ETV Bharat / business

ఫిక్స్‌డ్ డిపాజిట్ Vs రికరింగ్ డిపాజిట్ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​! - Fixed Deposit Vs Recurring Deposit - FIXED DEPOSIT VS RECURRING DEPOSIT

Fixed Deposit Vs Recurring Deposit : మీరు భవిష్యత్​ కోసం డబ్బులు పొదుపు చేయాలని అనుకుంటున్నారా? ఫిక్స్​డ్ డిపాజిట్​, రికరింగ్ డిపాజిట్​లలో ఏది మంచిదో తేల్చుకోలేకపోతున్నారా? అయితే ఇది మీ కోసమే. ఎఫ్​డీ Vs ఆర్​డీలలో ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

Recurring Deposit Vs Fixed Deposit
Fixed Deposit Vs Recurring Deposit (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 2:39 PM IST

Fixed Deposit Vs Recurring Deposit : మన భవిష్యత్ బాగుండాలంటే, వచ్చిన ఆదాయంలోంచి కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మన ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయి. అత్యవసర సమయంలో ఆ పొదుపు చేసిన డబ్బులు మనల్ని ఆదుకుంటాయి. పొదుపు పథకాలు అనగానే మనకు ఫిక్స్​డ్​ డిపాజిట్​ (ఎఫ్​డీ), రికరింగ్ డిపాజిట్​ (ఆర్​డీ) అనే రెండు ఆప్షన్​లు కనిపిస్తాయి. మీ ఆర్థిక లక్ష్యాలు, నష్టాన్ని భరించే శక్తి, డబ్బు అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Fixed Deposit (ఎఫ్​డీ) :

  • ఫిక్స్​డ్ డిపాజిట్​లో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
  • ఎఫ్​డీల్లో ఫిక్స్​డ్ వడ్డీ రేట్లు ఉంటాయి. వీటిలో ఎలాంటి మార్పులు ఉండవు.
  • మీరు కొరుకున్న టెన్యూర్​కు ఎఫ్​డీ చేసుకోవచ్చు. అంటే కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల వ్యవధితో ఫిక్స్​డ్​ డిపాజిట్ చేసుకోవచ్చు.
  • ఎఫ్​డీ పేఅవుట్​ ప్రిఫరెన్స్​ను మీకు నచ్చినట్లుగా ఎంచుకోవచ్చు. అంటే ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వచ్చిన వడ్డీని మీ అవసరాల కోసం తీసుకోవచ్చు. లేదా ఆ వడ్డీని మళ్లీ రీఇన్వెస్ట్ చేయవచ్చు. లేదా కాంపౌండింగ్​ ఆప్షన్​ను ఎంచుకోవచ్చు.
  • ఫిక్స్​డ్ డిపాజిట్లలో లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. అంటే మీరు ఎఫ్​డీల నుంచి మధ్యలో డబ్బులు తీయలేరు. ఒకవేళ తీయాల్సి వస్తే, మీకు రావాల్సిన వడ్డీని వదులుకోవాల్సి వస్తుంది. పైగా పెనాల్టీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

Recurring Deposit (ఆర్​డీ) :

  • రికరింగ్ డిపాజిట్లలో మీరు రెగ్యులర్​గా (నెలవారీగా) డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.
  • రికరింగ్ డిపాజిట్​లో మీకు నచ్చినంత డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.
  • ఫిక్స్​డ్ డిపాజిట్ లాగానే, రికరింగ్ డిపాజిట్​లో కూడా ఫిక్స్​డ్ వడ్డీ రేటు ఉంటుంది.
  • ఆర్​డీ కూడా నిర్ణీత కాలవ్యవధి (ఫిక్స్​డ్ టెన్యూర్) తరువాత మెచ్యూర్​ అవుతుంది. కనుక మీకు ఎంత రాబడి వస్తుందో ముందే తెలిసిపోతుంది.
  • ఎఫ్​డీతో పోలిస్తే ఆర్​డీలో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు అవసరమైనప్పుడు రికరింగ్ డిపాజిట్ నుంచి డబ్బులు విత్​డ్రా చేసుకోవచ్చు. అవసరమైతే ఆర్​డీపై లోన్ కూడా తీసుకోవచ్చు. ​

ఏది బెస్ట్ ఆప్షన్​!
మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు ఉండి, సొంత ఇంటి కలలు, పిల్లల చదువులు, వారి పెళ్లిళ్ల లాంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు ఉంటే ఫిక్స్​డ్ డిపాజిట్లు మంచి ఆప్షన్ అవుతాయి. ఒకవేళ మీకు స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలు, అత్యవసరాలు ఉంటే రికరింగ్ డిపాజిట్లు మంచి ఎంపిక అవుతాయి. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే, మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుని, మీకు అనువైన పథకంలో పొదుపు చేసుకోవాలి.

బంగారంపై ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్-3 ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి! - Gold Investment Tips For Women

చేతిలో డబ్బులు లేవా? డోంట్ వర్రీ - 'క్యాష్​ లెస్ ట్రీట్​మెంట్' చేసే ఆసుపత్రులు ఇవే! - Importance Of Network Hospitals

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.