ETV Bharat / business

PPF అకౌంట్​ మెచ్యూర్​ అయ్యిందా? ఈ టిప్స్​ పాటిస్తే - మీ ఆదాయం 'డబుల్'​​ కావడం గ్యారెంటీ! - PPF Corpus Management Tips

PPF Corpus Management Tips : మీ పీపీఎఫ్ అకౌంట్​ మెచ్యూర్ అయ్యిందా? మీకు వచ్చిన (కార్పస్​) డబ్బులతో ఏం చేయాలో తెలియడం లేదా? అయితే ఇది మీ కోసమే. పీపీఎఫ్​ ఖాతా మెచ్యూర్ అయిన తరువాత, ఆ డబ్బులను వివిధ పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్​ చేసి, భారీగా రాబడి సంపాదించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

money management tips in telugu
PPF Corpus Management Tips in telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 1:41 PM IST

PPF Corpus Management Tips : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) ఖాతా అనేది భారత ప్రభుత్వం మద్దతు, హామీ గల సేవింగ్ స్కీమ్. పీపీఎఫ్‌ ఖాతాను పోస్టాఫీసులో గానీ, ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంక్​లలో గానీ ఓపెన్ చేయవచ్చు. ఈ ఖాతా కాలవ్యవధి 15 ఏళ్లు. ఏడాదికి కనీస డిపాజిట్‌ కింద రూ.500, గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్‌ చేయవచ్చు. పీపీఎఫ్ డిపాజిట్లు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులను కలిగి ఉంటాయి.

పీపీఎఫ్​ అకౌంట్ మెచ్యూర్ అయినప్పుడు ఖాతాదారుడికి మూడు ఆప్షన్లు ఉంటాయి. అవేంటంటే?

  • పీపీఎఫ్ ఖాతా మెచ్యూర్ అయిన తరువాత, అప్ప‌టి వ‌ర‌కు చెల్లించిన డిపాజిట్‌, వ‌డ్డీలను ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. వచ్చిన డబ్బును అధిక రాబడిని అందించే ఇతర పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
  • మెచ్యూర్ అయిన తర్వాత కూడా PPF ఖాతాను కొనసాగించవచ్చు. మీకు కావాలంటే మళ్లీ పెట్టుబడులు పెట్టవచ్చు. లేదా కొత్తగా పెట్టుబడులు పెట్టకుండానే పీపీఎఫ్​ను కొనసాగించవచ్చు.
  • పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూర్​ అయిన తరువాత, దానిని మూసివేయకుండా, ఐదేళ్ల కొకసారి చొప్పున ఎన్నిసార్లయినా పొడిగించుకోవచ్చు. మెచ్యూరిటీకి ఏడాది కాలం ఉన్నప్పుడే మీరు ఈ విషయాన్ని బ్యాంకు లేదా పోస్టాఫీసుకు తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ విషయాన్ని ముందుగా తెలియజేయకపోతే, ఈ అకౌంట్‌లో మళ్లీ డబ్బులను డిపాజిట్ చేయడానికి వీలుండదు. అయితే పీపీఎఫ్​ ఖాతాను క్లోజ్ చేసుకునేంత వరకు వడ్డీ రూపంలో ఆదాయం పొందవచ్చు. పైగా మీరు పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు.

బెస్ట్ ఇన్వెస్ట్​మెంట్ ఆప్షన్స్​!
ఒకవేళ మీరు పీపీఎఫ్ ఖాతా మెచ్యూర్​ అమౌంట్ మొత్తాన్ని విత్​డ్రా చేసుకుంటే, ఆ (కార్పస్) ఆర్థిక నిధిని ఇతర పెట్టుబడి మార్గాలకు కూడా మళ్లించి రెట్టింపు లాభాలు సంపాదించవచ్చు. అది ఎలా అంటే?

డెట్ ఫండ్స్​
మీరు తక్కువ రిస్క్​ ఉండే డెట్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేసి మంచి రాబడి పొందవచ్చు. ఇందుకోసం డెట్​-ఓరియెంటెడ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్​ ఎంచుకోవాలి. ఇవి దాదాపు 65-75 శాతం వరకు డెట్​ ఫండ్స్​లో, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అందువల్ల నష్టభయం తగ్గుతుంది. దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం పెరుగుతుంది. కనుక మీరు ఎవర్​గ్రీన్ డైనమిక్ బాండ్​ ఫండ్స్ లాంటి డెట్​ ఫండ్స్​ ఎంచుకోవడం మంచి ఆప్షన్​ అవుతుంది.

బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్
మీరు మరికొంచెం రిస్క్ తీసుకోగలిగితే, డైనమిక్ ఫండ్స్​ను ఎంచుకోవచ్చు. ఈ డైనమిక్ ఫండ్స్ అనేవి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డెట్​, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. నిపుణుల ప్రకారం, ఈ డైనమిక్ ఫండ్స్ దీర్ఘకాలంలో 8-12 శాతం వరకు రాబడినిస్తాయి.

ఫ్లెక్సీ క్యాప్ - మల్టీ క్యాప్ - మల్టీ అసెట్ ఫండ్స్

  • మీకు బాగా రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే, ఫ్లెక్సీ క్యాప్​లను ఎంచుకోవచ్చు. ఈ ఫ్లెక్సీ క్యాప్​ ఈక్విటీ స్కీమ్స్​ ఎలాంటి పరిమితులు లేకుండా భిన్నమైన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక రిస్క్​, రివార్డ్ రెండూ ఎక్కువగానే ఉంటాయి.
  • మల్టీక్యాప్ ఫండ్స్ నిర్దిష్ట వ్యూహం ప్రకారం, మార్కెట్లో పెట్టుబడులు పెడతాయి. కనుక నష్టభయం తక్కువగా ఉంటుంది. లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • మల్టీ అసెట్ ఫండ్స్ అనేవి డెట్​, ఈక్విటీ, గోల్డ్, రియల్ ఎస్టేట్ లాంటి బహుళ పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ పెట్టుబడి వైవిధ్యం వల్ల నష్టభయం బాగా తగ్గుతుంది. దీర్ఘకాలంలో మంచి లాభాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఈ విధంగా పీపీఎఫ్ ద్వారా సమకూరిన ఆదాయాన్ని, మీరు రెట్టింపు చేసుకోవచ్చు.

మొదటిసారి ITR ఫైల్​ చేస్తున్నారా? ఈ టిప్స్ మీ కోసమే! - ITR Filling Tips

క్రెడిట్ కార్డ్​లు వాడుతున్నారా? ఈ అపోహలు & వాస్తవాలు గురించి తెలుసుకోండి! - Credit Card Myths

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.