ETV Bharat / business

కారు కొనుగోలు చేస్తున్నారా? - ఈ సేఫ్టీ ఫీచర్స్ తప్పకుండా ఉండేలా చూసుకోండి! - Top Safety Features in Car

New Car Safety Features : మీరు కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే.. మీ కారులో అదనపు హంగుల సంగతి ఎలా ఉన్నా.. కచ్చితంగా కొన్ని సేఫ్టీ ఫీచర్లు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఊహించని ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కాపాడే ఈ ఫీచర్స్ కంపల్సరీ అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Car Safety Features
New Car Necessary Security Features
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 11:33 AM IST

New Car Necessary Security Features : చాలా మంది కారు డిజైన్, రంగు, మైలేజ్​కు ఇచ్చిన ఇంపార్టెన్స్.. సేఫ్టీ ఫీచర్స్​కు ఇవ్వట్లేదని ఆటోమొబైల్ నిపుణులు అంటున్నారు. దీనికారణంగా ఊహించని ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. అందువల్ల మీరు కొత్త కారు(Car) కొనే ఆలోచనలో ఉంటే.. ఈ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయా? లేదా? అనేది చెక్ చేసుకొని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎయిర్‌ బ్యాగులు : కొత్త కారు కొనేముందు చూడాల్సిన మొట్టమొదటి సేఫ్టీ ఫీచర్ ఎయిర్ బ్యాగులు. ఎందుకంటే.. మీరు కారులో సీటు బెల్టు పెట్టుకొని ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే.. వెంటనే సెన్సార్ల ద్వారా ఈ ఎయిర్ బ్యాగులు తెరుచుకుంటాయి. ఫలితంగా తల, గుండె భాగాలను రక్షించడంతోపాటు తీవ్రగాయాలు కాకుండా కాపాడుతాయి. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న చాలా కార్లలో.. ఫ్రంట్‌, సైడ్‌, కర్టన్‌ ఎయిర్‌బ్యాగ్‌లతో విడుదల అవుతున్నాయి. ఫలితంగా.. ఏవైపు నుంచి ప్రమాదం జరిగినా అందులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఏబీఎస్ : మీరు చూడాల్సిన మరో సెక్యూరిటీ ఫీచర్.. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS). ఈ ఫీచర్ ఉంటే సడన్‌ బ్రేక్‌ వేసినప్పుడు వాహనం అక్కడే ఆగిపోతుంది. ముందుకు జారదు. వాహనంపై డ్రైవరుకూ నియంత్రణ ఉంటుంది. అకస్మాత్తుగా ఎదురుగా ఏదైనా అడ్డొచ్చినా వాహనాన్ని పక్కకు తప్పించేందుకు డ్రైవరుకు వీలవుతుంది. ప్రమాదం చోటుచేసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫీచర్ చాలా కీలకంగా పనిచేస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి.

షాకింగ్ : కారు సీటుతో సంతాన సామర్థ్యానికి దెబ్బ - పిల్లలు పుట్టరా?

ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ (ఈబీడీ) : ఇది యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్​తో కలిసి వర్క్ చేస్తుంది. ఇది ప్రతి వీల్​కు వర్తించే బ్రేక్​ఫోర్స్ మొత్తాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. అంటే మీరు బ్రేకు వేసేటప్పుడు కారు 4 చక్రాల్లో దేనికి ఎంత బ్రేక్‌ ఫోర్స్‌ అవసరమో అంతే లభిస్తుంది. ఫలితంగా వాహనం తక్షణమే నియంత్రణలోకి వచ్చి ప్రమాద ముప్పు తగ్గుతుంది.

బ్రేక్ అసిస్ట్ : మీరు కొత్త కారు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా చూడాల్సిన మరో సెఫ్టీ ఫీచర్ బ్రేక్ అసిస్ట్. చాలా మందికి దీని గురించి అవగాహన ఉండకపోవచ్చు. కానీ.. ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఎందుకంటే అకస్మాత్తుగా ఏదైనా వాహనం ఎదురొస్తే డ్రైవరు ఆందోళనకు లోనై పూర్తిగా బ్రేకు వేసే పరిస్థితి ఉండదు. అలాంటి సందర్భాల్లో బ్రేక్‌ అసిస్ట్‌ ఉంటే.. సెన్సార్లు పని చేసి దానంతట అదే పూర్తి బ్రేకు పడుతుంది. ఫలితంగా ప్రమాద ముప్పును చాలా వరకు తగ్గుతుంది.

సీట్ బెల్ట్ ప్రీ టెన్షనర్ : కారు ప్రమాదానికి గురైనప్పుడు మన ప్రాణాలను కాపాడంలో సీట్ బెల్ట్ కీలక పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఇది ప్రమాదం జరిగినప్పుడు మనల్ని అటూ ఇటూ కదలకుండా సీటుకు అతుక్కోవడానికి మాత్రమే పని చేస్తుంది. అదే హార్డ్ బ్రేకింగ్, సడన్ యాక్సిడెంట్ అయినప్పుడు.. మన బాడీ చాలా వేగంతో ముందుకు గుద్దుకోవడం జరగుతుంది. ఆ టైమ్​లో సీట్​ బెల్ట్ ప్రీ టెన్షనర్ ఉంటే.. ప్రమాద తీవ్రతను తగ్గించి మనకు గాయాలు కాకుండా కాపాడుతుంది. ఈ ఫీచర్​తో పాటు సీట్ బెల్ట్ లోడ్ లిమిటర్ అనే సౌకర్యం కూడా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఉంటే ప్రమాదం జరిగినప్పుడు సీట్ బెల్ట్ కలిగించే ఒత్తిడిని తగ్గించి ఆ బెల్ట్​ను లోడ్‌కు అనుగుణంగా కొద్దిగా వదులు చేస్తుంది ఈ ఫీచర్.

ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ : ఈ ఫీచర్ ఫ్యామిలీ కోసం ముఖ్యంగా చిన్నపిల్లలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మీ కారులో ఈ ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ ఫీచర్ ఉంటే చైల్డ్ సీటును సరిచేయడానికి యూజ్ అవుతుంది. పిల్లల భద్రతను ఈ సేఫ్టీ ఫీచర్ పెంచుతుందంటున్నారు నిపుణులు. అందువల్ల ఇవన్నీ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

మీ కారు ఇచ్చే ఈ సిగ్నల్స్‌ చూస్తున్నారా? - లేకపోతే ఇంజిన్‌ ఖతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.