ETV Bharat / business

మీ PF బ్యాలెన్స్​ తెలుసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి! - How To Check PF Balance - HOW TO CHECK PF BALANCE

How To Check PF Balance : మీ పీఎఫ్ బ్యాలెన్స్​ను చెక్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. పీఎఫ్ బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవన్నీ ఈ ఆర్టికల్​లో ఇస్తున్నాం. మీకు నచ్చిన విధానాన్ని అనుసరించి పీఎఫ్ బ్యాలెన్స్​ను చాలా ఈజీగా చెక్​ చేసుకోండి.

EPF balance check
Check Your EPF Balance Online 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 3:46 PM IST

How To Check PF Balance : గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఉద్యోగి ప్రతి నెలా తన ప్రాథమిక జీతంలో 12 శాతాన్ని పీఎఫ్ అకౌంట్​కు కంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తారు. అంతే మొత్తాన్ని యాజమాన్యం కూడా పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. అయితే మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్​ ఫండ్​ ఆర్గనైజేషన్​ ఆఫీసుకు వెళ్లకుండా, మీరు పనిచేసే కంపెనీ యజమానిని అడగకుండానే, పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్​ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Check PF Balance Online : మీ పీఎఫ్​ బ్యాలెన్స్​ను ఆన్‌లైన్​లో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

  • ముందుగా EPFO అధికారిక వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • మీ UAN, పాస్‌వర్డ్ ఉపయోగించి సైన్-ఇన్ కావాలి
  • బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటున్న నిర్దిష్ట PF ఖాతాను ఎంచుకోవాలి. (మీకు బహుళ పీఎఫ్ ఖాతాలు ఉంటే!)
  • తరువాత PF పాస్​బుక్​ ఆప్షన్​పై క్లిక్ చేయాలి. అంతే సింపుల్​.
  • మీ అకౌంట్​లో ఉన్న బ్యాలెన్స్, పీఎఫ్ హిస్టరీని అంతా కనిపిస్తుంది.

How To Check PF Balance In UMANG App : ఉమాంగ్ యాప్​ ఉపయోగించి కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఎలా అంటే?

  • ముందుగా ప్లేస్టోర్ నుంచి ఉమాంగ్ యాప్​ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • తర్వాత మీ ఫోన్​లో ఉమాంగ్ యాప్​ను ఓపెన్ చేసి EPFOను ఎంచుకోండి.
  • అనంతరం 'Employee Centric Services' అనే ఆప్షన్​పై క్లిక్ చేయండి.
  • తర్వాత మీ EPF బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి 'View Passbook' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • అనంతరం మీ UAN నంబర్​ను ఎంటర్ చేయండి.
  • వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయండి.
  • అప్పుడు మీ EPF బ్యాలెన్స్‌ వివరాలు కనిపిస్తాయి.

How To Check EPF Balance Offline : ఈపీఎఫ్ బ్యాలెన్స్​ను ఆఫ్​లైన్​లోనూ చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే?

SMS : మీ UANతో లింక్ చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​తో 7738299899 నంబక్​కు SMS పంపించి పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం EPFOHO UAN ENG అని టైప్ చేసి మెసేజ్ పంపండి. వెంటనే మీ EPF బ్యాలెన్స్ సమాచారాన్ని తెలుపుతూ ఒక సందేశం (SMS) వస్తుంది.

Missed Call : మీ UANతో లింక్ చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​తో 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వండి. కాల్ కట్ అయిపోతుంది. తర్వాత మీ EPF సమాచారం కలిగి ఉన్న SMS మీ ఫోన్​కు వస్తుంది. ఈ విధంగా మీరు ఆఫ్​లైన్​లోనూ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

ముకేశ్ అంబానీ 'ఇన్వెస్ట్​మెంట్ ఫార్ములా' - తెలుసుకుంటే ధనవంతులు కావడం గ్యారెంటీ! - Mukesh Ambani Investments

FD కంటే అధిక వడ్డీ + ట్యాక్స్ బెనిఫిట్స్​ కావాలా? ఈ స్కీమ్​పై ఓ లుక్కేయండి! - National Savings Certificate Scheme

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.