Jio Vodafone Plan Comparison : దేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా (Vi) తమ కస్టమర్ల కోసం రూ.699, రూ.701 అనే పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. జియో, వొడాఫోన్ ఐడియాలు పాన్ ఇండియా 4జీ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు. అయితే జియో తమ యూజర్లకు ఫ్రీ 5జీ నెట్వర్క్ సేవలను కూడా అందిస్తోంది. వొడాఫోన్ ఐడియా రూ.701 ప్లాన్‌పై ఎలాంటి 5జీ సర్వీస్‌లను అందించడం లేదు. ఇప్పుడు ఈ రెండు ప్లాన్‌లు అందిస్తున్న ప్రయోజనాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
రిలయన్స్ జియో రూ.699 ప్లాన్
రిలయన్స్ జియో రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 100జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తోపాటు 100 ఎస్ఎంఎస్లను ఫ్రీగా అందిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌తో మూడు అదనపు సిమ్‌లను కూడా పొందవచ్చు. ఒక్కొక్కటి నెలకు రూ.99 రీఛార్జ్‌తో వస్తుంది. దీనితో ప్రతి సిమ్‌పై నెలకు 5జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది.ఈ ప్లాన్ తీసుకున్నవారు నెట్‌ఫ్లిక్స్ (మొబైల్), అమెజాన్ ప్రైమ్, జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్లను ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్లాన్ అపరిమిత 5జీ డేటాను కూడా అందిస్తుంది.
వోడాఫోన్ ఐడియా రూ.701 ప్లాన్
వొడాఫోన్ ఐడియా తీసువచ్చిన ఈ రూ.701 ప్లాన్‌లో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, నెలకు అన్లిమిటెడ్ డేటా, 3000 ఎస్ఎంఎస్లు ఉంటాయి. మీరు ఈ ప్లాన్‌తో ఉపయోగించగల డేటా మొత్తానికి ఎలాంటి పరిమితి లేదు. ఈ ప్లాన్ అదనపు ప్రయోజనాలు 1 నెల ఉచిత హంగామా మ్యూజిక్, వీఐ మూవీస్ అండ్ టీవీ, వొడాఫోన్ ఐడియా గేమ్‌లు ఫ్రీగా ఉంటాయి. అలాగే ఆరు నెలల పాటు అమెజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ హాట్ స్టార్, సోనీ లైవ్ (12 నెలలపాటు), సన్ నెక్స్ట్, స్విగ్గీ, ఈజీ డినర్, నార్టన్, EaseMyTrip సబ్స్క్రిప్షన్స్, ఆఫర్స్ లభిస్తాయి. వొడాఫోన్ ఐడియా, జియో నుంచి వచ్చిన ఈ రెండు ప్లాన్‌లు యూజర్లకు ఎంతో ప్రయోజనాన్ని అందిస్తాయి. అందుకే మీ అవసరానికి అనుగుణంగా మీకు నచ్చిన ప్లాన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.
పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు - మరి ఖాతాదారుల డబ్బు సేఫేనా? లోన్స్ పరిస్థితి ఏమిటి?
యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ -ఎలా పొందాలో తెలుసా!