ETV Bharat / business

యాపిల్​ లవర్స్​కు గుడ్​న్యూస్​ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ -ఎలా పొందాలో తెలుసా! - ఐఫోన్ 15 బెస్ట్​ ఆఫర్స్​

Iphone 15 Offers 2024 : ఐఫోన్​ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీ బడ్జెట్​ రూ. 60 వేలు మాత్రమేనా? అయితే, మీ బడ్జెట్​లోనే భారీ డిస్కౌంట్​ ధరల్లో ఐఫోన్​ 15 మీరు సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Iphone 15 Offers 2024
Iphone 15 Offers 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 7:57 PM IST

Updated : Jan 31, 2024, 8:12 PM IST

Iphone 15 Offers 2024 : మార్కెట్​లో ఐఫోన్​కు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు? అయితే మిగిలిన స్మార్ట్​ఫోన్​లతో పోలిస్తే ఐఫోన్ ధర ​ కొంచెం ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఐఫోన్​ 15 పై భారీ తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉంది. ఈ మోడల్​ రూ. 65 వేల రూపాయల నుంచి ఆపైన వివిధ రకాల ఐఫోన్​లు అందుబాటులో ఉన్నాయి. మీ పాత ఫోన్​ ఎక్స్ఛేంజ్​ చేసుకుని రూ. 54,990 వరకు తగ్గింపు ధరల్లో సొంతం చేసుకోవచ్చు.

భారత్​లో యాపిల్​ 15 ఐఫోన్​ను లాంచ్​ చేసినపుడు 128 జీబీ వేరియంట్​ ప్రారంభ ధర రూ. 79,990 ఉంది. 256 వేరియంట్​ ధర రూ. 89,990 గా ఉంది. 512 జీబీ వేరియంట్ ధర రూ. 1,09,990 ఉంది. అయితే ప్రస్తుతం ఐఫోన్ 15 128 వేరియంట్ ధర రూ. 66,999 ఉంది. ఈ కామర్స్ సైట్​ ఫ్లిప్​కార్ట్​లో కొనుగోలు చేసినట్లయితే వివిధ కార్డులను ఉపయోగించి రూ. 4500 వరకూ డిస్కౌంట్​ను పొందవచ్చు. తద్వారా మీరు ఐఫోన్​ 15 128 జీబీ వేరియంట్​ను కేవలం రూ. 61,449లకే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు ఒక వేల మీ వద్ద పాత ఐఫోన్​ ఉంటే దానిపై రూ. 54,990 వరకూ లభించే అవకాశం ఉంది. అయితే ఈ ఆఫర్​ అనేది మీ ఫోన్​ ఏవిధంగా పనిచేస్తుంది అనే దానికి అనుగుణంగా ఈ ఎక్స్ఛేంజ్​ ధర ఉంటుంది.

AIపై యాపిల్‌ దృష్టిపెట్టిన యాపిల్
ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ వేగంగా అన్ని పరికరాల్లోకి చేరుతుంది. కాలానుగుణంగా కస్టమర్ల అభిరుచుల్లోనూ మార్పులు వస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ను జోడిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దిగ్గజ సంస్థలు తమ ప్రొడక్టుల్లో ఏఐ సాంకేతికతను తీసుకొచ్చాయి. పలు మొబైల్ తయారీ కంపెనీలు కొత్తగా లాంచ్​ చేసిన తమ స్మార్ట్​ఫోన్లలో ఏఐ ఫీచర్లను అందించాయి.

యాపిల్​ తమ ఉత్పత్తుల్లో ఏఐ జోడించడంపై దృష్టి సారించింది. కొత్తగా తీసుకురానున్న IOS 18లో ఏఐ ఆధారిత ఫీచర్లను జోడించనుంది. ఈ ఏడాది చివరలో యాపిల్ ఆవిష్కరించినున్న ఐఫోన్ 16 సీరిస్​లో జనరేటివ్ ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే మార్కెట్​లోకి విడుదలైన గూగుల్ పిక్సెల్​ 8, శాంసంగ్ గెలాక్సీ ఎస్​24 సిరీస్​లు ఏఐ ఆధారిత యాప్​లు, టూల్స్​తో వచ్చాయి. ఈ ఏడాది రానున్న 16 సిరీస్​ ఐఫోన్స్​లో ఈ సదుపాయం ఉండనుందని టెక్​ వర్గాల అంచనా. యాపిల్​లోని 'సిరి' డివైజ్ అసిస్టెంట్​లోనే ఏఐ పరంగా కీలక మార్పులు తీసుకురానున్నారు. యాపిల్ లార్జ్ లాంగ్వేజ్ పద్ధతి ద్వారా దీనిని పునరుద్ధరించాలని భావిస్తున్నారు. యాపిల్ డివైజ్​లలో ఏఐ ఫీచర్లను అభివృద్ధి చేసేందుకు వచ్చే ఏడాదిలో దాదాపు రూ. 8,300 కోట్లను యాపిల్ ఖర్చు చేసే అవకాశం ఉంది.

ఐఫోన్ యూజర్లకు గుడ్​న్యూస్! ఈ కొత్త ఫీచర్​తో మీ డేటా మరింత సేఫ్​!

రెడ్​మీ నుంచి మరో కొత్త స్మార్ట్​ఫోన్​​- ఐఫోన్ కంటే సూపర్​ కెమెరా!- ధర ఎంతంటే?

Last Updated : Jan 31, 2024, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.