ETV Bharat / business

డీమ్యాట్ అకౌంట్స్​ సరికొత్త రికార్డ్‌ - మొత్తం 15+ కోట్లు - Demat Accounts Cross 15 Crore - DEMAT ACCOUNTS CROSS 15 CRORE

Demat Accounts In India Cross 15 Crore : దేశంలో తొలిసారి డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 15 కోట్లు దాటి కొత్త మైలురాయిని చేరుకున్నాయి. మార్కెట్‌లో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఆసక్తి చూపడంతో రికార్డు స్థాయిలో కొత్త డీమ్యాట్‌ ఖాతాలు ఓపెన్ అయ్యాయి.

Total Demat Accounts in India
Demat Accounts In India Cross 15 Crore
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 5:30 PM IST

Demat Accounts In India Cross 15 Crore : దేశంలో డీమ్యాట్‌ ఖాతాలు 15 కోట్లు దాటి, కొత్త మైలురాయిని చేరుకున్నాయి. మార్కెట్‌లో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఆసక్తి చూపుతుండడమే ఇందుకు కారణం.

సగటున 30 లక్షల ఖాతాలు!
గత 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 3.70 కోట్ల కొత్త డీమ్యాట్‌ ఖాతాలు ఓపెన్‌ అయ్యాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి మంచి రాబడులు వస్తుండటంతో ప్రతి నెలా సగటున 30 లక్షలకు పైగా కొత్త డీమ్యాట్‌ ఖాతాలు ఓపెన్ అవ్వడం గమనార్హం.

మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయ్​!
Demat account openings in FY24 : భారతీయ పెట్టుబడిదారులు 2021 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.4 కోట్ల కొత్త డీమ్యాట్‌ ఖాతాలు తెరిచారు. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ (Morgan Stanley) దేశీయ మార్కెట్‌పై పెంచిన అంచనాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత్‌ మార్కెట్‌పై చూపుతున్న ఆసక్తి, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెరగడం - ఇలా పలు కారణాలతో డీమ్యాట్‌ ఖాతాలు విపరీతంగా పెరిగాయి. దీనితో 2024 ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య ఏకంగా 3.7 కోట్లకు చేరింది. అంతకుముందటి (2023) ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వీటి సంఖ్య 32 శాతం అధికం కావడం గమనార్హం.

2023 మార్చిలో మార్కెట్లు నష్టాల్లోకి పోయాయి. ఇదే సరైన అవకాశంగా భావించిన రిటైల్‌ పెట్టుబడిదారులు భారీగా సంఖ్యలో ఈక్విటీ షేర్లు కొనుగోలు చేశారు. దీనితో దేశీయ స్టాక్​ మార్కెట్లు తిరిగి పుంజుకోవడం ప్రారంభించాయి. వీటితో పాటు ఐపీఓలు కూడా పెరగడం ప్రారంభమైంది. ఇవన్నీ కొత్త డీమ్యాట్ ఖాతాలు పెరగడానికి తోడ్పడింది. గత ఆర్థిక సంవత్సరంలో ఐపీఓల ద్వారా 76 కంపెనీలు ఏకంగా రూ.61,921 కోట్లు సమీకరించాయి. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు రికార్డు గరిష్ఠాలకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ 50 ఏకంగా 29శాతం లాభపడింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఏకంగా 70 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 అనేది 60 శాతం చొప్పున లాభపడ్డాయి.

రూ.100 ఉంటే చాలు - రియల్ ఎస్టేట్​లో ఇన్వెస్ట్ చేయవచ్చు - ఎలా అంటే? - How To Invest In REITs

బెస్ట్​ సన్​రూఫ్ కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్​-5 మోడల్స్ ఇవే! - Best Sunroof Cars Under 10 Lakh

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.