ETV Bharat / business

ఒక డీమ్యాట్ ఖాతాలోని షేర్లను మరోదానికి ట్రాన్స్​ఫర్ చేయాలా? ఈ సింపుల్​ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Transfer Shares

How To Transfer Shares From One Demat Account To Another : ఒక డీమ్యాట్​ అకౌంట్​ నుంచి ఇంకోదానికి షేర్లు ఎలా ట్రాన్స్​ఫర్​ చేయాలి? అలా చేస్తే ఫీజులు ఉంటాయా? అనే సందేహాలు స్టాక్ మార్కెట్ మదుపర్లలో చాలా మందికి ఉంటాయి. మరెందుకు ఆలస్యం ఒక డీమ్యాట్ అకౌంట్ నుంచి మరో దానికి ఎలా షేర్లు ట్రాన్స్ ఫర్ చేయాలో? ఆ ప్రాసెస్ ఏంటో? ఈ స్టోరీ చదివి తెలుసుకుందాం.

How to transfer stocks from one demat account to another
How to transfer shares from one demat account to another
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 12:27 PM IST

How To Transfer Shares From One Demat Account To Another : చాలా మంది మదుపర్లు ఒకటి కన్నా ఎక్కువ డీమ్యాట్ ఖాతాలను కలిగి ఉంటారు. అయితే స్టాక్ మార్కెట్​లో మంచి లాభాలు పొందాలంటే సరైన విధంగా పోర్ట్ ఫోలియో నిర్వహణ ఉండాలి. ఒక డీమ్యాట్ ఆకౌంట్ నుంచి మరో డీమ్యాట్ ఖాతాకు షేర్లను బదిలీ చేయడం అనేది చాలా మంది మదుపర్లు ఉపయోగించే టెక్నిక్.
ఒకటి కన్నా ఎక్కువ డీమ్యాట్ అకౌంట్లు ఉన్నవారు వాటిలో కేవలం షేర్లు, సెక్యూరిటీలను కలిగి ఉంటే సరిపోదు. వివిధ ఖాతాల్లో సరైన విధంగా షేర్ల నిర్వహణను కొనసాగించాలి. షేర్లను మరో డీమ్యాట్ ఖాతాకు నిరాటంకంగా ట్రాన్స్​ఫర్ చేయగలగాలి. ఈ ఫీచర్ వల్ల షేర్ల కన్సాలిడేషన్ మరింత సులభమవుతుంది.

డీ మ్యాట్ ఖాతాల బదిలీ ఎలా చేయాలి?
ఒక డీమ్యాట్ నుంచి మరో డీమ్యాట్ ఖాతాకు షేర్లను ఆన్​లైన్, ఆఫ్​లైన్ పద్ధతుల ద్వారా ట్రాన్స్​ఫర్ చేయవచ్చు. ఆఫ్​లైన్ ప్రక్రియ కొంత ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. అందుకే ప్రస్తుతం ఆఫ్​లైన్ కన్నా ఆన్​లైన్ విధానాన్ని ఎక్కువ మంది వాడుతున్నారు.

ఆఫ్​లైన్ ద్వారా డీమ్యాట్ షేర్ల బదిలీ

  • ట్రాన్స్​ఫర్ చేయవలసిన షేర్ల జాబితాను, వాటి ISIN నంబర్లతో సహా సిద్ధం చేయండి.
  • టార్గెట్ క్లయింట్ ID, DP IDలు నోట్ చేసుకోండి.
  • ఆఫ్ మార్కెట్ లేదా ఇంట్రా డిపాజిటరీ లాంటి తగిన ట్రాన్స్​ఫర్ విధానాన్ని ఎంచుకోండి.
  • మీ డిపాజిటరీ పార్టిసిపెంట్ (DP) అందించిన డెబిట్ ఇన్​స్ట్రక్షన్​ స్లిప్ (DIS) నింపి సైన్ చేయండి.
  • పూర్తి చేసిన DIS స్లిప్​ను మీ ప్రస్తుత బ్రోకర్ లేదా డీపీకి సమర్పించండి.
  • తరువాత వారి నుంచి రసీదు పొందండి. అంతే సింపుల్​!

