ETV Bharat / business

'మే 31లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోండి - లేదంటే భారీగా TDS వడ్డన తప్పదు' - ఐటీ శాఖ - PAN Aadhaar Link

author img

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 2:41 PM IST

Updated : May 28, 2024, 2:49 PM IST

Link PAN With Aadhaar By May 31 To Avoid Higher TDS Deduction : మే 31 ముంచుకొస్తోంది. ఆలోగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. లేదంటే భారీగా టీడీఎస్ వడ్డింపు తప్పదని ఐటీ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఫారెక్స్ డీలర్లు, బ్యాంకులు వంటి సంస్థలు ఆ గడువులోగా ఎస్‌ఎఫ్‌టీ‌లను దాఖలు చేయాలని కోరింది.

Aadhaar PAN linking process
Link PAN With Aadhaar By May 31 (ETV Bharat)

Link PAN With Aadhaar By May 31 To Avoid Higher TDS Deduction : అధిక పన్ను బాదుడు బారిన పడకూడదని భావించే వాళ్లంతా మే 31లోగా తప్పకుండా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. ఈ ప్రక్రియను పూర్తి చేసుకోని వారిపై సాధారణం కంటే రెట్టింపు ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్)ను విధించనున్నారు. అంటే మూల ఆదాయం లేదా వేతనంపై పన్ను వడ్డింపు రెట్టింపు అవుతుందన్న మాట. ఈ విషయంలో పన్ను చెల్లింపుదారులంతా అలర్ట్ కావాలంటూ ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ఓ సర్క్యులర్‌ను విడుదల చేసింది.

ఒకవేళ పాన్-ఆధార్‌లను లింక్ చేసుకుంటే టీడీఎస్ మినహాయింపు అతి స్వల్పంగా ఉంటుందని ఐటీ శాఖ స్పష్టం చేసింది. బ్యాంకులు, ఫారెక్స్ డీలర్ల వంటి సంస్థలు స్టేట్‌మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ (ఎస్‌ఎఫ్‌టీ)ను ఫైల్ చేయడానికి మే 31 లాస్ట్ డేట్ అని గుర్తు చేస్తూ ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఓ పోస్ట్ చేసింది. సమయానికి ఎస్ఎఫ్‌టీ సమర్పిస్తే జరిమానాలు పడవని తెలిపింది.

ఎస్ఎఫ్‌టీలు సమర్పించకుంటే, రోజుకు రూ.1000 దాకా ఫైన్​
ఫారెక్స్ డీలర్లు, బ్యాంకులతో పాటు సబ్ రిజిస్ట్రార్లు, ఎన్‌బీఎఫ్‌సీలు, పోస్టాఫీసులు, బాండ్లు/డిబెంచర్లు జారీ చేసే సంస్థలు, మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలు ఎస్ఎఫ్‌టీలను సమర్పిస్తుంటారు. కంపెనీల డివిడెండ్ లావాదేవీలు, షేర్ల బై బ్యాక్ వ్యవహారాలపైనా ఎస్ఎఫ్‌టీలను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ సంస్థలన్నీ నిర్దిష్ట ఆర్థిక లావాదేవీల వివరాలను ఐటీ శాఖకు సవివరంగా అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ఎఫ్‌టీ రిటర్న్‌ల దాఖలులో జాప్యం జరిగితే, డీఫాల్ట్ అయిన ఒక్కో రోజుకు రూ. 1,000 దాకా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఎస్ఎఫ్‌టీలను సమర్పించకపోవడం, తప్పుడు వివరాలతో వాటిని సమర్పించడం కూడా జరిమానాల పరిధిలోకి వస్తుంది. అధిక విలువ కలిగిన లావాదేవీలను పర్యవేక్షించేందుకు ఎస్ఎఫ్‌టీలు కీలకమైన డాక్యుమెంట్లుగా ఐటీ శాఖకు ఉపయోగపడతాయి.

ఆధార్​-పాన్​ లింకింగ్​ ఎలా చేయాలి?

  • ముందుగా మీరు https://www.incometax.gov.in వెబ్​సైట్​ను ఓపెన్​ చేయాలి.
  • మీరు ఇప్పటికే ఆధార్​-పాన్​ లింక్​ చేసుకున్నారో? లేదో? స్టేటస్​ చెక్​ చేసుకోవాలి.
  • ఒక వేళ లింక్​ చేసుకోకపోతే పోర్టల్​లో లాగిన్ కావాల్సి ఉంటుంది.
  • ఇందుకోసం యూజర్​ ఐడీ, పాస్​వర్డ్​ క్రియేట్​ చేసుకోవాలి.
  • తరువాత లింక్​ ఆధార్​ స్టేటస్​పై క్లిక్​ చేయాలి.
  • తరువాత ఈ-ఫైల్​ > ఈ-పే టాక్స్​ > న్యూ పేమెంట్​ క్లిక్​ చేయాలి.
  • ఇన్​కం టాక్స్​ ట్యాబ్​పై క్లిక్​ చేసి, 2024-25 అసెస్​మెంట్​ ఇయర్​ను సెలెక్ట్​ చేసుకోవాలి.
  • తరువాత 'అదర్​ రెసిపెంట్స్ (500)'పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీకు ముందుగా ఫిల్​ చేసిన రూ.1000 కనిపిస్తుంది.
  • దానిని క్లిక్​ చేసి, పేమెంట్​ను ఆన్​లైన్​లో కట్టేయాలి.
  • తరువాత చలాన్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలి.
  • ఆ తరువాత 'లింక్​ ఆధార్​'పై క్లిక్​ చేసి పాన్​, ఆధార్​ వివరాలు అందులో నమోదు చేయాలి.
  • ఈ విధంగా మీరు పాన్​-ఆధార్​లను అనుసంధానం చేసుకోవాలి.

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలా? ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి - లాస్ట్ డేట్ ఇదే! - Documents Required To File ITR

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? మోసగాళ్ల ట్రాప్ నుంచి బయటపడండిలా! - How To Avoid Stock Market Frauds

Last Updated : May 28, 2024, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.