్టమర్లకు ​వివిధ కార్ల కొనుగోలుపై పలు డిస్కౌంట్​లను ఇస్తోంది. అవేంటో ఓ సారి చూద్దాం.

  1. Tata Tiago Petrol : టాటా టియాగో పెట్రోల్​ కారు కొనుగోలుదారులు రూ.40వేల క్యాష్​బాక్​ను పొందవచ్చు. దీంతో పాటు రూ.15 వేల వరకు ఎక్స్ఛేంజ్​ ఆఫర్​ను పొందవచ్చు.
  2. Tata Tigor Petrol : ఈ కారు కొనుగోలుపై రూ.45 వేల వరకు క్యాష్​ బ్యాక్​ను పొందవచ్చు. దీంతో పాటు రూ.15వేలు వరకు ఎక్స్ఛేంజ్​ ఆఫర్​ కూడా ఉంది.
  3. Tata Tiago CNG, Tigor CNG : ఈ టాటా టియాగో కారు కొనుగోలుపై రూ. 60వేల వరకు క్యాష్​బ్యాక్​ ఆఫర్​ను పొందవచ్చు(సింగిల్​ సిలిండర్), డబుల్​ సిలిండర్​ కారుపై రూ.35 వేల వరకు క్యాష్​ బ్యాక్​ను సొంతం చేసుకోవచ్చు.

ఫ్యామిలీతో జర్నీ కోసం 7 సీటర్​ కారు కొనాలా? మార్కెట్లో బెస్ట్ మోడల్స్ ఇవే!

కొత్త ఇంజిన్- 13రంగులు- మారుతి స్విఫ్ట్ నయా మోడల్ ఫీచర్లు అదుర్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.