Bike Maintenance Tips In Telugu : ఓ రైడర్ బైక్‌ను ఎప్పుడూ తన ప్రాణంలా చూసుకుంటాడు. అది ఎప్పుడు తళతళ మెరవాలని దాని కోసం పడే శ్రమ అంతా ఇంతా కాదు. మొదట బైక్‌ను కొన్నప్పుడు ఎలా ఉందో దానిని ఎన్ని రోజులు అయినా సరే అలానే ఉంచడానికి ప్రయత్నిస్తాడు. బైక్‌ను రోజూ ఎలా శుభ్రం చేసుకోవాలని దానిపై చేసే కసరత్తులు చెప్పక్కర్లేదు. బైక్‌ను కడగడం లేదా శుభ్రపరచడం అనేది బైక్ మెయింటెనెన్స్‌లో పరిగణించే మొదటి స్టేజీ. కార్బోరేటర్‌ను శుభ్రపరచడం, టైర్లలో సరైన ప్రెజర్‌ను మెయింటెయిన్ చేయడం లాంటివి కూడా ముఖ్యమైనవే. ఈ నేపథ్యంలో బైక్‌ను కడగడానికి వర్తించే కొన్ని ప్రత్యేక పద్ధతులు, ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి ఫాలో అయితే మీరు బెస్ట్ రిజల్ట్స్ పొందవచ్చు. మరి ఆ టిప్స్ మీకోసం.
బైక్ మెయింటెనెన్స్ అంత కష్టమా?
బైక్ ఏదైనా కావచ్చు, బైక్‌ను వాష్ చేసే పద్ధతులు, విధానాలు ఫోర్-వీలర్‌ను కడిగే దానికంటే పూర్తి డిఫరెంట్‌గా ఉంటాయి. కారుతో పోలిస్తే బైక్‌లో కొన్ని కీలక పార్ట్స్ ఉంటాయి. వాటి 'ఓపెన్-టు-ఎన్విరాన్‌మెంట్' స్వభావం కారణంగా బైక్ మెయింటెనెన్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓ విధంగా చెప్పాలంటే వివిధ ప్లాస్టిక్ ఫైబర్, మెటల్, రబ్బరు, క్రోమ్, పెయింట్ యూజ్, క్వాలిటీ, లేఅవుట్ లాంటివి కారులో పూర్తి భిన్నంగా ఉంటాయి. అలాగే ఒక బైక్‌లో వివిధ పరికరాలు ఉంటాయి. అవి అందుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.
వాషింగ్ కిట్!
తదుపరి స్టేజీ ఏమిటంటే- మీ బైక్‌ను కడగడానికి అవసరమైన అన్ని వస్తువులను మీరు సిద్ధంగా ఉంచుకోవాలి. వీటిల్లో బైక్ భాగాలను తుడవడం, ఎండబెట్టడం, పాలిష్ చేయడం కోసం శుభ్రమైన, మృదువైన పొడి బట్టలను మాత్రమే ముక్కలుగా చేసి తీసి ఉంచుకోవాలి. వీల్ క్లీనర్ సాల్వెంట్, తుప్పు పట్టే అవకాశాలను నివారించడానికి ఉపయోగపడుతుంది. సీటు ఫాబ్రిక్ కోసం లెదర్ సాల్వెంట్ లేదా లెదర్ లేదా ఫాబ్రిక్ను ఉపయోగించడానికి ఏదైనా భాగాన్ని ఉంచుకోవాలి. శుభ్రంగా, పొడిగా, మంచి పరిమాణంలో ఉన్న స్పాంజ్ ముక్కలను వాడాలి. బైక్‌ను క్లీన్ చేసే సాల్వెంట్. సాల్వెంట్ అంటే సబ్బు లేదా డిటర్జెంట్ సాల్వెంట్ ఏదైనా కావచ్చు. దీంతో పాటు వీటినీ పాటించండి.
- వాషింగ్ చేసేటప్పుడు మీ చేతులకు హ్యాండ్ గ్లోవ్స్‌ను వాడండి. ఇవి మీ చేతులు మురికిగా మారకుండా అడ్డుకుంటాయి.
