ETV Bharat / business

క్రెడిట్ కార్డ్​పై లోన్ -​ ఎప్పుడు తీసుకుంటే బెటర్​? - Loan against Credit Card - LOAN AGAINST CREDIT CARD

Loan Against Credit Card : మీరు క్రెడిట్ కార్డ్ యూజర్లా? క్రెడిట్​ కార్డ్​పై లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఎలాంటి సందర్భాల్లో క్రెడిట్​ కార్డు రుణాలను ఉపయోగించుకుంటే మంచిదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Loan against Credit Card
Loan against Credit Card (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 6, 2024, 5:01 PM IST

Loan Against Credit Card : మన జీవితంలో అకస్మాత్తుగా అనేక ఆర్థిక అవసరాలు వస్తుంటాయి. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో క్రెడిట్‌ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు నిత్యావసరంగా మారాయి. ఈ రోజుల్లో చెల్లింపులు చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు క్రెడిట్‌ కార్డులను వినియోగిస్తున్నారు. వీటిపై అనేక సంస్థలు రుణం కూడా అందిస్తున్నాయి. ప్రతి కార్డుపై బిల్లు చెల్లించడానికి కొంత సమయం ఉంటుంది. ఈ లోపు బిల్లు చెల్లించలేకపోతే ఈ మొత్తాన్ని రుణంగా మార్చమని మీ క్రెడిట్ కార్డు సంస్థను కోరవచ్చు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో క్రెడిట్‌ కార్డు రుణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటే మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్య అత్యవసర పరిస్థితి
కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రిలో వెంటనే చేర్చాల్సి వస్తుంది. కొంత మందికి ఆరోగ్య బీమా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా అది సరిపోకపోవచ్చు. ఇలాంటి సరిస్థితుల్లో క్రెడిట్‌ కార్డుపై ఆధారపడక తప్పదు.

ప్రయాణాలు
ఒక్కోసారి అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మనకు కావలసినవారు తీవ్ర అనారోగ్యానికి గురి కావడం లేదా మరణించడం వంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే అక్కడికి వెళ్లేందుకు విమాన ప్రయాణాలు లాంటివి తప్పనిసరి అవుతాయి. కుటుంబమంతటికి బస్సు, రైలు ప్రయాణం అంటే ఫర్వాలేదు గానీ, విమాన ప్రయాణం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇటువంటి సందర్భాల్లో ప్రయాణానికి చేతిలో నగదు లేకపోయితే, క్రెడిట్‌ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి.

వాహన రిపేర్లు
కొన్ని సార్లు వాహనాలు సడెన్​గా బ్రేక్‌డౌన్‌ అయ్యి, పెద్ద మరమ్మత్తులకు గురికావచ్చు. వెంటనే రిపేర్‌ చేయించకపోతే దానికి మరింత పెద్ద మరమ్మతులు జరగవచ్చు, ఆపై ఖర్చులు కూడా పెరగొచ్చు. ఇలాంటి పరిస్థితిలో చేతిలో తగినంత నగదు లేకపోయితే, అప్పుడు క్రెడిట్‌ కార్డును ఉపయోగించి ఆ ఖర్చులను భర్తీ చేయొచ్చు.

ఇంటి పునరుద్ధరణ
ఒక్కోసారి ప్రకృతి వైపరీత్యాల కారణంగా, అనుకోని ఘటనల వల్ల ఇంటికి పెద్దపెద్ద మరమ్మతులు చేయాల్సి రావచ్చు. వాటిని వెంటనే చేయించకపోతే ఇల్లు మరింత పాడవుతుంది. ఇంకా, ఇంటిని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో తక్కువ వడ్డీ రేట్లకు లభించే టాపప్‌ ఇంటి లోన్స్​ కోసం ప్రయత్నించవచ్చు. అది సాధ్యంకాని పరిస్థితిలో క్రెడిట్‌ కార్డు ద్వారా ఇంటి మరమ్మతు ఖర్చులను భర్తీ చేయొచ్చు.

ఉద్యోగం కోల్పోవడం
కొవిడ్‌ తర్వాత ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగులను విపరీతంగా తొలగించడం ప్రారంభమైంది. కనుక ఉద్యోగం కోల్పోవడం తాత్కాలిక ఒత్తిడికి దారి తీయచ్చు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎవరికైనా కనీసం 6 నెలలకు సరిపడా అత్యవసర నిధి ఉండాలి. కానీ, ఉద్యోగ సమయంలో తగిన ప్లానింగ్‌ లేని వారికి ఇది ఉండకపోవచ్చు. అలాంటి వారు కొన్ని నెలల పాటు తమ కుటుంబ ఖర్చుల కోసం క్రెడిట్‌ కార్డును ఉపయోగించుకోవచ్చు. అయితే, ఈ విధంగా క్రెడిట్ కార్డ్​ రుణం తీసుకునేవారు తగిన రీపేమెంట్‌ ప్లాన్‌ కలిగి ఉండాలి. లేకపోతే అప్పులు భారం భారీగా పెరిగిపోతుంది.

విద్యా ఖర్చులు
సాధారణంగా ఏటా జూన్‌ నెలలో విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీంతో ప్రతి కుటుంబానికి విద్యా ఖర్చులు చాలా భారం అవుతాయి. ఇద్దరు పిల్లలు ఉన్నవారికి పాఠశాల/కాలేజీ టర్మ్‌ ఫీజులు, పుస్తకాల ఖర్చులు వేలల్లో/లక్షల్లో అవ్వచ్చు. ఒక్కోసారి పిల్లల ఉన్నత చదువు విషయమై ఏదైనా పెద్ద విశ్వవిద్యాలయంలో సీట్ రావచ్చు. ఇలాంటప్పుడు క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకోవచ్చు.

క్రెడిట్‌ కార్డు కలిగి ఉండడం వల్ల ఆర్థికపరమైన క్లిష్ట పరిస్థితులను కొంతకాలం పాటు తట్టుకోవచ్చు. అయితే క్రెడిట్‌ కార్డు రుణాలపై వడ్డీ రేట్లు చాలా అధికంగా ఉంటాయి. కనుక వీటిని సకాలంలో చెల్లించే ప్రయత్నం చేయాలి. లేకపోతే మీరు అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం.

మీరు ఉద్యోగులా? '50:30:20 స్ట్రాటజీ'తో సాలరీని మేనేజ్ చేయండిలా! - How Much To Save In Salary

త్వరగా రిటైర్ కావాలని అనుకుంటున్నారా? 'FIRE స్ట్రాటజీ'పై ఓ లుక్కేయండి! - FIRE Strategy

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.