ETV Bharat / business

మీ కారు నుంచి పొగ ఎక్కువగా వస్తోందా? - ఇలా చెక్ పెట్టండి! - How to Reduce Smoke From Car

Car Air Pollution Reduce Tips : కార్లు చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. కానీ, వాటిని సరిగ్గా మెయింటెయిన్ చేసేది మాత్రం కొద్ది మందే! అందుకే.. మెజారిటీ కార్లు తొందరగా రిపేర్​కు రావడమే కాకుండా.. తీవ్రమైన కాలుష్యాన్ని వెదజల్లుతుంటాయి. మరి.. మీ కారు కూడా ఎక్కువ పొగ రిలీజ్ చేస్తోందా? అయితే.. ఈ సూపర్ టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Car Air Pollution
Car Air Pollution Reduce Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 10:24 AM IST

Best Ways to Make Your Car Less Polluting : కారు మెయింటెనెన్స్ విషయంలో చాలా మంది అశ్రద్ధగా ఉంటుంటారు. టైమ్ టూ టైమ్ సర్వీసింగ్ కూడా చేయించరు. దీనివల్ల వెహికల్ నుంచి ఎక్కువ పొగ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో సర్వీసింగ్ చేయించకపోవడం వల్ల ఎయిర్, ఫ్యూయల్ ఫిల్టర్ల లోపల డస్ట్ పేరుకుపోయే ఛాన్స్ ఉంటుంది. దాంతో అధిక పొగ రావొచ్చు. అలాగే ఇంజిన్ ఆయిల్ ఎప్పటికప్పుడూ చెక్ చేసి మార్చుతుండాలి. ఇలా సరైన టైమ్​లో కారును సర్వీసింగ్ చేయించడం వల్ల వెహికల్ నుంచి వచ్చే పొగ చాలా వరకు తగ్గుతుందంటున్నారు నిపుణులు.

ఇంజన్ ఆపండి : ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటంటే ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎక్కువసేపు కారు నిలపాల్సి వచ్చినప్పుడు వెహికల్ ఇంజిన్ ఆఫ్ చేయరు. కానీ.. నిమిషం కన్నా ఎక్కువ సమయం ఆపాల్సి వస్తే ఇంజిన్​ను ఆఫ్ చేయడం మంచిది. ఈ ట్రిక్ కారు నుంచి వచ్చే పొగను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది.

సరిగ్గా నడపడం : కారు నుంచి వెలువడే పొగను తగ్గించుకోవాలంటే మీరు చేయాల్సిన మరో పని.. వాహనాన్ని సరిగా నడపాలి. అలాకాకుండా ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ వెహికల్​ను అటూఇటూ తిప్పడం, సడన్​గా బ్రేకులు వేసి ఆ వెంటనే ఎక్సలేటర్ ప్రెస్ చేయడం వంటి పనులు చేయడం వల్ల ఇంజిన్ అధిక ఒత్తిడికి లోనవుతుంది. దాంతో అధిక పొగ వస్తుంది. కాబట్టి.. కారును సరిగ్గా నడపాలి. దీనివల్ల కేవలం ఇంజిన్​ను కాపాడుకోవడమే కాదు.. రోడ్డు ప్రమాదాలు జరగకుండా నిరోధించొచ్చు. తద్వారా ప్రాణాలను కూడా రక్షించుకోవచ్చు.

ఈ సంకేతాలు కనిపిస్తే - మీ కారు బ్రేక్స్ ఫెయిల్ కాబోతున్నట్టే!

మీ కారు నుంచి పొగ వెలువడకుండా ఉండాలంటే.. కొనుగోలు చేసే ముందే "గో గ్రీన్"​కు ప్రాధాన్యత ఇవ్వండి. అంటే ఇటీవల కాలంలో మార్కెట్లోకి వస్తున్న ఎలక్ట్రిక్ కార్లపై దృష్టిపెట్టండి. ఒకవేళ పెట్రోల్, డీజిల్​తో నడిచే కార్లనే కొనుగోలు చేయాలని అనుకుంటే.. అందులో హైబ్రిడ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకోవచ్చు. లేదంటే సీఎన్‌జీ వేరియంట్లలో ఉన్న కార్లను ఎంచుకున్నా కూడా పొల్యూషన్ ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చంటున్నారు నిపుణులు. ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే.. మీ కారు ఇంజన్ చాలా సేఫ్​గా ఉంటుందని.. వెహికిల్ నుంచి వచ్చే పొగ చాలా వరకు తగ్గడమే కాకుండా.. పర్యావరణానికి సహకరించినవారవుతారని అంటున్నారు.

మీ కారు మంచి ధరకు అమ్ముడుపోవాలంటే - ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.