ETV Bharat / business

EPF అకౌంట్​లోని మీ వివరాలు మార్చుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - EPF KYC Correction - EPF KYC CORRECTION

EPF KYC Correction : మీరు ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) చందాదారులా? మీ పీఎఫ్‌ ఖాతాలోని వ్యక్తిగత వివరాలను మార్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఆన్​లైన్​లో చాలా సులువుగా మీ పీఎఫ్ ఖాతాలోని వివరాలను మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

EPF Name correction
EPF KYC Correction (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 1:53 PM IST

EPF KYC Correction : మీరు ఉద్యోగుల భవిష్య నిధి (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్​) చందాదారులా? మీ పీఎఫ్ అకౌంట్​ వివరాల్లో​ ఏవైనా తప్పులున్నాయా? లేదా వ్యక్తిగత వివరాలను అప్​డేట్‌ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. పీఎఫ్​ అకౌంట్​​లోని మీ వివరాలను సులువుగా ఆన్​లైన్​లోనే మార్చుకునే సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ తీసుకువచ్చింది.

ఇంతకు ముందు వరకు ఈపీఎఫ్ అకౌంట్​లోని వివరాలను మార్చుకునేందుకు, ఉద్యోగులు తమ యజమాని ఇచ్చిన జాయింట్ డిక్లరేషన్ ఫారంను నింపి, దానిని ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అలాంటి అవసరమేమీ లేకుండా, చాలా ఈజీగా ఆన్​లైన్​లోనే మీ పీఎఫ్ అకౌంట్​లోని వివరాలను మార్చుకోవచ్చు. ఇందుకోసం ఇటీవలే ఈపీఎఫ్ఓ 'స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)'ను విడుదల చేసింది. కనుక ఇప్పుడు ఈపీఎఫ్ చందాదారులు ఆన్​లైన్​లో తమకు చెందిన 11 వ్యక్తిగత వివరాలను మార్చుకోవచ్చు. అవేంటంటే?

11 EPF Parameters That You Can Change Through Online Mode :

  1. ఉద్యోగి పేరు
  2. లింగం (జెండర్​)
  3. పుట్టిన తేదీ
  4. తల్లి/ తండ్రి పేరు
  5. సంబంధం (రిలేషన్​షిప్)​
  6. వైవాహిక స్థితి
  7. జాయినింగ్ డేట్​
  8. రీజన్ ఫర్ క్విట్టింగ్
  9. డేట్ ఆఫ్ క్విట్టింగ్
  10. జాతీయత
  11. ఆధార్ నంబర్​

How To Change EPF Details Online : ఆన్​లైన్​లో మీ ఈపీఎఫ్ ఖాతాలోని వివరాలు మార్చుకునేందుకు ఈ కింది స్టెప్స్​ ఫాలో అవ్వండి.

  • ముందుగా EPFO అధికారిక​ పోర్టల్​ epfindia.gov.inను ఓపెన్ చేయాలి.
  • హోమ్​ పేజ్​లో కనిపించే services ట్యాబ్​పై క్లిక్‌ చేయాలి.
  • స్క్రోల్​ చేసి For Employees అనే ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • తరువాత Member UAN/ online Service ఆప్షన్​పై క్లిక్‌ చేయాలి.
  • అప్పుడు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN, పాస్​వర్డ్‌, క్యాప్చా వివరాలు ఎంటర్‌ చేసి లాగిన్ కావాలి.
  • అప్పుడు మీ ఈపీఎఫ్ అకౌంట్ పేజ్ ఓపెన్ అవుతుంది.
  • స్క్రీన్​పై కనిపించే Manage ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • అందులో joint declaration ఆప్షన్‌ కనిపిస్తుంది.
  • అక్కడ మీ మెంబర్‌ ఐడీని ఎంటర్‌ చేసి, మీరు అప్​డేట్‌ చేయాలనుకుంటున్న వివరాలను నమోదు చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ అప్​లోడ్‌ చేసి, సబ్మిట్ చేయాలి.
  • మీ రిక్వెస్ట్​ కనుక యాక్సెప్ట్ అయితే, ఆ వివరాలు యజమానికి చేరుతాయి.

ఎంప్లాయర్ చేయాల్సింది ఇదే!
ఈపీఎఫ్ చందాదారుడి అభ్యర్థనను స్వీకరించిన తర్వాత యజమాని (ఎంప్లాయర్​) ఈ కింది విధంగా చేయాల్సి ఉంటుంది.

  • యజమాని epfindia.gov.in పోర్టల్​లో తన ఎంప్లాయర్​ ఐడీని నమోదు చేయాలి.
  • మెంబర్ ట్యాబ్​పై క్లిక్ చేయాలి.
  • అక్కడ joint declaration change రిక్వెస్ట్ ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • యజమాని తమ రికార్డులను చెక్ చేసి ఉద్యోగి అభ్యర్థనను అంగీకరించవచ్చు లేదా తిరస్కరించొచ్చు.
  • ఒకవేళ యజమాని చందాదారుడి రిక్వెస్ట్​ను అంగీకరిస్తే, అది ఈపీఎఫ్ఓకు చేరుతుంది.
  • ఈ విధంగా మీ ఈపీఎఫ్ అకౌంట్​లోని వివరాలను చాలా సులువుగా ఆన్​లైన్​లోనే మార్చుకోవచ్చు.

RBI మన బంగారాన్ని విదేశాల్లో స్టోర్ చేస్తుంటుంది - ఎందుకో తెలుసా? - Indias Gold Reserves In Foreign

మీకు ఐటీ నోటీసులు వచ్చాయా? డోంట్ వర్రీ - అవి అసలైనవో, కాదో చెక్ చేసుకోండిలా! - How To Authenticate IT Notice

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.