How To Pay LIC Premium Without Login : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ. మన దేశంలో అత్యంత విశ్వసనీయత ఉన్న సంస్థల్లో ఈ బీమా కంపెనీ ముందు వరుసలో ఉంటుంది. పాలసీదారులకు ఆర్థిక రక్షణను అందించడం, పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించడం, పదవీ విరమణ ప్రణాళికకు సహాయం చేయడం, ఉపాధిని సృష్టించడం, సామాజిక భద్రతా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించడంలో ఎల్ఐసీ ముఖ్యపాత్ర పోషిస్తోంది.
మీ ఎల్ఐసీ పాలసీని యాక్టివ్గా ఉంచుకోవడానికి, ఎలాంటి అంతరాయం లేకుండా బీమా రక్షణ పొందడానికి, ప్రీమియంలను సకాలంలో చెల్లించడం చాలా ముఖ్యం. సాధారణంగా మనం ఆఫీసుకు వెళ్లి లేదా ఆన్‌లైన్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఎల్ఐసీ ప్రీమియం చెల్లిస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం అత్యవసరంగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో లాగిన్ కాకుండానే ఎల్ఐసీ ప్రీమియం ఎలా చెల్లించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Pay LIC Premium Without Login : రిజిస్ట్రేషన్ లేకుండా ఆన్‌లైన్‌లో ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
- ముందుగా ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ https://licindia.in/ ఓపెన్ చేయండి.
- కస్టమర్ సర్వీస్ సెక్షన్లోకి వెళ్లి, Pay Premium online లేదా Online Premium Payment ఆప్షన్పై క్లిక్ చేయండి.
- ప్రీమియం పేమెంట్ పేజీలో Pay Direct లేదా Quick Pay అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- పేమెంటే పేజీలో మీ ఎల్ఐసీ పాలసీ నంబర్, ప్రీమియం అమౌంట్ తదితర వివరాలు అన్నీ నమోదు చేయండి.
- మీరు నమోదు చేసిన వివరాలు అన్నింటినీ డబుల్ చెక్ చేసుకోండి. ఎందుకంటే అందులో ఏమైనా తప్పులు ఉంటే, తరువాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
- ప్రీమియం అమౌంట్ చెల్లించడానికి ఎల్ఐసీ వెబ్‌సైట్‌లో చాలా ఆప్షన్లు ఉంటాయి. కనుక మీకు అనువైన విధానంలో ప్రీమియం చెల్లించవచ్చు. అంటే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా డిజిటల్ వాలెట్‌ల ద్వారా ప్రీమియం చెప్పించవచ్చు.
- పేమెంట్ పూర్తయిన తరువాత మీకొక కన్ఫర్మేషన్ మెసేజ్ లేదా పేమెంట్ రిసిప్ట్ వస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.
రిజిస్ట్రర్ చేసుకోవడమే బెటర్ : రిజిస్ట్రేషన్ లేకుండా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు. అయితే ఎల్ఐసీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని అకౌంట్ క్రియేట్ చేసుకోవడమే మంచిది. ఇలా సొంత అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల, మీ బీమా పాలసీలను నిర్వహించుకోవడానికి, ప్రీమియం గడువు తేదీలను వీక్షించడానికి, పాలసీ స్థితిని ట్రాక్ చేయడానికి, ఇతర ఆన్‌లైన్ సేవలను సౌకర్యవంతంగా యాక్సెస్ చేయడానికి వీలవుతుంది.