Jio Recharge OTT Benefits: ప్రముఖ నెట్‌వర్క్ కంపెనీ జియో తమ సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోసినిమా' ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరను ఇటీవల నెలకు రూ.29కి తగ్గించింది. కాగా, ఇది 4కే (4K) రిజల్యూషన్‌తో అంతర్జాతీయంగా పలు షోలు, సినిమాలకు యాక్సెస్‌ను అందిస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా తమ వినియోగదారుల కోసం జియో నెట్‌వర్క్ పలు రీఛార్జ్ ప్లాన్‌లపై JioCinema ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తోంది. ఇప్పటికే మీరు ఈ ప్లాన్ రిఛార్జ్ చేసుకున్నట్లయితే కొత్తగా సబ్‌స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అవేంటో ఒకసారి చూద్దాం.
ఈ మేరకు జియో ప్రస్తుతం జియో సినిమా (JioCinema) ప్రీమియంతో సహా వివిధ 4 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను అందిస్తోంది. ఈ నాలుగు ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను జియో టీవీ ప్రీమియం ప్లాన్‌లుగా కూడా పిలుస్తారు. ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసినప్పుడు జియో ఒక కూపన్‌ను అందిస్తుంది. దీనిని జియో సినిమాలో ఉచిత ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కోసం రీడీమ్ చేసుకోవచ్చు. ఇది చౌకైన ప్లాన్ ధర కేవలం రూ.148. కాగా, 4G నెట్‌వర్క్‌తో కూడిన 10 జీబీ డేటా 28 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే డేటా ప్లాన్ మాత్రమే. ఇందులో జియో సినిమా ప్రీమియం, సోనీ లైవ్, జీ5, Sun NXT, డిస్కవరీ ప్లస్ తోపాటు మరిన్ని 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.
రూ.389 రీఛార్జ్ చేస్తే!
రూ.389కే కాలింగ్, డేటా ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ జియో సినిమా ప్రీమియంతో సహా 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు సబ్‌స్క్రిప్షన్‌తో పాటు రోజుకు 4Gతో కూడిన 2 జీబీ డేటాను అందిస్తుంది. అంతేకాకుండా ఇది అదనంగా 4Gతో కూడిన 6 GB డేటాను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత 5G నెట్‌వర్క్‌కు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. మూడో ప్లాన్ ధర రూ. 1,198. ఇది 84 రోజుల చెల్లుబాటు అవుతుంది. మొదటి రెండు ప్లాన్‌లలో అందించే 12 OTT సబ్‌స్క్రిప్షన్‌లతో పాటు ఇది అదనపు ప్రైమ్ వీడియో మొబైల్ సబ్‌స్క్రిప్షన్, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ అదనపు ప్రయోజనాలు రోజుకు 4Gతో కూడిన 2 GB డేటా, అపరిమిత కాలింగ్ అవకాశం కల్పించింది.
చివరగా రూ.4,498 ధరతో వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఉంది. 365 రోజుల పాటు 5Gతో కూడిన 2 GB డేటా, 14 OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను అందిస్తోంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో వినియోగదారులు అదనంగా 78 GB 4G డేటాను కూడా పొందవచ్చు. ఒకసారి ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు ఈ ప్రయోజనాలన్నింటినీ పొందవచ్చు.