ETV Bharat / business

డెట్‌ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ 6 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - Investing In Debt Funds

Investing In Debt Funds : మీరు రిస్క్​ లేకుండా మంచి రాబడి సంపాదించాలని ఆశిస్తున్నారా? ఇందుకోసం డెట్ ఫండ్లను ఎంచుకున్నారా? అయితే ఇది మీ కోసమే. డెట్ ఫండ్స్​లో మదుపు చేసే ముందు ఈ ఆర్టికల్​లో చెప్పిన 6 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి. అప్పుడే మంచి లాభాలు సంపాదించడానికి వీలవుతుంది.

Types of Debt Funds
Investing In Debt Funds
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 3:09 PM IST

Investing In Debt Funds : స్టాక్‌ మార్కెట్‌లో ఒడుదొడుకులు సహజం. అందవల్ల స్వల్పకాలంలో నష్టభయం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది డెట్ పథకాలవైపు మొగ్గు చూపుతారు. అయితే డెట్ ఫండ్స్​లో కూడా రిస్క్ ఉంటుంది. కనుక డెట్ పథకాలు పూర్తిగా సురక్షితం అనే అపోహలు వీడడం మంచిది. అందుకే డెట్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే ముందు ఇక్కడ తెలిపిన 6 విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.

1. మీ లక్ష్యం ఏమిటి?
డెట్‌ ఫండ్స్ ప్రధానంగా గవర్నమెంట్ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, కార్పొరేట్‌ బాండ్లు మొదలైన పథకాల్లో మదుపు చేస్తాయి. సాధారణ ఈక్విటీ పథకాలతో పోలిస్తే, వీటి పెట్టుబడి వ్యూహం కాస్త భిన్నంగా ఉంటుంది. కొన్ని ఫండ్లు మూడేళ్ల పరిమితి ఉన్న బాండ్లలో ఇన్వెస్ట్​ చేస్తాయి. మరికొన్ని స్వల్పకాలిక పథకాల్లో మదుపు చేస్తాయి. కనుక డెట్‌ ఫండ్లలో మదుపు చేసే ముందు మీ ఆర్థిక లక్ష్యం, వ్యూహం గురించి కచ్చితంగా ఆలోచించుకోవాలి.

2. వ్యవధి?
డెట్‌ ఫండ్లు ప్రధానంగా వివిధ వ్యవధులు కలిగిన బాండ్లు, సెక్యూరిటీల్లో మదుపు చేస్తాయి. కొన్ని డెట్​ ఫండ్స్​ వారం వ్యవధి ఉన్న బాండ్లలోనూ పెట్టుబడులు పెడతాయి. మరికొన్ని మూడేళ్ల వ్యవధి ఉన్న బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక, మీరు ఎంత కాలం పెట్టుబడిని కొనసాగించాలని అనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలి. మీరు మదుపు చేయాలనుకుంటున్న డెట్‌ ఫండ్‌ వివిధ పథకాల్లో ఎంత వ్యవధి పాటు ఇన్వెస్ట్​మెంట్​ కొనసాగిస్తుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. దీనివల్ల ఏ స్థాయిలో మీకు రాబడి వస్తుందో ముందుగానే ఒక అంచనాకు రావచ్చు. ఉదాహరణకు ఒక ఫండ్‌ సగటున మూడేళ్ల వ్యవధి ఉన్న పథకాల్లో మదుపు చేస్తుందని అనుకుందాం. అప్పుడు 2 నుంచి 3 ఏళ్ల వరకు పెట్టుబడిని కొనసాగించాలనుకున్నవారే ఆ డెట్‌ ఫండ్‌ను ఎంచుకోవాలి.

3. రాబడి మాటేమిటి?
ఇన్వెస్టర్లు గుర్తించుకోవాల్సిన అంశం ఏమిటంటే, వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, డెట్‌ ఫండ్ల రాబడి తగ్గుతుంది. వడ్డీ రేట్లు తగ్గితే, డెట్​ ఫండ్ల నుంచి కాస్త అధిక రాబడి వస్తుంది. అందుకే వివిధ సందర్భాల్లో డెట్​ ఫండ్స్​ అందించిన ప్రతిఫలాన్ని బేరీజు వేసుకోవాలి. నిపుణుల ప్రకారం, డెట్‌ ఫండ్ల నుంచి సగటున 7-9 శాతం వరకు రాబడిని ఆశించవచ్చు.

4. గతం గతః
గత రాబడులు, భవిష్యత్‌ రాబడికి హామీ ఇవ్వవని మదుపరులు గుర్తుంచుకోవాలి. చరిత్ర అనేది కేవలం ఒక అంచనాకు రావడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కనుక వివిధ మార్కెట్‌ పరిస్థితుల్లో డెట్​ ఫండ్స్​ పనితీరు ఎలా ఉందనేది బేరీజు వేసుకొని, ఒక సరైన నిర్ణయానికి రావాలి. ఏడాది, మూడు, ఐదేళ్ల కాల వ్యవధుల్లో సదరు ఫండ్‌ ఎలా పనిచేసింది? ఎంత రాబడి ఇచ్చింది? అనేది చూడాలి. డెట్​ ఫండ్స్ రాబడి ప్రామాణిక సూచీలను అధిగమించిందా? లేదా ఆయా విభాగాల్లోని ఇతర ఫండ్లతో పోల్చి చూసినప్పుడు, మెరుగైన రాబడులను ఇచ్చిందా? అనేది చూసుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కచ్చితంగా పరిశోధన చేయాల్సి ఉంటుందని మరిపోకూడదు.

5. రేటింగ్స్​ చూడాలి!
డెట్‌ ఫండ్లపై వచ్చే రాబడి వడ్డీ రేట్లతో పాటు, అది మదుపు చేసే వివిధ బాండ్ల రేటింగ్స్​పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మంచి కంపెనీల బాండ్లకు క్రెడిట్‌ రేటింగ్‌ అధికంగా ఉంటుంది. AAA రేటింగ్‌ ఉన్న బాండ్లలో మదుపు చేసినప్పుడు, ఆ డెట్‌ ఫండ్స్​లో నష్టభయం కాస్త తక్కువగా ఉంటుంది. అయితే చాలా మంది ఎక్కువ వడ్డీ రేటుకు ఆశపడి, తక్కువ రేటింగ్​ ఉన్న డెట్​ ఫండ్లలో మదుపు చేస్తుంటారు. కానీ ఇలా చేయడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.

6. పెద్ద ఫండ్లలోనే!
డెట్‌ ఫండ్లను ఎంచుకునేటప్పుడు, ఆయా ఫండ్ల కింద, నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువను (ఏయూఎం) కూడా పరిశీలించాలి. అధిక ఏయూఎం ఉన్న డెట్​ ఫండ్‌లలో నష్టభయం కాస్త తక్కువగా ఉంటుంది. పెట్టుబడి సులభంగా వెనక్కి తీసుకునేందుకూ వీలుంటుంది.

జీవిత బీమా తీసుకుంటున్నారా? ఈ 'రైడర్ల'ను కచ్చితంగా యాడ్ చేసుకోండి! - Life Insurance Riders

రూ.70వేలు బడ్జెట్లో మంచి టూ-వీలర్​ కొనాలా? టాప్​-10 బైక్స్ & స్కూటీస్ ఇవే! - Best Bikes Under 70000

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.