FASTag Without KYC Deactivate : జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) మార్చి 31లోగా వాహనదారులు అందరూ తమ ఫాస్టాగ్ కేవైసీని అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. కేవైసీ అప్డేట్ చేయని ఫాస్టాగ్ (FASTag)లను 2024 ఏప్రిల్ 1 నుంచి డీయాక్టివేట్ చేస్తామని లేదా బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తామని తేల్చిచెప్పింది. ఒకవేళ ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే, సదరు ఖాతాలో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ, దానితో పేమెంట్స్ చేయలేరని పేర్కొంది. అందుకే ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియను ఆన్లైన్లో ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆన్లైన్లో ఫాస్టాగ్ కేవైసీని అప్డేట్ చేయడం ఎలా?
- ముందుగా FASTag అధికారిక వెబ్సైట్ https://fastag.ihmcl.com ను ఓపెన్ చేయాలి.
- మీ మొబైల్ నంబర్, ఓటీపీ సాయంతో లాగిన్ అవ్వాలి.
- మై ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్లి, KYC అనే సబ్-సెక్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- అందులో మీ ఫాస్టాగ్ కేవైసీ వివరాలు నమోదు చేయాలి.
- వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, ఫొటోలను అప్లోడ్ చేయాలి.
- వివరాలు అన్నీ మరోసారి చెక్ చేసుకొని అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- 7 పని దినాల్లో మీ ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్‌ను చెక్ చేసుకోండిలా!
- మీ ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్‌ను చెక్ చేసుకునేందుకు
- ముందుగా https://fastag.ihmcl.com/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- మీ వివరాలను నమోదు చేసి, పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
- అక్కడ మీకు మీ ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది.
- ఒకవేళ అది ఇన్కంప్లీట్గా ఉంటే గనుక అక్కడే కేవైసీని అప్డేట్ కూడా చేసుకోవచ్చు.
ఫాస్టాగ్‌ను పొందండిలా!
సాధారణంగా వివిధ బ్యాంకులు ఫాస్టాగ్‌లను జారీ చేస్తుంటాయి. అందువల్ల మీరు https://www.netc.org.in/request-for-netc-fastag లింక్‌ను ఓపెన్ చేయాలి. మీకు ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంక్‌ను ఎంచుకోవాలి. అక్కడే ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
ప్రస్తుతానికి యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్‌లు ఫాస్టాగ్ సేవలను అందిస్తున్నాయి. అలాగే అమెజాన్, గూగుల్ పే లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఫాస్టాగ్‌ను పొందవచ్చు. ఇక వీటిల్లోనూ ఫాస్టాగ్ కేవైసీ ప్రాసెస్‌ను పూర్తి చేసే ప్రక్రియ అందుబాటులో ఉంది. వీటి ద్వారాను కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం సంబంధిత బ్యాంక్ లేదా ప్లాట్‌ఫామ్ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
వన్ వెహికిల్- వన్ ఫాస్టాగ్
One Vehicle One FASTag : వన్ వెహికల్- వన్ ఫాస్టాగ్ పాలసీ ప్రకారం ఒక వాహనానికి ఒక ఫాస్టాగ్ మాత్రమే ఉండాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్‌లు ఉంటే, వాటిలోని లేటెస్ట్ దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని మిగతా వాటన్నింటిన్నీ డీయాక్టివేట్ చేస్తారు. ఇక దీని రీఛార్జ్ విషయానికి వస్తే BBPS, UPI, నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఫాస్టాగ్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. చివరగా మీకు జారీ చేసే ఫాస్టాగ్ 5 ఏళ్ల వ్యాలిడిటీతో వస్తుంది. ఆ తర్వాత దాని వ్యాలిడిటీని పొడిగించుకోవచ్చు.
మీ ఫాస్టాగ్ KYC పూర్తి చేశారా? లేదంటే ఖాతా బ్లాక్ - ఇవాళే లాస్ట్ డేట్!
పేటీఎం FASTagను డీయాక్టివేట్ చేయాలా? రీఫండ్ కూడా కావాలా? అయితే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!