ETV Bharat / business

ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాలా? సరైన ITR ఫారాన్ని ఎంచుకోండిలా! - How To Choose Right ITR Form - HOW TO CHOOSE RIGHT ITR FORM

How To Choose Right ITR Form : మీరు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. మీ ఆదాయం, నిర్దేశిత షరతులను అనుసరించి, మీరు ఏ ఐటీఆర్​ ఫారాన్ని దాఖలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Income tax return Process
How To Choose Right ITR Form
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 4:56 PM IST

How To Choose Right ITR Form : సంపాదించిన ఆదాయంపై ప్రభుత్వానికి పన్ను చెల్లించే విధానం భారతదేశంలో పురాతన కాలం నుంచి ఉంది. అందులో భాగంగానే నేడు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడం తప్పనిసరి అయ్యింది. ప్రస్తుతం మన దేశంలో సంపాదిస్తున్న ఆదాయం, నిర్దేశిత షరతుల ఆధారంగా ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-3, ఐటీఆర్-4, ఐటీఆర్-5, ఐటీఆర్-6, ఐటీఆర్-7లను ఆదాయపన్ను శాఖ నోటిఫై చేసింది. పన్ను చెల్లింపుదారుల ఆదాయ వనరులు, సంపాదించిన మొత్తం, పన్ను చెల్లింపుదారుడు ఏ కేటగిరీకి చెందినవాడు అనే విషయాల ఆధారంగా తగిన ఐటీఆర్​ ఫారమ్​ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

సరైన ఐటీఆర్ ఫారాన్ని ఎంచుకోవడం ఎలా?
ప్రతి సంవత్సరం సెంట్రల్ బోర్డ్ అఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ITR ఫారాలను నోటిఫై చేస్తుంది. కింద పేర్కొన్న ఏవైనా షరతులు మీకు వర్తిస్తే, కచ్చితంగా మీరు ఆదాయ పన్ను రిటర్నలు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ITR-1 లేదా SAHAJ
భారతీయదేశంలో నివసిస్తున్న సాధారణ పౌరులై ఉండి, రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగి ఉన్న వ్యక్తులు ITR-1 ఫారమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. జీతం, ఒక ఇంటి నుంచి వచ్చే ఆదాయం, ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయం, జీవిత భాగస్వామి లేదా బిడ్డల ద్వారా వచ్చిన ఆదాయాలు అన్నీ కలిపి రూ.50 లక్షల వరకు ఉంటే ఐటీఆర్​-1 దాఖలు చేయాల్సిందే.

ITR-2
వృత్తి, వ్యాపారాల ద్వారా ఆదాయం సంపాదించని వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఈ ఐటీఆర్​ ఫారమ్-2ను దాఖలు చేయాలి. రూ.50 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఆదాయం కలిగిన వ్యక్తి, కంపెనీ డైరెక్టర్, జాబితా చేయని ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నవారు ఈ ఐటీఆర్​ ఫారమ్​-2 దాఖలు చేయాల్సి ఉంటుంది. అలాగే జీతాలు, బహుళ గృహాలు, మూలధన లాభాలు కలిగినవారు; భారతదేశం వెలుపల ఆస్తులు, ఆదాయ మార్గాలు కలిగిన వారు ITR-2 ఫారమ్ తప్పనిసరిగా దాఖలు చేయాలి.

ITR-3
వృత్తి, వ్యాపారాల ద్వారా ఆదాయం, లాభాలు సంపాదిస్తున్న ఇండివిడ్యువల్ వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలవారు ఐటీఆర్​-3 సమర్పించాలి.

ITR-4 లేదా SUGAM
రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు, హెచ్‌యుఎఫ్‌లు, సంస్థలు (ఎల్‌ఎల్‌పి కాకుండా); ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 44AD, 44ADA, 44AE ప్రకారం వృత్తి, వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదిస్తున్న వ్యక్తులు ఐటీఆర్​-4 దాఖలు చేయాలి.

ITR-5
ఇండివిడ్యువల్స్​, HUF, కంపెనీలు, ITR-7 దాఖలు చేసినవారు కాకుండా, ఇతర విధాలుగా ఆదాయం సంపాదించేవారు ఈ ఐటీఆర్​-5 ఫారాన్ని దాఖలు చేయాలి.

ITR-6
ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 11 ప్రకారం మినహాయింపును క్లెయిమ్ చేసే కంపెనీలు కాకుండా ఇతర కంపెనీలు ఈ ఐటీఆర్​ ఫారమ్​-6ను దాఖలు చేయాల్సి ఉంటుంది.

ITR-7
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్లు 139(4A) లేదా 139(4B)లేదా 139(4C) లేదా 139(4D) కింద రిటర్న్​ దాఖలు చేయాల్సిన వ్యక్తులు, కంపెనీలు ఐటీఆర్​-7ను దఖాలు చేయాల్సి ఉంటుంది.

వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, మతపరమైన ట్రస్టులు, రాజకీయ పార్టీలు, శాస్త్రీయ పరిశోధన సంఘాలు, న్యూస్​ ఏజెన్సీలు, ఆసుపత్రులు, ట్రేడ్ యూనియన్లు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఎన్​జీఓలు లేదా ఇలాంటి ఇతర సంస్థలు ITR-7 పరిధిలోకి వస్తాయి.

క్రెడిట్​ కార్డ్​ యూజర్లకు అలర్ట్ ​- ఏప్రిల్‌ 1 నుంచి మారనున్న రూల్స్​! - Credit Card Rules From April 2024

మీరు టూ-వీలర్స్​ నడుపుతుంటారా? ఈ టాప్​-10 రోడ్ సేఫ్టీ టిప్స్ మీ కోసమే! - Road Safety Tips For Bike Riders

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.