ETV Bharat / business

సంబంధం లేని వ్యక్తులకు 7 లక్షల షేర్లు గిఫ్ట్​ - ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్ సీఈఓ ఛారిటీ! - IDFC First Bank CEO Vaidyanathan - IDFC FIRST BANK CEO VAIDYANATHAN

IDFC First Bank CEO Vaidyanathan Charity : ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్​ మేనేజింగ్ డైరెక్టర్​ & సీఈఓ వీ.వైద్యనాథన్ తనకు ఏ మాత్రం సంబంధంలేని ఐదుగురు వ్యక్తులకు 7 లక్షల షేర్లను గిఫ్ట్​గా ఇచ్చేశారు. గతంలోనూ ఆయన తన వద్ద పనిచేస్తున్న పనివాళ్లకు, డ్రైవర్​, ట్రైనర్లకు 5 లక్షల షేర్లను కానుకగా ఇచ్చేశారు. పూర్తి వివరాలు మీ కోసం.

IDFC First Bank MD Vaidyanathan
IDFC First Bank CEO Vaidyanathan
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 3:16 PM IST

Updated : Mar 22, 2024, 3:29 PM IST

IDFC First Bank CEO Vaidyanathan : ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్​ మేనేజింగ్ డైరెక్టర్​ & సీఈఓ వీ.వైద్యనాథన్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తనకు ఏమాత్రం సంబంధం లేని ఐదుగురు వ్యక్తులకు 7 లక్షల షేర్లను కానుక (గిఫ్ట్​)గా ఇచ్చారు. గతంలోనూ ఆయన, తన శిక్షకునికి, మరణించిన సహోద్యోగుల బంధువులకు, ఇంట్లో పనిచేసే వాళ్లకు, డ్రైవర్​కు లక్షల షేర్లను కానుకగా ఇచ్చేశారు.

కానుకగా 7 లక్షల షేర్లు!
మార్చి 21 స్టాక్​ ఎక్స్ఛేంజి ఫైలింగ్​ ప్రకారం, ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్​ మేనేజింగ్ డైరెక్టర్​ & సీఈఓ వీ.వైద్యనాథన్​ ఐదుగురు వ్యక్తులకు 7 లక్షల షేర్లను గిఫ్ట్​గా ఇచ్చారు. లబ్ధిదారుల్లో సమీర్​ మహాత్రేకు 50,000 షేర్లు; మయాంక్​ ఘోష్​కు 75,000 షేర్లు; సంపత్​ కుమార్​కు 2.5 లక్షల షేర్లు; ఏ.కనోజియాకు 2.75 లక్షల షేర్లు; మనోజ్​ సహాయ్​కు 50,000 షేర్లు కానుకగా ఇచ్చారు. ఎందుకంటే?

  • సమీర్​ మహాత్రే సొంత ఇంటి కలను నిజం చేసేందుకు వైద్యనాథన్ అతనికి 50 వేల షేర్లను కానుకగా ఇచ్చారు.
  • తన సహోద్యోగి మరణించిన కారణంగా, అతని బంధువైన మయాంక్​ మృణాల్​ ఘోష్​కు ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో వైద్యనాథన్​ 75,000 ఈక్విటీ షేర్లను గిఫ్ట్​గా ఇచ్చారు.
  • భారత వాయు సేనలో సేవలు అందించిన రిటైర్డ్ వింగ్ కమాండర్​ సంపత్​కుమార్​కు 2 లక్షల 50 వేల షేర్లను గిఫ్ట్​గా ఇచ్చారు. దీనితో ఆయన జీవిత చరమాంకం సంతృప్తిగా జీవించడానికి వీలవుతుంది.
  • వైద్యనాథన్​ ఎ.కనోజియా అనే అతనికి గృహ కొనుగోలు కోసం 2.75 లక్షల షేర్లను, మనోజ్ సహాయ్ అనే స్నేహితునికి 50 వేల షేర్లను కానుకగా ఇచ్చారు.

వైద్యనాథన్​ ఛారిటీ
వైద్యనాథన్ గతంలోనూ ఇలానే లక్షల షేర్లను ఇతరులకు కానుక ఇచ్చారు. ముఖ్యంగా 2022 మార్చిలో ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​లో తనకున్న షేర్లలో 5 లక్షల షేర్లను మరణించిన తన సహోద్యోగుల బంధువులకు అందించారు. ఓ నెల క్రితం తన ట్రైనర్​కు, ఇంట్లో పనిచేసే వ్యక్తులకు, డ్రైవర్​కు కలిపి రూ.4 కోట్ల విలువైన షేర్లను గిఫ్ట్​గా ఇచ్చారు. వైద్యనాథన్​ 2020 అక్టోబర్​లో కూడా ఒక రిటైర్డ్​ స్కూల్​ టీచర్​కు రూ.30 లక్షల విలువైన షేర్లను కానుకగా ఇచ్చారు.

రహస్యంగా వివాహం చేసుకున్న జొమాటో సీఈఓ - పెళ్లి కూతురు ఎవరంటే? - Zomato CEO Deepinder Goyal marriage

4నెలల వయస్సులోనే రూ.240 కోట్లు ఆస్తి- ఎవరీ ఇండియన్​ యంగెస్ట్​ మిలియనీర్​?

Last Updated : Mar 22, 2024, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.