ETV Bharat / business

సత్య నాదెళ్ల చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే - ఉద్యోగులకు ప్రమోషన్ గ్యారెంటీ! - Satya Nadella Life Lessons - SATYA NADELLA LIFE LESSONS

Satya Nadella Life Lessons : మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన మైక్రోసాఫ్ట్​ సీఈఓగా బాధ్యతలు చేపట్టి 10 ఏళ్లు పూర్తయింది. ఈ దశాబ్ద కాలంలో మైక్రోసాఫ్ట్​ సంస్థను సత్య నాదెళ్ల అద్భుతమైన రీతిలో విజయపథంలో నడిపించారు. అలాంటి సత్య నాదెళ్ల తన విజయ రహస్యం గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అది తెలుసుకుంటే ఉద్యోగులకు ప్రమోషన్ గ్యారెంటీ!

Leadership Lessons from Satya Nadella
Microsoft CEO Satya Nadella (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 9, 2024, 3:16 PM IST

Satya Nadella Life Lessons : సత్య నాదెళ్ల - పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశంలో పుట్టి, పెరిగి ఇప్పుడు ప్రపంచ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్​కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా, సీఈఓగా పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ ఉన్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ప్రస్తుతం ఆయన నాయకత్వంలోనే విజయపథంలో నడుస్తోంది. మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్యనాదెళ్ల ఇటీవలే 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్​ను అభివృద్ధి పథంలో నడిపించడంలో సత్య నాదెళ్ల కీలక పాత్ర పోషించారు. అయితే సత్య నాదెళ్ల విజయం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అవేమిటో ఆయనే స్వయంగా పలు సందర్భాల్లో తెలియజేశారు. మరి మనమూ వాటి గురించి తెలుసుకుందామా?

'ఎక్కువగా వినండి- తక్కువగా మాట్లాడండి'
మనం ఏ పనిలో రాణించాలన్నా, 'ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి' అని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 2015లో వాల్​స్ట్రీట్ జర్నల్​కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అలాగే సమయం వచ్చినప్పుడు 'నిర్ణయాత్మకంగా ఉండాలని' సూచించారు. అంటే మీరు అనుకున్నది చేయడానికి దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

'చిన్న చిన్న విషయాలు కూడా ఎల్లప్పుడూ మన నియంత్రణలో ఉండవు. అయినప్పటికీ వాటిని మన అదుపులో పెట్టుకోవడానికి తగిన శక్తిని సంపాదించుకోవాలి' అని 2019లో చికాగో బూత్ మ్యాగజైన్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల చెప్పారు. అలాగే ప్రతి ఉద్యోగి అన్ని విషయాల్లోనూ నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. నైపుణ్యాలను పెంచుకోవడం వల్ల వారి పని సామర్థ్యం పెరుగుతుందని సత్య నాదెళ్ల స్పష్టం చేశారు.

నాయకత్వం అనేది విశేషాధికారమో, ప్రత్యేకమైన సౌకర్యమో కాదని సత్య నాదెళ్ల అన్నారు. సంస్థకు నాయకత్వం వహించేవారు ఉద్యోగుల భావనలు, ఆలోచనలు, సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. అదొక కష్టతరమైన స్కిల్ అని, దానిని నేర్చుకోవడం చాలా కష్టమని ఆక్సెల్ స్ప్రింగర్ మథియాస్ డాప్ఫ్నర్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

సంస్థల అధినేతలను ఉద్దేశిస్తూ, 'మీకు మీ ఉద్యోగుల పట్ల నమ్మకం ఉంటే, వారు మంచి పనితీరు కనబరుస్తారు. దీంతో మీరు కూడా అభివృద్ధి చెందుతారు' అని 2020లో ఓ పోడ్‌కాస్ట్ ఎపిసోడ్​లో సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు.

100 శాతం ఎఫర్ట్​ పెట్టాల్సిందే!

"30 ఏళ్ల క్రితం నేను మైక్రోసాఫ్ట్​లో చేరాను. అప్పుడు ఈ సంస్థకు నేను సీఈఓ అవుతానని అస్సలు ఊహించలేదు. సంస్థ నాకు అప్పగించిన ఏ పనినైనా సమర్థవంతంగా పూర్తి చేయడంపైనే దృష్టి సారించాను. తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ సీఈఓ స్థానానికి ఎదిగాను. ఇదే విధంగా ఉద్యోగులు అందరూ వీలైనంత వరకు ఉత్తమ పనితీరు కనబరచాలి. మంచి ఉద్యోగ అవకాశం వస్తే, అప్పుడే బాగా చేస్తాను అనే ఆలోచనను విడిచిపెట్టాలి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే మీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపించాలి. అలాగే ఎప్పటికప్పుడు సరికొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. టెక్నాలజీలను అవగాహన చేసుకోవాలి. అప్పుడే ఉన్నత స్థానాలను అధిరోహించగలుగుతారు."
- సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ

మైక్రోసాఫ్ట్ సీఈఓగా గత పదేళ్ల కాలంలో సత్య నాదెళ్ల వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. మైక్రోసాఫ్ట్ బింగ్, గేమింగ్ స్టోర్ యాప్ 'ఎక్స్​బాక్స్​ లైవ్'​ వంటి వాటిని అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

మీరు త్వరగా కోటీశ్వరులు కావాలా? 15x15x15 రూల్ ఫాలో అయిపోండి! - 15x15x15 Investing Rule

గతుకుల రోడ్లపై కూడా దూసుకుపోవాలా? ఈ టాప్-10 బైక్స్​పై ఓ లుక్కేయండి! - Best Off Road Bikes

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.