How To Book Train Ticket 5 Minutes Before Departure Of Train : దూరప్రయాణాలు చేసేటప్పుడు సాధారణంగా రైలునే ఎక్కువ మంది ఎంచుకుంటారు. ఎందుకంటే మిగతా ప్రయాణ సాధనాలతో పోలిస్తే, రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. పైగా ఖర్చులు కూడా బాగా తక్కువ. అందుకే కొన్ని నెలల ముందుగానే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు.
కానీ కొన్నిసార్లు అర్జెంట్‌గా ట్రైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు తత్కాల్ టికెట్లను బుకింగ్ చేసుకుంటూ ఉంటాం. రైలు ప్రయాణానికి కొన్ని గంటల ముందు వరకు మాత్రమే ఈ తత్కాల్ టికెట్ పొందడానికి వీలు ఉంటుంది. కానీ మరో 5 నిమిషాల్లో ట్రైన్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు కూడా టికెట్లు బుక్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఎలాగంటే?
రెండు ఛార్ట్లు ఉంటాయ్!
చాలా మంది ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుని, చివరి నిమిషంలో అనేక కారణాలతో వాటిని క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. దీని వల్ల ట్రైన్లో చాలా సీట్లు ఖాళీ అయిపోతాయి. ఇలాంటి సమయంలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం రైల్వే శాఖ టికెట్లు విక్రయిస్తుంది. ప్రతి ట్రైన్ టికెట్ బుకింగ్ కన్ఫర్మేషన్ కోసం రైల్వే శాఖ 2 ఛార్ట్లను ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు ఫస్ట్ ఛార్ట్ ప్రిపేర్ అవుతుంది.
రైలు స్టార్ట్ కావడానికి ముందు కూడా ఒక ఛార్ట్‌ను ప్రిపేర్ చేస్తారు. గతంలో ఒక అరగంట ముందు వరకు మాత్రమే ట్రైన్ టికెట్ బుకింగ్‌కు అవకాశం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చివరి 5 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. కనుక మీరు అర్జెంట్ ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ట్రైన్ స్టార్ట్ కావడానికి 5 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ఎలా ట్రైన్ టికెట్ బుక్ చేయాలి?
ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే, ముందుగా ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇందుకోసం రైల్వే డిపార్ట్మెంట్ వారు ప్రిపేర్ చేసిన ఆన్లైన్ ఛార్ట్‌ను చూడాలి. ఇందుకోసం ముందుగా IRCTC యాప్ ఓపెన్ చేసి ట్రైన్ సింబల్‌పై క్లిక్ చేయాలి. అక్కడ ఛార్ట్ వేకెన్సీ లిస్ట్ కనిపిస్తుంది. లేదా నేరుగా ఆన్లైన్ ఛార్ట్ వెబ్సైట్లోకి వెళ్లి కూడా ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు.
Online Chart వెబ్సైట్లో ట్రైన్ పేరు/ నంబర్, తేదీ, ఎక్కాల్సిన స్టేషన్ వివరాలు నమోదు చేసి, Get Train Chartపై క్లిక్ చేయాలి. వెంటనే ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఛైర్ కార్, స్లీపర్ క్లాస్‌ల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు కనిపిస్తాయి. కనుక ఖాళీగా ఉన్న సీట్లను మీరు బుక్ చేసుకోవచ్చు. కోచ్ నంబర్, బెర్త్ తదితర వివరాలు కూడా అక్కడే మీకు కనిపిస్తాయి. ఒకవేళ మీరు వెళ్లాల్సిన ట్రైన్లో సీట్లు లేకపోతే సున్నా చూపిస్తుంది. సాధారణంగా రైలు స్టార్ట్ అయ్యే స్టేషన్లలో ఎక్కేవారికే ఈ ఆప్షన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.