ETV Bharat / business

ఉద్యోగులకు అలర్ట్​ - ఆ డబ్బులు కావాలంటే మరో 2 రోజుల్లో ఇలా చేయాల్సిందే! - LTA Claim Last Date - LTA CLAIM LAST DATE

LTA Claim Last Date : ఉద్యోగులు తమ 'లీవ్​ ట్రావెల్ అలవెన్స్' (LTA) క్లెయిమ్ చేయడానికి మరో రెండు రోజులే ఛాన్స్ ఉంది. కనుక మార్చి 31లోపు ఎల్​టీఏ క్లెయిమ్ చేస్తేనే, ఉద్యోగులకు పన్ను మినహాయింపులు లభిస్తాయి. అందుకే ఎల్​టీఏను ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

LTA CLAIM LAST DATE
HOW TO CLAIM LTA
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 1:19 PM IST

LTA Claim Last Date : 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 2 రోజులే ఉంది. అందుకే లీవ్​ ట్రావెల్ అలవెన్స్​ (ఎల్​టీఏ)ని క్లెయిమ్ చేసుకోని ఉద్యోగులు అందరూ మార్చి 31లోపు, పన్ను మినహాయింపు కోసం, తమ ప్రయాణ పత్రాలను హెచ్​ఆర్​ డిపార్ట్​మెంట్​కు సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే ఆదాయ పన్ను చట్టం, 1961, సెక్షన్ 10(5) ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఎల్​టీఏ అంటే ఏమిటి?
ఒక యజమాని తమ ఉద్యోగులకు అందించే ప్రయాణ భత్యమే 'లీవ్​ ట్రావెల్ అలవెన్స్'​ (ఎల్​టీఏ). దీనిని ఒంటరిగా లేదా కుటుంబ సమేతంగా విహారయాత్రలకు వెళ్లేటప్పుడు ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఖర్చులను రీయింబర్స్​మెంట్ పొందడానికి, సదరు విహారయాత్రకు లేదా ప్రయాణానికి అయిన బిల్లులను యజమానికి సమర్పించాల్సి ఉంటుంది.

యజమాన్యాలు లేదా సంస్థలు - 'ఎంప్లాయీ కాస్ట్ టు కంపెనీ' (సీటీఏ)ను రూపొందిస్తుంటాయి. సాధారణంగా అప్పుడే ఉద్యోగులు ఎల్​టీఏ క్లెయిమ్​ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాయి.

పరిమితి వరకే!
ఒక సంస్థలో మీరు చేస్తున్న ఉద్యోగం స్థాయిని అనుసరించి, మీకు ఎంత ఎల్​టీఏ వస్తుందో నిర్ణయమై ఉంటుంది. కనుక ఈ పరిమితి మేరకే మీకు రీయింబర్స్​మెంట్ వస్తుంది. ఆ పరిమితికి మంచి చేసిన ఖర్చులపై ఆదాయపు పన్ను శ్లాబ్​ రేట్ల ప్రకారం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.

రెండు సార్లు మాత్రమే!
ఉద్యోగుల ఎల్​టీఏపై 4 సంవత్సరాల బ్లాక్​ ఉంటుంది. అందులో 2సార్లు మాత్రమే పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుత బ్లాక్​ 2022-25 వరకు ఉంది.

షరతులు వర్తిస్తాయి!

