ETV Bharat / business

మీ కార్ ఇన్సూరెన్స్ ఎక్స్​పైర్ అయ్యిందా? సింపుల్​గా రెన్యువల్ చేసుకోండిలా! - Car Insurance Renewal tips

How To Renew Expired Car Insurance Online : మీ కార్​ ఇన్సూరెన్స్ పాలసీ ఎక్స్​పైర్ అయ్యిందా? దానిని రెన్యూవల్​ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. కార్ ఇన్సూరెన్స్ రెన్యువల్ కోసం బీమా కంపెనీ వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. సింపుల్​గా ఆన్​లైన్​లోనే మీ బీమా పాలసీని రెన్యువల్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

How to Renew Car Insurance
How to Renew Expired Car Insurance Online
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 11:53 AM IST

How To Renew Expired Car Insurance Online : భారతదేశంలో కారు కొనాలని అనుకుంటే ఇన్సూరెన్స్ చేయడం తప్పనిసరి. ప్రమాదం, దొంగతనం, లేదా ఇతర రూపాల్లో వాహనానికి నష్టం జరిగినప్పుడు ఈ బీమా పాలసీ ఆర్థిక రక్షణను కల్పిస్తుంది. నగదు ఖర్చును తగ్గిస్తుంది. వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి చాలా మంది బీమా కంపెనీలకు వెళ్లాలని అనుకుంటారు. కానీ అలాంటి అవసరం ఏమీ లేదు. ఆన్​లైన్​లోనే చాలా సులువుగా కారు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఒక వేళ మీ కారు ఇన్సూరెన్స్ ఎక్స్​పైర్ అయిపోతే, దానిని కూడా ఆన్​లైన్​లోనే రెన్యువల్ చేసుకోవచ్చు.

కారుకు ఇన్సూరెన్స్ చేయించకపోతే ఏమవుతుంది?
వాహన బీమా చేయించకపోతే అనేక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో మొదటిది ఇన్సూరెన్స్ చేయించకుండా డ్రైవింగ్ చేయడం మన దేశంలో చట్టవిరుద్ధం. కనుక మీరు ఇన్సూరెన్స్ లేని బండితో పట్టుబడితే జరిమానాలు, లైసెన్స్ సస్పెన్షన్ లేదా వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం లాంటి పలు శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి తోడు కారుకు ఏదైనా ప్రమాదం లేదా నష్టం జరిగితే, మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. జరిగిన డ్యామేజ్​ను కవర్​ చేయడానికి మీ జేబు నుంచే ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే గడువు తీరక ముందే మీ కారు ఇన్సూరెన్స్​ను రెన్యువల్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన సమాచారాన్ని సేకరించుకోవాలి.
ఆన్​లైన్​లో కారు బీమా రెన్యువల్ చేసే ముందు, మీ కారు పాత ఇన్సూరెన్స్​ పాలసీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని బయటకు తీసి దగ్గర పెట్టుకోవాలి. అందులో పాలసీ నంబరు, కవరేజీ వివరాలు, పాత ఇన్సూరర్ సమాచారం ఉంటుంది. అలాగే వాహన రిజిస్ట్రేషన్, కారు మోడల్ నంబర్లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితోపాటు మీ వ్యక్తిగత వివరాలు, చిరునామా తదితర వివరాలు కూడా కావాల్సి ఉంటుంది. గతంలో మీరు నో క్లెయిమ్ బోనస్ పొందినట్లయితే, దానికి NCB ధ్రువపత్రం కూడా ఉండాలి.

ఇన్సూరర్​ను ఎంపిక చేసుకోవడం
వాహన బీమా కోసం మంచి ఇన్సూరర్​ (బీమా కంపెనీ)ని ఎంపిక చేసుకోవాలి. మీకు ఇష్టమైతే ప్రస్తుతమున్న బీమా సంస్థతోనే కొనసాగవచ్చు. లేదా మీ అవసరాలకు, బడ్జెట్​కు తగిన పాలసీని ఇచ్చే బీమా కంపెనీని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే బీమా పాలసీ తీసుకునే ముందు, సదరు కంపెనీ కల్పిస్తున్న బీమా కవరేజీ, ప్రీమియం, మార్కెట్లో సదరు సంస్థకున్న రెప్యుటేషన్ గురించి కూడా తెలుసుకోవాలి.

ఆన్​లైన్​లో కారు ఇన్సూరెన్స్ రెన్యువల్ ప్రాసెస్​
మీరు ఎంచుకున్న బీమా కంపెనీ అధికారిక వెబ్​సైట్​ ఓపెన్ చేయాలి. దానిలో 'కారు ఇన్సూరెన్స్ రెన్యువల్' కోసం ప్రత్యేకంగా ఒక సెక్షన్​ ఉంటుంది. దాన్ని ఎంచుకుని అక్కడ కారు రిజిస్ట్రేషన్ నంబర్​, మోడల్ నంబర్​ సహా, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఒక వేళ మీరు పాత బీమా సంస్థ వెబ్​సైట్​లోనే లాగిన్ అయ్యుంటే, వెంటనే​ మీ బీమా పాలసీ వివరాలు అన్నీ స్క్రీన్​పై కనిపిస్తాయి. తరువాత అప్లికేషన్​లో మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ పేరు, ఫోన్ నంబరు, ఈ-మెయిల్ అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వాలి. ఆ తరువాత మీకు కావాల్సిన పాలసీ రకాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు మీరు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్​ లేదా కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకోవచ్చు. వీటికి అదనంగా యాడ్​-ఆన్స్​ను కూడా జత చేసుకోవచ్చు. వీటితోపాటు గతంలో మీరు 'నో క్లెయిమ్ బోనస్'ను పొంది ఉంటే, అది కూడా రెన్యువల్​ పాలసీలో రిఫ్లెక్ట్ అవుతోందా? లేదా? అనేది చెక్​ చేసుకోవాలి. మీరు ఎంచుకున్న పాలసీ బెనిఫిట్స్​ మీకు సంతృప్తికరంగా ఉంటే, వెంటనే పేమెంట్ చేసి దానిని కొనుగోలు చేయవచ్చు. క్రెడిట్​/ డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ లేదా డిజిటల్ వాలెట్స్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. ఒక్కసారి పేమెంట్ పూర్తయ్యాక, పాలసీకి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ ఈ-మెయిల్​కు వస్తాయి. వాటిని మీరు ప్రింట్​అవుట్ తీసి డాక్యుమెంట్ రూపంలో భద్రపర్చుకోవచ్చు.

ఆన్​లైన్​లో కారు ఇన్సూరెన్స్ చేయడం వల్ల కలిగే లాభాలు

  • ఇన్సూరెన్స్ కంపెనీల చుట్టూ తిరిగాల్సిన పనిలేదు.
  • హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని పాలసీ పునరుద్ధరించుకోవచ్చు. దీని వల్ల సమయం ఆదా అవుతుంది.
  • మార్కెట్లో ఉన్న ఇతర పాలసీలతో పోల్చుకునే అవకాశం ఉంటుంది.
  • పేమెంట్ అయిపోగానే కార్ రెన్యూవల్​ డాక్యుమెంట్లు మీ మెయిల్​కు వచ్చేస్తాయి.
  • మధ్యవర్తులు ఎవరూ అవసరం లేదు. కనుక డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయి.

ఫ్రీగా క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

స్పామ్​ కాల్స్​/ మెసేజ్​లు వస్తున్నాయా? 'చక్షు' పోర్టల్​లో ఫిర్యాదు చేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.