ETV Bharat / business

395 రోజుల వ్యాలిడిటీతో BSNL సరికొత్త ప్లాన్‌ - ధర, ప్రయోజనాలివే! - BSNL 395 Days Plan

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 12:55 PM IST

BSNL 395 Days Plan : బీఎస్​ఎన్​ఎల్​ 13 నెలల వ్యాలిడిటీతో సరికొత్త పాన్​ను లాంఛ్ చేసింది. జియో, ఎయిర్​టెల్​ మొదలైన ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ టారిఫ్‌లు పెంచిన నేపథ్యంలో, యూజర్లను ఆకర్షించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. దీని ధర, ప్రయోజనాలు ఎలా ఉన్నాయంటే?

BSNL introduces new 395-day plan
BSNL 395 Days Plan (ANI)

BSNL 395 Days Plan : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) కస్టమర్లను ఆకర్షించేందుకు 395 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్​ను తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైన బీఎస్ఎన్​ఎల్​, కొత్త యూజర్లను ఆకర్షించేందుకే ఈ 13 నెలల ప్లాన్​ను లాంఛ్ చేసింది.

జియో, ఎయిర్​టెల్ మొదలైన ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్​లను పెంచిన నేపథ్యంలో, చాలా మంది యూజర్లు ఇప్పుడు బీఎస్​ఎన్​ఎల్​ ప్లాన్లపై దృష్టి సారిస్తున్నారు. దీనినే ఆసరాగా చేసుకుని, తాజాగా 395 రోజుల వ్యాలిడిటీ ప్లాన్​ను బీఎస్​ఎన్​ఎల్ తీసుకువచ్చింది. మరెందుకు ఆలస్యం ఈ ప్లాన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

BSNL 395 Days Plan Benefits :

  • వ్యాలిడిటీ - 395 రోజులు
  • డేటా - రోజుకు 2జీబీ
  • ఎస్​ఎంఎస్​లు - రోజుకు 100
  • అపరిమిత కాలింగ్‌
  • దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్‌
  • జింగ్‌ మ్యూజిక్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌
  • హర్డీ గేమ్స్‌, ఛాలెంజర్‌ అరీనా గేమ్స్‌, గేమ్‌ఆన్‌ ఆస్ట్రోటెల్‌
  • ప్లాన్‌ ధర రూ.2,399

BSNL 365 Days Plan Benefits
బీఎస్​ఎన్​ఎల్​ 365 రోజుల (ఒక సంవత్సరం) వ్యాలిడిటీతో మరొక ప్లాన్​ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా రోజువారీ పరిమితి లేకుండా 600 జీబీ డేటాను అందిస్తోంది. రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు ఉంటాయి. అపరిమిత కాలింగ్‌ సౌలభ్యం ఉంటుంది. ఈ ప్లాన్​లోనూ జింగ్‌ మ్యూజిక్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌, హర్డీ గేమ్స్‌, ఛాలెంజర్‌ అరీనా గేమ్స్‌, గేమ్‌ఆన్‌ ఆస్ట్రోటెల్‌ వంటి అదనపు ప్రయోజనాలు ఉంటాయి.

రిలయన్స్​ జియో తమ మొబైల్‌ సేవల టారిఫ్‌లను 12-27 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంచిన రేట్లు జులై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. దీనితో జియో బాటలోనే భారతీ ఎయిర్‌టెల్‌ తమ మొబైల్ సేవల టారిఫ్‌లను 10-21 శాతం వరకు పెంచింది. వొడాఫోన్‌ ఐడియా కూడా తమ మొబైల్‌ టారిఫ్‌లను జులై 4 నుంచి 11-24 శాతం వరకు పెంచింది. ఈ నేపథ్యంలోనే పలువురు యూజర్లు తక్కువ ధరకే మంచి బెనిఫిట్స్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం చూస్తున్నారు. అందుకే ఇలాంటి వారిని ఆకర్షించేందుకు బీఎస్​ఎన్​ఎల్​ కొత్తగా 395 రోజుల వ్యాలిడిటీ ప్లాన్​ను తీసుకువచ్చింది.

SBI షాకింగ్ న్యూస్​​ - సడెన్​గా వడ్డీ రేట్లు పెంపు - ఇకపై మరింత ప్రియంకానున్న లోన్స్! - SBI Raises Lending Rates

జొమాటో & స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ ఫీజులు పెంపు - హైదరాబాద్​లో ఎంతంటే? - Zomato Swiggy Raise Platform Fee

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.