  • అంతర్జాతీయ పర్యటనలకు లీవ్ ట్రావెల్ అలవెన్స్​ ఇవ్వరు. కేవలం భారతదేశంలో చేసిన ప్రయాణాలకు మాత్రమే ఇస్తారు. కనుక పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి వీలవుతుంది.
  • ఉద్యోగి ఎక్కడికీ ప్రయాణించకుండానే, నగదు రూపంలో ఎల్​టీఏ పొందినట్లు అయితే పన్ను మినహాయింపు లభించదు. అంటే మీరు పొందిన మొత్తం ఎల్​టీఏ పన్ను పరిధిలోకి వస్తుంది.
  • ఉద్యోగి ఒంటరిగా లేదా కుటుంబంతో కలిగి ప్రయాణాలు చేయవచ్చు. అప్పుడు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్​ 10(5) ప్రకారం, పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇక్కడ కుటుంబం అంటే, ఉద్యోగి జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు. అలాగే సదరు ఉద్యోగిపై పూర్తిగా ఆధారపడిన తోబుట్టువులు, తల్లిదండ్రులు.
  • ఉద్యోగి ఎక్కడకు ప్రయాణించినా, షార్ట్​కట్​ రూట్​లో, ఎకానమీ క్లాస్​లో ప్రయాణించాలి. ముఖ్యంగా విమాన ప్రయాణాలు చేసేటప్పుడు ఈ నియమం వర్తిస్తుంది. అలా కాకుండా చిన్న మార్గాల్లో ప్రయాణించేటప్పుడు ఏసీ, ఫస్ట్ క్లాస్​లో కూడా ప్రయాణించవచ్చు.
  • ప్రయాణానికి అయిన ఖర్చులను మాత్రమే ఎల్​టీఏ కింద పరిగణిస్తారు. అదనపు ఖర్చులపై పన్ను మినహాయింపులు లభించవు.
  • ఉద్యోగి ఉన్న చోటు నుంచి అతను వెళ్లాల్సిన గమ్యస్థానానికి రైలు మార్గం ఉంటే, అందులో ప్రయాణించి ఎల్​టీఏ పొందవచ్చు. లేదా ఇతర ప్రయాణ మార్గాలను కూడా ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది.
  • ఒకవేళ ఉద్యోగి ఉన్న చోటు నుంచి అతను వెళ్లాల్సిన గమ్యస్థానానికి రైలు మార్గం లేకపోతే, అప్పుడు ఇతర ప్రయాణ మార్గాలను ఎంచుకొని ఎల్​టీఏ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.
  • ఒక వేళ రైలు మార్గం, ప్రభుత్వ రవాణా సౌకర్యాలు కూడా లేకపోతే, ఇతర గుర్తింపు పొందిన రవాణా వ్యవస్థను ఉపయోగించుకుని, ప్రయాణం చేయవచ్చు. అప్పుడు కూడా ఎల్​టీఏ మినహాయింపు పొందవచ్చు.

ఎల్​టీఏ కాలిక్యులేషన్​
లీవ్ ట్రావెల్ అలవెన్స్ గణన అనేది 1986లో ప్రారంభమైంది. ఈ సిస్టమ్​ ప్రకారం, 4 సంవత్సరాలు ఒక బ్లాక్​గా ఉంటుంది. 4 సంవత్సరాల బ్లాక్​లో ఉద్యోగి రెండు ప్రయాణాలకు మాత్రమే ఎల్​టీఏ ప్రయోజనాలు పొందడానికి వీలవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, బ్లాక్​ ఇయర్ అనేది ఆర్థిక సంవత్సరం కంటే భిన్నంగా ఉంటుంది.

ఎల్​టీఏ క్లెయిమ్ చేయడం ఎలా?
ఎల్​టీఏ క్లెయిమ్ చేయడానికి అర్హులైన ఉద్యోగులు, తమ ప్రయాణానికి అయిన బిల్లులను, (విమానం, రైలు, బస్సు, ఇతర రవాణా సాధానాల) టికెట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. తరువాత దరఖాస్తు ఫారమ్​ను నింపి, దానితో అవసరమైన అన్ని పత్రాలు, బిల్లులు, టికెట్లు జత చేసి, హెచ్​ఆర్​ డిపార్ట్​మెంట్ వాళ్లకు పంపాలి. వాళ్లు వీటిని తీసుకుని ఎల్​టీఏ క్లెయిమ్​ కోసం అప్లై చేస్తారు. వాస్తవానికి చాలా కంపెనీలు ముందుగానే ఎల్​టీఏ క్లెయిమ్ చేయడానికి తేదీలను ప్రకటిస్తుంటాయి.

ఉదాహరణకు, ఒక ఉద్యోగికి రూ.30,000 వరకు ఎల్​టీఏ క్లెయిమ్​ చేసుకోవడానికి అవకాశం ఉంది అనుకుందాం. కానీ అతను/ ఆమె రూ.20,000 వరకు మాత్రమే ఎల్​టీఏ క్లెయిమ్ చేసుకున్నాడు. అప్పుడు మిగిలిన రూ.10,000లను సదరు ఉద్యోగి ఆదాయానికి జోడిస్తారు. అప్పుడు దానిపై కూడా సదరు ఉద్యోగి ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది

ఫారిన్​ టూర్​కు ప్లాన్​ వేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! - Successful Foreign Trip

ఫైనాన్సియల్ డెడ్​లైన్స్​ - మార్చి 31లోగా ఇవి పూర్తి చేయాల్సిందే! - Financial Deadlines In March 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.