How To Secure Digital Wallet : చాలా మంది ఈజీ పేమెంట్స్ కోసం ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం సహా పలు రకాల యూపీఐ యాప్స్ ను వినియోగిస్తూ ఉంటారు. అయితే ఫోన్ పోయినప్పుడు అందులోని మన వ్యక్తిగత సమాచారంతోపాటు, యూపీఐ యాప్స్ డేటా కూడా దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మన ఫోన్ పోయినప్పుడు, అందులోని పేమెంట్ యాప్స్‌ను ఎలా బ్లాక్ చేయాలి? మన డబ్బును ఎలా సురక్షితం చేసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పేటీఎం వాలెట్ బ్లాక్ చేయడం ఎలా?
- మీ ఫోన్ పోయిన వెంటనే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ హెల్ప్‌లైన్ నంబర్ 01204456456కు కాల్ చేయాలి.
- కాల్ కనెక్ట్ అయిన వెంటనే Lost Phone ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- మీరు పోగొట్టుకున్న ఫోన్ నంబర్‌ను, మీ ఆల్టర్నేటివ్ ఫోన్ నంబర్లను ఎంటర్ చేయాలి.
- మీకు సంబంధించిన అన్ని డివైజ్‌ల్లోనూ పేటీఎం వాలెట్ నుంచి లాగ్అవుట్ కావాలి.
- మరింత సహాయం కోసం పేటీఎం వెబ్సైట్లోకి లాగిన్ కావాలి.
- వెబ్‌సైట్‌లోని 24*7 Help ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- Report a Fraud ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తరువాత వచ్చే ప్రాంప్ట్స్ అన్నింటినీ ఫాలో కావాలి.
- తాత్కాలికంగా పేటీఎం వాలెట్‌ను బ్లాక్ చేయడానికి కావాల్సిన సమాచారం అంతా ఇవ్వాలి.
- ఈ విధంగా చేస్తే, పేటీఎం వాళ్లు మీ వాలెట్‌ను బ్లాక్ చేస్తారు. అప్పుడే మీ డబ్బు సేఫ్‌గా ఉంటుంది.
గూగుల్ పే వాలెట్‌ను బ్లాక్ చేయడం ఎలా?
- ముందుగా గూగుల్ పే కస్టమర్ సర్వీస్ నంబర్ 18004190157కు కాల్ చేయాలి.
- గూగుల్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ ఇచ్చిన సూచనలు అన్నీ పాటించండి.
- మీ గూగుల్ పే వాలెట్‌ను బ్లాక్ చేయమని చెప్పండి.
- ఈ విధంగా మీ వాలెట్లోని డబ్బులను కాపాడుకోండి.
- ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ యూజర్లు అందరూ, తాము పోగొట్టుకున్న ఫోన్లలోని డేటాను రిమోట్ వైప్ చేయవచ్చు. అంటే పోయిన ఫోన్లలోని డేటాను, చాలా సులువుగా రిమూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక దానిని కూడా మీరు ప్రయత్నించవచ్చు.
ఫోన్ పే వాలెట్‌ను బ్లాక్ చేయడం ఎలా?
- ముందుగా ఫోన్‌పే కస్టమర్ సర్వీస్ సెంటర్ నంబర్‌కు కాల్ చేయాలి.
- మీరు 08068727374 లేదా 02268727374 నంబర్‌కు కానీ ఫోన్ చేయవచ్చు.
- మీ మొబైల్ పోయింది కనుక అందులోని ఫోన్‌పే వాలెట్‌ను బ్లాక్ చేయమని చెప్పాలి.
- వెంటనే మీరు పోగొట్టుకున్న ఫోన్ నంబర్‌కు ఒక ఓటీపీ పంపిస్తారు.
- మీరు వెంటనే I have not received OTP అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీ సిమ్ లేదా డివైజ్ పోయింది కనుక ఫోన్‌పే వాలెట్‌ను బ్లాక్ చేయమని చెప్పండి.
- ఈ విధంగా మీ ఫోన్‌పే వాలెట్‌ను బ్లాక్ చేసి, మీ డబ్బును కాపాడుకోండి.
ఈ పేమెంట్ యాప్స్‌ను ఎందుకు బ్లాక్ చేయాలంటే
మీ ఫోన్ నేరగాళ్ల చేతికి చిక్కితే, మీ వ్యక్తిగత, బ్యాంక్ ఖాతా వివరాలను వారు తెలుసుకునే అవకాశం ఉంది. దీనితో వారు మీ వాలెట్లలోని డబ్బులను దోచుకుంటారు. అందుకే మీ ఫోన్ పోయిన వెంటనే, మీ పేమెంట్ వాలెట్లను బ్లాక్ చేయించాలి.
రిమోట్ బ్లాకింగ్ అంటే?
కొన్ని పేమెంట్ యాప్స్ రిమోట్ బ్లాకింగ్ ఫెసిలిటీని కల్పిస్తున్నాయి. అందుకే మీ పేమెంట్స్ యాప్‌లకు సంబంధించిన వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి, మీ డిజిటల్ వాలెట్‌ను బ్లాక్ చేసుకోవాలి.
అదనపు భద్రతా చర్యలు
ఈ డిజిటల్ యుగంలో మన ఫైనాన్సియల్ డేటాను భద్రపరుచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం బయోమోట్రిక్ అథంటికేషన్, పిన్ కోడ్స్, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్లను సెట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆర్థిక భద్రత కలుగుతుంది.
మీ కారుపై ఎలాంటి గీతలు పడకూడదా? కచ్చితంగా ఈ 6 టిప్స్ పాటించాల్సిందే!
క్రెడిట్‌కార్డ్ 'మినిమం పేమెంట్' ఆప్షన్ - లాభనష్టాలు ఇవే!