ETV Bharat / business

రూ.8-14 లక్షల్లో బెస్ట్​ CNG కార్ కొనాలా? 25కి.మీ మైలేజ్ ఇచ్చే టాప్​ మోడల్స్​ ఇవే! - DIWALI BEST CNG CARS 2024

ఈ దీపావళికి కొత్త కారు కొనలనుకుంటున్నారా? ఎక్కువ మైలేజ్​ ఇచ్చే టాప్-5 సీఎన్​జీ​ కార్లు ఇవే!

Diwali Best CNG Cars 2024
Diwali Best CNG Cars 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2024, 4:04 PM IST

Diwali Best CNG Cars 2024 : ఈ దీపావళి సందర్భంగా కొత్త కారు మీ ఇంటికి తీసురావాలని ఆలోచిస్తున్నారా? ఏ కారు కొనాలో కచ్చితంగా తేల్చుకోలేకపోతున్నారా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. మారుతీ సుజుకీ, టాటా​ కంపెనీలు సీఎన్​సీ ఇంజిన్ ఆప్షన్​తో ఎక్కువ మైలేజ్​ ఇచ్చే కార్లను అందిస్తున్నాయి. బడ్జెట్​లో వస్తున్న హై మైలేజ్​ కార్ల లిస్ట్ మీకోసం. ​

1. మారుతీ సుజుకీ బ్రెజా (Maruti Suzuki Brezza) :
ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్​ కాంపాక్ట్​ ఎస్​యూవీల్లో మారుతీ సుజుకీ బ్రెజా ముందు వరుసలో ఉంటుంది. 1462 cc ఇంజిన్​తో వస్తున్న ఈ కారు, 86.63 bhp పవర్​ను ఉత్పత్తి చేస్తుంది. 198 mm గ్రౌండ్​ క్లియరెన్స్​తో ఆఫ్​రోడ్​లోనూ ఈ కారు దూసుకెళ్తుంది. సీఎన్​జీ వేరియంట్​లో వస్తున్న బ్రెజా, 25.51 km/kg మైలేజ్ ఇస్తుంది. ఎక్స్​ షో రూం ప్రకారం ఈ కారు ధర రూ.9.29 లక్షల నుంచి రూ.12.26 లక్షల వరకు ఉంటుంది.

2. మారుతీ సుజుకీ ఎర్టిగా (Maruti Suzuki Ertiga) :
బడ్జెట్​లో ఫ్యామిలీ కారు కావాలనుకుంటున్న వారికి మారుతీ సుజుకీ ఎర్టిగా మంచి ఆప్షన్. ఆటోమెటిక్ ట్రాన్స్​మిషన్​తో వస్తున్న ఈ 7 సీటర్​ కారులో 1462 cc ఇంజిన్ అమర్చారు. ఇది 101.64 bhp పవర్​ ఉత్పత్తి చేస్తుంది. ఎర్టిగా సీఎన్​జీ వేరియంట్​ కారు 20.3 km/kg మైలేజ్ ఇస్తుంది. ఇక ఈ కారు ధర(ఎక్స్​ షో రూం) రూ.9.29 లక్షల నుంచి రూ.12.26 లక్షల వరకు ఉంటుంది.

3. టాటా నెక్సాన్ (Tata Nexon ) :
ఈ కేటగిరీలో మరో పాపులర్​ మోడల్​ టాటా నెక్సాన్​. 1497 cc ఇంజిన్​తో వస్తున్న ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ కారు, 750 rpmలో 113.31 bhp పవర్ ఉత్పత్రి చేస్తుంది. 208 mm గ్రౌండ్​ క్లియరెన్స్​ ఉన్న టాటా నెక్సాన్ ఆఫ్​ రోడ్​లో కూడా దూసుకెళ్తుంది. ఐదుగురు కంఫర్ట్​గా ఈ కారులో ప్రయాణం చేయొచ్చు. ఈ మోడల్​ సీఎన్​జీ వేరియంట్​ 24.08 km/kg మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ధర(ఎక్స్​ షో రూం) రూ. 8.99 లక్షల నుంచి రూ.14.59 లక్షల వరకు ఉంటుంది.

4. మారుతీ సుజుకీ బలేనో (Maruti Suzuki Baleno) :
మారుతీ సుజుకీ టాప్​ సెల్లర్​లలో ఆ కంపెనీ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్​బ్యాక్ బలెనో ఒకటి. స్టైలిష్​ లుక్స్​తో వస్తున్న ఈ కారులో 1197 cc సామర్థ్యం ఉన్న ఇంజిన్ అమర్చారు. ఇది 76.43 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇది హైవే డ్రైవింగ్​తో పాటు సిటీలోనూ మంచి మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ధర(ఎక్స్​ షో రూం) రూ.8.40 లక్షల నుంచి రూ. 9.33 లక్షల వరకు ఉంటుంది.

5. మారుతీ సుజుకీ స్విఫ్ట్​ (Maruti Suzuki Swift) :
మారుతీ సుజుకీ అందిస్తున్న మరో పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ స్విఫ్ట్. ఆటోమెటిక్ ట్రాన్స్​మిషన్​తో ఐదుగురు సులభంగా ప్రయాణించగల ఈ కారు 1197cc ఇంజిన్​ సామర్థ్యంతో వస్తోంది. 80.46 bhp పవర్​ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు సీఎన్​జీ వేరియంట్​ 25.75 km/kg మైలేజ్​ ఇస్తుంది. ఈ కారు ధర (ఎక్స్​ షో రూం) రూ.8.20 లక్షల నుంచి రూ.9.20 లక్షల వరకు ఉంటుంది.

దీపావళికి కారు కొనాలా? ఆ మోడల్​పై రూ.2.30 లక్షలు డిస్కౌంట్​- మిగిలిన వాటిపై ఎంతంటే?

రూ.10 లక్షల్లోపు మంచి SUV కార్​ కొనాలా? త్వరలో లాంఛ్​ కానున్న బెస్ట్​-4 మోడల్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.