ETV Bharat / business

UPI ద్వారా రాంగ్ నంబర్​కు డబ్బులు పంపించారా? డోంట్ వర్రీ - ఇకపై 24 గంటల్లోనే రీఫండ్​! - UPI Wrong Transaction Refund

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 20, 2024, 3:44 PM IST

How to get Refund for Wrong UPI Transaction : మీరు పొరపాటున రాంగ్ యూపీఐ అకౌంట్​కు డబ్బులు పంపారా? డోంట్ వర్రీ. ఆర్​బీఐ కొత్త రూల్ ప్రకారం, ఇకపై కేవలం 24 - 48 గంటల్లోనే మీ డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

RBI New Rules For UPI Payment
How to reverse wrong UPI transaction (Getty Images)

How to get Refund for Wrong UPI Transaction : యూపీఐ వినియోగదారులకు గుడ్ న్యూస్​. ఆర్​బీఐ కొత్త రూల్ ప్రకారం, ఇకపై యూపీఐ ద్వారా రాంగ్​ నంబర్​కు పంపించిన డబ్బులను, మీరు 24 గంటల నుంచి 48 గంటల్లోపు వెనక్కు తీసుకోవచ్చు. పంపించిన వ్యక్తి, ఆ డబ్బులు పొందిన వ్యక్తి, ఇద్దరు కూడా ఒకే బ్యాంక్ ఖాతాదారులు అయ్యుంటే, రీఫండ్ త్వరగా వస్తుంది. ఒకవేళ వారి అకౌంట్​లు వేర్వేరు బ్యాంకులకు సంబంధించినవి అయితే, ఈ రీఫండ్ రావడం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.

యూపీఐ పద్ధతిని అభివృద్ధి చేసిన ఎన్​పీసీఐ, సింగిల్ మొబైల్ యాప్​నకు అనేక బ్యాంకు అకౌంట్​లను లింక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అందువల్ల యూజర్లు చాలా సులువుగా డబ్బులు పంపడానికి, బిల్లులు పే చేయడానికి, ఆన్​లైన్ షాపింగ్ చేయడానికి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్​ వివరాలు తెలుసుకోవడానికి వీలవుతోంది. ఇంత వరకు ఓకే. ఇప్పుడు మనం UPI ద్వారా రాంగ్ అకౌంట్​కు డబ్బులు పంపించి ఉంటే, దాని గురించి Paytm, BHIM, Google Pay, PhonePe వంటి UPI యాప్​లలో ఏ విధంగా రిపోర్ట్ చేయాలో తెలుసుకుందాం.

Paytm UPI : మీరు Paytm ద్వారా రాంగ్ అకౌంట్​కు డబ్బులు పంపినట్లయితే, మీరు నేరుగా ఆ వ్యక్తిని సంప్రదించి మీ మనీ తిరిగి ఇవ్వమని అడగాలి. అది వీలుకాకపోతే, రిసీవర్ బ్యాంక్​ను సంప్రదించాలి. అప్పటికీ ఫలితం లేకపోతే Paytm కస్టమర్​ కేర్​ను సంప్రదించాలి.

  • మొదట మీ ఫోన్​లో పేటీఎం యాప్​ను ఓపెన్​ చేసి ఎగువ ఎడమవైపున ఉన్న ప్రొఫైల్ పిక్చర్ మెనుపై నొక్కాలి.
  • ఆ తర్వాత క్రిందికి స్క్రోల్ చేసి 24×7 Help and Support అనే ఆప్షన్​పై నొక్కాలి.
  • అనంతరం మళ్లీ స్క్రోల్ డౌన్ చేసి View All Servicesపై క్లిక్ చేయాలి.
  • UPI Payment & Money Transfer అనే విభాగానికి వెళ్లాలి.
  • అక్కడ మీరు చేసిన wrong transactionను ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత మీరు ఫిర్యాదు చేయడానికి, రీఫండ్ ప్రక్రియను ప్రారంభించడానికి Paytm అసిస్టెంట్‌తో చాట్‌ని ప్రారంభించాలి. జరిగిన విషయం చెప్పాలి.
  • అప్పుడు Paytm బృందం రిసీవర్​ని సంప్రదించి, మీరు యూపీఐ ద్వారా పంపిన మొత్తాన్ని రీఫండ్ చేస్తుంది.

BHIM UPI :

  • మొదట మీరు BHIM యాప్ ఓపెన్ చేసి, ఎగువ కుడివైపు ఉన్న Hamburger Menu (మూడు లైన్లు)పై నొక్కాలి.
  • ఆ తర్వాత Raise Complaint అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీరు ఫిర్యాదు చేయాలనుకుంటున్న లావాదేవీని ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత ఆన్‌లైన్‌లో వివరాలను పూరించడానికి Raise a Concernపై నొక్కాలి. లేదా
  • టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయడానికి మీరు కాల్ బ్యాంక్‌పై నొక్కాలి.

Google Pay UPI :

  • మీ ఫోన్‌లోని Google Pay యాప్​ను ఓపన్ చేయాలి.
  • ఆ తర్వాత క్రిందికి స్క్రోల్ చేసి Show all transaction historyపై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీరు చేసిన రాంగ్ ట్రాన్సాక్షన్​ను ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత దిగువన ఉన్న Having issues బటన్‌పై నొక్కాలి.

PhonePe UPI :

  • ముందుగా మీ ఫోన్‌లో PhonePe యాప్‌ను ఓపెన్ చేయాలి.
  • ఆ తర్వాత క్రింద ఉన్న History అనే బటన్‌పై నొక్కాలి.
  • ఆపై మీరు ఫిర్యాదు చేయాలనుకుంటున్న లావాదేవీని ఎంచుకోవాలి.
  • తరువాత PhonePe కస్టమర్ కేర్​ను సంప్రదించాలి.

టోల్​ ఫ్రీ నంబర్​ : రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్​ చేసినప్పుడు, టోల్​ ఫ్రీ నంబర్​ 1800-120-1740కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఎలాగే NPCIకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఈ విధంగా మీరు యూపీఐ ద్వారా చేసిన రాంగ్​ ట్రాన్సాక్షన్​పై ఫిర్యాదు చేసి, రీఫండ్ పొందవచ్చు.

UPI Payments Without Active Internet : జస్ట్ ఓ కాల్​తో -​ ఇంటర్నెట్​ లేకున్నా సులువుగా యూపీఐ పేమెంట్స్!

UPI Credit Line Facility : అకౌంట్​లో డబ్బులు లేకపోయినా UPI పేమెంట్స్ - ఎలాగంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.