3 నుంచి 5 పనిదినాల్లో, మీ పాత డీమ్యాట్ ఖాతా నుంచి కొత్తదానికి షేర్లు ట్రాన్స్​ఫర్ అవుతాయి. అయితే, ఇందుకు మీరు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్​లైన్ విధానంలో షేర్లు ట్రాన్స్​ఫర్

  • సీడీఎస్ఎల్ (CDSL) వెబ్​సైట్ ఓపెన్ చేసి అకౌంట్ కోసం రిజిస్టర్ చేసుకోండి.
  • రిజిస్ట్రేషన్ తర్వాత అవసరమైన సమాచారాన్ని నింపండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​కు వన్ టైమ్ పాస్​వర్డ్​ (OTP) వస్తుంది. దానిని ఎంటర్ చేసి ధ్రువీకరించండి.
  • ఆ తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్​లోకి లాగిన్ అయ్యి, షేర్స్​ ట్రాన్స్​ఫర్ చేసుకోండి.
  • ఒక డీమ్యాట్ అకౌంట్ నుంచి మరో డీమ్యాట్ ఖాతాకు షేర్లను బదిలీ చేయడానికి వెబ్​సైట్​లోని సూచనలను ఫాలో అవ్వండి.
  • ట్రాన్స్​ఫర్ పూర్తైన తర్వాత మీకు ధ్రువీకరణ ఈ-మెయిల్ వస్తుంది.

ఈ విధంగా మీరు ఆఫ్​లైన్, ఆన్​లైన్ విధానాల్లో ఒక డీమ్యాట్ అకౌంట్ నుంచి మరొక డీమ్యాట్ అకౌంట్​కు షేర్లను ట్రాన్స్​ఫర్ చేసుకోవచ్చు. మీ ప్రాధాన్యతలకు, అవసరాలకు అనుగుణంగా మీకు నచ్చిన పద్ధతిని ఎంచుకోండి.

డీమ్యాట్ అకౌంట్ల మధ్య షేర్లను బదిలీ చేయడానికి ఎంత టైం పడుతుంది?
ఇది ట్రాన్స్​ఫర్ విధానంపై ఆధారపడి ఉంటుంది. సంబంధిత బ్రోకర్లు, డీపీల సామర్థ్యం, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలపై కూడా షేర్ల బదిలీ కాలపరిమితి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 3 నుంచి 5 వర్కింగ్ డేస్ పడుతుంది. సాధారణంగా ఆన్లైన్ విధానంలో త్వరగా పూర్తవుతుంది.

డీమ్యాట్ ఖాతాల షేర్ల బదిలీకి రుసుము ఉందా?
షేర్లను బదిలీ చేయడం కోసం కొంత ఫీజు చెల్లించాలి. బ్రోకర్ పాలసీ, బదిలీ విధానాన్ని బట్టి (ఇంట్రా-డిపాజిటరీ, ఇంటర్-డిపాజిటరీ లేదా ఆఫ్-మార్కెట్) ఫీజులు మారుతాయి.

షేర్ల బదిలీ స్థితిని ట్రాక్ చేయవచ్చా?
ట్రాక్ చేయవచ్చు. సాధారణంగా బ్రోకర్ ఆన్​లైన్ పోర్టల్ ద్వారా లేదా మీ డిపాజిటరీ పార్టిసిపెంట్ (DP)ని సంప్రదించడం ద్వారా మీ షేర్ బదిలీ స్థితిని ట్రాక్ చేయవచ్చు.

షేర్ బదిలీ ప్రక్రియలో సమస్యలు ఉంటే?
షేర్ బదిలీ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే, సహాయం కోసం వెంటనే మీ బ్రోకర్ లేదా డీపీని సంప్రదించడం ఉత్తమం.

డీమ్యాట్ ఖాతాల మధ్య బదిలీ చేసే షేర్ల సంఖ్యకు లిమిట్ ఉందా?
సాధారణంగా డీమ్యాట్ ఖాతాల మధ్య బదిలీ అయ్యే షేర్ల సంఖ్యకు లిమిట్ లేదు. అయితే, డిపాజిటరీ యొక్క విధానాలు, నియంత్రణ మార్గదర్శకాలు, బదిలీ చేస్తున్న షేర్ల రకాన్ని బట్టి కొన్ని పరిమితులు ఉంటాయి. మీ బదిలీ అభ్యర్థనకు సంబంధించి నిర్దిష్ట వివరాల కోసం మీ బ్రోకర్ లేదా డీపీని సంప్రదించడం మంచిది.

డెట్‌ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ 6 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - Investing In Debt Funds

రూ.70వేలు బడ్జెట్లో మంచి టూ-వీలర్​ కొనాలా? టాప్​-10 బైక్స్ & స్కూటీస్ ఇవే! - Best Bikes Under 70000

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.