ETV Bharat / business

జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ - కాంప్లిమెంటరీగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్! - Jio New Prepaid Plans

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 4, 2024, 10:40 AM IST

Jio New Prepaid Plans : ఇటీవల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్​ ధరలను పెంచిన ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్​ జియో తమ వినియోగదారుల కోసం తాజాగా మూడు సరికొత్త ప్లాన్స్​ను తీసుకొచ్చింది. మూడు రీఛార్జ్​ ప్లాన్​లపై పలు ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా అందిస్తోంది.

Jio New Prepaid Plans
Jio New Prepaid Plans (ETV Bharat)

Jio New Prepaid Plans : రిలయన్స్ జియో మూడు సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇవన్నీ ఓటీటీ (ఓవర్ ది టాప్) సబ్‌స్క్రిప్షన్లతో కలుపుకొని వస్తుండటం విశేషం. దీంతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్ 'జియో భారత్ జే1 4జీ'ని కూడా విడుదల చేసింది. జులై నెలలో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల రేట్లను పెంచిన జియో, అప్పటివరకు అందుబాటులో ఉన్న పలు ఎంటర్‌టైన్‌మెంట్ ఫోకస్డ్ రీఛార్జ్ ప్లాన్లను తొలగించింది. కొత్తగా తీసుకొచ్చిన మూడు రీఛార్జ్ ప్లాన్లు వాటి స్థానాన్ని భర్తీ చేయనున్నాయి. వీటిని జియో యూజర్స్ రీఛార్జ్ చేసుకుంటే ఇంటర్నెట్ డేటా, కాలింగ్ బెనిఫిట్స్‌కు అదనంగా ప్రముఖ ఓటీటీల కంటెంట్​ను వీక్షించే అవకాశం కూడా దక్కుతుంది.

కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలు

  • రూ.1,049 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే రోజూ 2జీబీ ఇంటర్నెట్ డేటా, అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్‌ సదుపాయాలు లభిస్తాయి. వీటికి తోడుగా 84 రోజుల వ్యాలిడిటీతో 'జీ5 - సోనీ లివ్' కాంబో సబ్​స్క్రిప్షన్ ప్లాన్ కాంప్లిమెంటరీగా వస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ల సబ్​స్క్రిప్షన్ లభిస్తుంది.
  • రూ.949 ప్లాన్ : ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే రోజూ 2జీబీ ఇంటర్నెట్ డేటా, అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్ సదుపాయాలు లభిస్తాయి. వీటికి తోడుగా 84 రోజుల వ్యాలిడిటీతో 'డిస్నీ + హాట్ స్టార్' కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ల సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.
  • రూ.329 ప్లాన్ : ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే రోజూ 1.5 జీబీ ఇంటర్నెట్ డేటా, అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్ సదుపాయాలు లభిస్తాయి. వీటికి తోడుగా 28 రోజుల వ్యాలిడిటీతో 'జియో సావన్ ప్రో' కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ల సబ్​స్క్రిప్షన్ లభిస్తుంది.

Jio Bharat J1 4G Phone
జియో భారత్ సిరీస్ ఫీచర్ ఫోన్స్​కు గతంలో మంచి ఆదరణ లభించింది. దీంతో వాటికి కొనసాగింపుగా ఇప్పుడు 'జియో భారత్ జే1 4జీ' ఫీచర్ ఫోన్‌ను జియో విడుదల చేసింది. దీని ధరను రూ.1,799గా నిర్ణయించారు. బ్లాక్, గ్రే కలర్స్‌లో ఇది అందుబాటులో ఉంది. కావాల్సిన వారు అమెజాన్ లాంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ నుంచి కొనొచ్చు. జియో భారత్ సిరీస్ ఫీచర్ ఫోన్ల కేటగిరీలోని 'జియో భారత్ వీ2', 'జియో భారత్ వీ2 కార్బన్', 'జియో భారత్ బీ' మోడళ్ల తరహాలోనే 'జియో భారత్ జే1 4జీ'ని తయారు చేశారు.

BSNL‌కు స్విచ్​ అవ్వాలనుకుంటున్నారా? మీకు నచ్చిన నంబర్‌ ఆన్​లైన్​లోనే తీసుకోవచ్చు- సెలెక్ట్​ చేసుకోండిలా! - BSNL New Number Online

మీ క్రెడిట్ రిపోర్ట్ నుంచి 'లేట్ పేమెంట్స్'‌ను తొలగించాలా ? ఇలా చేయండి! - Late Payments In Credit Report

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.