Cryptocurrency Investment Tips For Beginners : ప్రస్తుత కాలంలో చాలా మంది క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ చేస్తున్నారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారంగా నగదు బదీలీలు మరింత పారదర్శకంగా, సమర్థవంతగా జరిగేందుకు ఈ క్రిప్టోకరెన్సీ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తున్న మదుపర్లకు మొదట్లో కొంత ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. అయితే కొత్తగా పెట్టుబడి పెట్టేవారు కొన్ని సార్లు నష్టపోయే అవకాశం ఉంది. అందుకే క్రిప్టోకరెన్సీలు ఎలా పనిచేస్తాయి? క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేసేముందు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
క్రిప్టో కరెన్సీ ఏవిధంగా పనిచేస్తుంది?
Cryptocurrency Technology : అన్ని క్రిప్టోకరెన్సీలు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగానే పనిచేస్తాయి. ఇవి డిజిటల్ లెడ్జర్గా సేవలందిస్తాయి. ఇందులో జరిగే ప్రతి లావాదేవీపై యజమాని అథెంటికేషన్ ఉంటుంది. క్రిప్టోకరెన్సీ సిస్టమ్ రెండు పార్టీల మధ్య జరిగిన లావాదేవీలను రికార్ట్ చేసి స్టోర్ చేస్తుంది. వీటిలో క్రిప్టో కరెన్సీలు పీర్-టు-పీర్ నెట్‌వర్క్‌లుగా పనిచేస్తాయి. ఈ క్రిప్టోకరెన్సీ సిస్టమ్‌లో ఎలాంటి మధ్యవర్తులు కానీ, బ్యాంకులు, నియంత్రణ సంస్థలు గానీ ఉండవు. క్రిప్టోకరెన్సీ ద్వారా మీరు నేరుగా ఇతర పార్టీలకు చెల్లింపులు చేయవచ్చు. మీరు చెల్లింపు చేసిన వారు అంగీకరిస్తేనే ఆ లావాదేవీ పూర్తవుతుంది.
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి సూచనలు
How To Invest In Cryptocurrency A Beginner's Guide :
- ప్రాథమిక అంశాలపై అవగాహన తప్పనిసరి : క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలనుకునేముందు ఈ సిస్టమ్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై తప్పనిసరిగా పట్టుసంపాదించాలి. క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చైన్ టెక్నాలజీ గురించి ఎక్కువగా తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. క్రిప్టోకరెన్సీ మార్కెట్ ఏవిధంగా పనిచేస్తుంది అనే విషయంపైనా అవగాహన ఏర్పరుచుకోవాలి. అప్పుడే మీరు సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది.
- చిన్నమొత్తాలనే ఇన్వెస్ట్ చేయండి : క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టడం అనేది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కనుక చిన్నచిన్నమొత్తాలను మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే నష్టాలు వచ్చినా తట్టుకోగలుగుతాము. క్రిప్టోకరెన్సీ మార్కెట్లు ఎల్లప్పుడూ ఒడుదొడుకులకు గురవుతూ ఉంటాయి. అందువల్ల కొత్తవారు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి.
- పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ : మీ పెట్టుబడులు అంతటినీ క్రిప్టోకరెన్సీపైనే పెట్టబడి పెట్టేబదులు, విభిన్న పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ డైవర్సిఫికేషన్ అనేది మీకు లాభాలను తెచ్చిపెట్టడంలోనూ, నష్టాలను తగ్గించడంలోను చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
- ప్రముఖ ఎక్స్ఛేంజిలనే ఎంచుకోండి : క్రిప్టోకరెన్సీ కొనుగోలు, అమ్మకాల కోసం మార్కెట్లో మంచి పేరున్న ఎక్స్ఛేంజీలనే ఎంచుకోవడం ఉత్తమం. సురక్షితమైన, పారదర్శకమైన ఫీజులు ఉండే ప్లాట్‌ఫామ్‌లనే ఎంచుకోవాలి. నిపుణుల సూచనలు తీసుకోవాలి.
- ఇన్వెస్ట్మెంట్ల పరిరక్షణ : ఆఫ్‌లైన్ స్టోరేజ్ పద్ధతులు, హార్డ్‌వేర్ వాలెట్లు ఉపయోగించి మీ క్రిప్టోకరెన్సీని పరిరక్షించుకోవాలి. పాస్వర్డ్ సెక్యూరిటీ కోసం టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను రూపొందించుకోవాలి.
- అప్డేట్గా ఉండండి : మార్కెట్ ట్రెండ్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. క్రిప్టోకరెన్సీకి సంబంధించి వార్తలను చదువుతూ ఉండాలి. మీ పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి.
- దీర్ఘకాల పెట్టుబడులకే ప్రాధాన్యం : క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల విషయంలో లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వైఖరిని అవలంభించాలి. స్వల్పకాలంలోని మార్కెట్ ఒడుదొడుకులను పరిగణనలోకి తీసుకోవద్దు.
200 కోట్ల డాలర్లు విలువైన షేర్లు అమ్మేసిన అమెజాన్ బాస్
ఈ 5 రిస్కీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? 'ఇన్కమ్ టాక్స్ నోటీసులు' రావడం గ్యారెంటీ!