ETV Bharat / business

సెకండ్ హ్యాండ్ కారు కోసం లోన్​ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి సుమా! - Second Hand Car Loan

Second Hand Car Loan : మనలో చాలా మంది బ్యాంక్​ లోన్ ద్వారా కారులు, బైక్​లు కొంటుంటాం. అయితే, కొత్త కారు కొనే స్తోమత లేనివారు, లోన్​ ద్వారా సెకండ్ హ్యాండ్ కారులు కొనుకోవాలనుకుంటారు. అలాంటి సందర్భల్లో బ్యాంక్​లు త్వరగా రుణాలు మంజురు చేయాలంటే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

Second Hand Car Loan
Second Hand Car Loan (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 19, 2024, 10:56 AM IST

Second Hand Car Loan : పాత కారు కొనాలని అనుకుంటున్నారా? దీనికోసం రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ కార్లకు కూడా రుణం ఇస్తున్నాయి. కాకపోతే ఇలాంటి లోన్​లు తీసుకునే ముందు మనం కొన్ని నిబంధనలను అర్థం చేసుకోవాలి. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు వేసుకుంటే, రుణ దరఖాస్తు తిరస్కరించకుండా కారు కొనేందుకు అవసరమైన లోన్​ లభిస్తుంది.

తక్కువ క్రెడిట్‌ స్కోరు (Credit score) ఉంటే లోన్​లు లభించడంలో ఇబ్బంది ఎదురవుతుంది. కొన్ని సందర్భాల్లో కొత్త రుణాలు రాకుండా తక్కువ క్రెడిట్​ స్కోర్ అడ్డుకుంటుంది. కాబట్టి, కారు కొనేందుకు మీరు రుణం తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నప్పుడు, ముందుగా మీ క్రెడిట్​ స్కోరు ఎంతుందో తెలుసుకోండి.

  • ఒకవేళ స్కోరు మీ క్రెడిట్​ స్కోరు తక్కువగా ఉండి, రుణం ఇవ్వడానికి తిరస్కరించే అవకాశం ఉందని భావిస్తే, కొన్ని రోజులు మీ నిర్ణయాన్ని వాయిదా వేయండి. మీ ఈఎంఐలను క్రమం తప్పకుండా చెల్లించండి. కొత్తగా అప్పులను తీసుకునేందుకు బ్యాంకులను సంప్రదించకూడదు.
  • ఆదాయంతో పోలిస్తే రుణాలు అధిక నిష్పత్తిలో ఉన్నప్పుడు కూడా కొత్త లోన్​ రాకపోవచ్చు. మీరు ఇప్పటికే ఆర్థికంగా చిక్కుల్లో ఉన్నారని రుణ సంస్థలు భావిస్తాయి.
  • మీ రుణ నిష్పత్తిని తగ్గించుకునేందుకు ఇప్పటికే ఉన్న అప్పులను చెల్లించండి. ముందుగా అధిక వడ్డీ ఉన్న వాటిని వదిలించుకోండి.
  • ప్రతి ఆర్థిక సంస్థ నిర్ణీత మొత్తంలో ఆదాయం ఉన్న వారికే అప్పులు ఇస్తామని ముందుకు వస్తుంది. ఇలాంటప్పుడు మీ ఆదాయం సరిపోయేంత లేకపోతే రుణం రాకపోవచ్చు.
  • మీకు స్థిరమైన ఆదాయం ఉన్నట్లు రుజువులను బ్యాంకు/ఎన్‌బీఎఫ్‌సీకి అందించండి. అదనపు ఆదాయాలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పండి. మీ దరఖాస్తును తిరస్కరించకుండా అవసరమైతే సహ దరఖాస్తుదారు మద్దతు తీసుకోండి.
  • పాత కారు కోసం మీరు తక్కువ మొత్తం (డౌన్‌ పేమెంట్‌) చెల్లించి, రుణం అధికంగా కోరినప్పుడు బ్యాంకులు సహజంగానే ఆ దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది.
  • లోన్‌ మొత్తం తక్కువగా ఉండేలా చూసుకుంటూ, సొంతంగా కాస్త అధికంగా చెల్లిస్తే రుణ దరఖాస్తు (Loan Application) ఆమోదం పొందుతుంది.

అదిరే ఫీచర్స్​తో - 2024లో లాంఛ్ కానున్న టాప్​-8 కార్స్ ఇవే!​ - Upcoming Cars In India 2024

అదిరే ఫీచర్స్​తో న్యూ-జెన్ మారుతి​ కార్లు! CNG, ఎలక్ట్రిక్ ఆప్షన్లతో త్వరలో లాంఛ్ కానున్న మోడల్స్​​ ఇవే! - Upcoming New Gen Maruti Suzuki Cars

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.