ETV Bharat / business

మొదటిసారి ITR ఫైల్​ చేస్తున్నారా? ఈ టిప్స్ మీ కోసమే! - ITR Filling Tips - ITR FILLING TIPS

ITR Filling Tips : మీరు మొదటిసారిగా ఐటీఆర్ దాఖలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపుపన్ను రిటర్న్​లను దాఖలు చేయడానికి చివరి తేదీ 2024 జులై 31. ఈ గడువులోపు ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

How to file ITR
ITR Filling Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 11:25 AM IST

ITR Filling Tips : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్​లను ఐటీశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఇప్పుడే ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఆదాయం, టీడీఎస్ మినహాయింపుల్లాంటి పూర్తి వివరాలు లేకుండా రిటర్నులు దాఖలు చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు.

ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం, ఉద్యోగులకు యాజమాన్యాలు జూన్ 15లోగా ఫారం 16 అందించాలి. ఈలోపు ఫారం 26ఏఎస్​తో పాటు వార్షిక సమాచార నివేదిక అప్​డేట్ అవుతుంటాయి. ఇవన్నీ పూర్తిగా అందుబాటులోకి వచ్చాకే, ఐటీఆర్​ దాఖలు చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఈ-ఫైలింగ్ వెబ్​సైటులో ముందే భర్తీ చేసిన ఐటీఆర్-1 అందుబాటులో ఉంది. కానీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకే ఆదాయం, టీడీఎస్ వివరాలు నమోదు అయ్యాయి. జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఆదాయం, టీడీఎస్ వివరాలు ఇంకా వెల్లడికాలేదు. కనుక మీరు మీ యాజమాన్యానికి సమర్పించిన హోం లోన్ వడ్డీ, ఇతర మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి మొత్తం ఆదాయం, పన్ను కోత, మినహాయింపుల వివరాలు లేకుండా రిటర్నులు దాఖలు చేయడం సరికాదు. అన్ని వివరాలూ వచ్చే వరకు ఆగి, ఆ తర్వాతే ఎలాంటి తప్పులు లేకుండా ఐటీఆర్​ దాఖలు చేయడం మంచిది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపుపన్ను రిటర్న్​లను దాఖలు చేయడానికి చివరి తేదీ 2024 జులై 31.

సరైన ఐటీఆర్ ఫారాన్ని ఎంచుకోవడం ఎలా?
ప్రతి సంవత్సరం సెంట్రల్ బోర్డ్ అఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ITR ఫారాలను నోటిఫై చేస్తుంది. కింద పేర్కొన్న ఏవైనా షరతులు మీకు వర్తిస్తే, కచ్చితంగా మీరు ఆదాయ పన్ను రిటర్నలు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ITR-1 లేదా SAHAJ
భారతీయదేశంలో నివసిస్తున్న సాధారణ పౌరులై ఉండి, రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగి ఉన్న వ్యక్తులు ITR-1 ఫారమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. జీతం, ఒక ఇంటి నుంచి వచ్చే ఆదాయం, ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయం, జీవిత భాగస్వామి లేదా బిడ్డల ద్వారా వచ్చిన ఆదాయాలు అన్నీ కలిపి రూ.50 లక్షల వరకు ఉంటే ఐటీఆర్​-1 దాఖలు చేయాల్సిందే.

ITR-2
వృత్తి, వ్యాపారాల ద్వారా ఆదాయం సంపాదించని వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఈ ఐటీఆర్​ ఫారమ్-2ను దాఖలు చేయాలి. రూ.50 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఆదాయం కలిగిన వ్యక్తి, కంపెనీ డైరెక్టర్, జాబితా చేయని ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నవారు ఈ ఐటీఆర్​ ఫారమ్​-2 దాఖలు చేయాల్సి ఉంటుంది. అలాగే జీతాలు, బహుళ గృహాలు, మూలధన లాభాలు కలిగినవారు; భారతదేశం వెలుపల ఆస్తులు, ఆదాయ మార్గాలు కలిగిన వారు ITR-2 ఫారమ్ తప్పనిసరిగా దాఖలు చేయాలి.

ITR-3
వృత్తి, వ్యాపారాల ద్వారా ఆదాయం, లాభాలు సంపాదిస్తున్న ఇండివిడ్యువల్ వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలవారు ఐటీఆర్​-3 సమర్పించాలి.

ITR-4 లేదా SUGAM
రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు, హెచ్‌యుఎఫ్‌లు, సంస్థలు (ఎల్‌ఎల్‌పి కాకుండా); ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 44AD, 44ADA, 44AE ప్రకారం వృత్తి, వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదిస్తున్న వ్యక్తులు ఐటీఆర్​-4 దాఖలు చేయాలి.

ITR-5
ఇండివిడ్యువల్స్​, HUF, కంపెనీలు, ITR-7 దాఖలు చేసినవారు కాకుండా, ఇతర విధాలుగా ఆదాయం సంపాదించేవారు ఈ ఐటీఆర్​-5 ఫారాన్ని దాఖలు చేయాలి.

ITR-6
ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 11 ప్రకారం మినహాయింపును క్లెయిమ్ చేసే కంపెనీలు కాకుండా ఇతర కంపెనీలు ఈ ఐటీఆర్​ ఫారమ్​-6ను దాఖలు చేయాల్సి ఉంటుంది.

ITR-7
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్లు 139(4A) లేదా 139(4B)లేదా 139(4C) లేదా 139(4D) కింద రిటర్న్​ దాఖలు చేయాల్సిన వ్యక్తులు, కంపెనీలు ఐటీఆర్​-7ను దఖాలు చేయాల్సి ఉంటుంది.

వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, మతపరమైన ట్రస్టులు, రాజకీయ పార్టీలు, శాస్త్రీయ పరిశోధన సంఘాలు, న్యూస్​ ఏజెన్సీలు, ఆసుపత్రులు, ట్రేడ్ యూనియన్లు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఎన్​జీఓలు లేదా ఇలాంటి ఇతర సంస్థలు ITR-7 పరిధిలోకి వస్తాయి.

మీ పిల్లల పేరుతో ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేయాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - fixed deposit for children

క్రెడిట్ కార్డ్​లు వాడుతున్నారా? ఈ అపోహలు & వాస్తవాలు గురించి తెలుసుకోండి! - Credit Card Myths

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.