- గ్రీజు, ఆయిల్ క్లీనర్లను వాడండి.
- వీల్స్‌ను శుభ్రపరిచే బ్రష్‌ను వాడండి.
- క్లీన్ చేయడం కోసం ప్రత్యేకంగా ఒక బకెట్‌ను ఉంచుకోండి.
రెండు బకెట్లను ఉపయోగించడం!
రెండు బకెట్లను ఉంచుకోవడం ద్వారా మీ బైక్ వాషింగ్ ప్రక్రియ మరింత ఈజీగా అవుతుంది. మొదటి బకెట్‌ను మీరు శుభ్రపరిచే సాల్వెంట్ లేదా లిక్విడ్స్‌ను వేయడానికి వాడండి. రెండో దాంట్లో మీరు కొంత మంచినీటిని మాత్రమే నింపుకోవడానికి ఉంచుకోవాలి.
క్లీనింగ్ ప్రాసెస్!
ప్రీ-వాష్ చేయడం- మీ బైక్‌ను షాంపూ లేదా క్లీనింగ్ ఏజెంట్/సాల్వెంట్‌తో శుభ్రం చేసే ముందు, మురికి, దుమ్మును ప్రాథమిక పద్ధతిలో తొలగించండి. ఇందుకోసం కొంచెం మంచినీటిని వాడవచ్చు.
వీల్స్- ఇతర వాహనాల వీల్స్‌తో పోలిస్తే బైక్ వీల్స్ శుభ్రం చేయడం కొంచెం శ్రమతో కూడుకున్న పని. దీనికోసం ముందుగా వీల్ క్లీనర్ సాల్వెంట్‌ను బయటకు తీసి, నాజిల్‌ను ప్రెస్ చేయాలి. తద్వారా సాల్వెంట్ స్ప్రెడ్ పద్ధతిలో బయటికి వస్తుంది. ఆపై ఇప్పటికే నీటితో కడిగిన వీల్స్‌పై ఈ సాల్వెంట్‌ను కోటింగ్ లాగా వేయాలి.
ఎగ్జాస్ట్- మీరు బైక్‌ను కడిగేటప్పుడు ఎగ్జాస్ట్ అనేది అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటి అని గుర్తుంచుకోవాలి. ఎగ్జాస్ట్‌లపై అసలు షైనింగ్‌ను తిరిగి తీసుకురావడానికి బైక్ క్లీనింగ్ సాల్వెంట్‌లను ఉపయోగించడం ఉత్తమ మార్గం.
చైన్- బైక్ చైన్‌లో మట్టి పేరుకుపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పటికే ఆయిల్/గ్రీజుతో ఉండడం వలన మురికిని ఇట్టే ఆకర్షిస్తుంది. అయితే జాగ్రత్తగా దీనిని శుభ్రం చేయాల్సి ఉంటుంది(How To Keep Bike Chain Clean).
షాంపూతో కడగండి- బైక్ బాడీ ప్యానెల్‌నూ శుభ్రపరచడం చాలా అవసరం. ఎందుకంటే మీ బైక్ మొత్తంలో హైలైట్ పార్ట్ ఇదే. బాడీపై పడ్డ దుమ్మును పూర్తిగా తొలగించాలి. తద్వారా సూర్యుని నుంచి వచ్చే కాంతి దానిపై పడినప్పుడు మెరుస్తుంది.
డ్రయింగ్
ఇక బైక్ వాషింగ్ ప్రాసెస్‌లో చిట్టచివరిగా చెప్పుకునే అంశం డ్రయింగ్. మీరు మీ బైక్‌ను కడగడం పూర్తి చేసిన తర్వాత దానిని ఆరబెట్టాలి. లేదంటే మిగిలి ఉన్న వాటర్‌మార్క్స్ మీ బైక్‌కు కావలసిన షైనింగ్‌ను ఇవ్వకపోవచ్చు. వీటిని తుడిచి వేయడానికి శుభ్రమైన, పొడి వస్త్రాన్ని ఉపయోగించాలి.
ఆ ఎక్స్ యూజర్స్‌కు ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్- ప్రీమియం ఫీచర్లన్నీ ఫ్రీ! - elon musk