Bike Maintenance Tips In Telugu : ప్రస్తుత రోజుల్లో ఆఫీసుకు, ప్రయాణాలకు, సరదాగా బయటకు వెళ్లేందుకు, ఇలా ప్రతి దానికీ బైక్‌లనే వినియోగిస్తున్నాం. అయితే బైక్ కండిషన్ మంచిగా ఉంటేనే, ఎక్కువ కాలం రిపేర్లు రాకుండా ఉంటాయి. రెగ్యులర్‌గా బైక్ నిర్వహణ (మెయింటెనెన్స్) చూసుకుంటూ ఉంటే వాహనం పనితీరు బాగుంటుంది. అలానే ఎక్కువ కాలం వాడుకోవడానికి వీలవుతుంది. ఆకస్మత్తుగా బ్రేక్డౌన్లు లాంటివి వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. కొన్ని చిట్కాల వల్ల బైక్‌లను పనితీరు మెరుగుపరుచుకోవచ్చు. అలాగే వాటి లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా?
- ఇంజిన్ ఆయిల్ మార్చటం
Change Engine Oil : ఇంజిన్ ఆయిల్ అనేది మన బైక్ ఇంజిన్ ఎక్కువ కాలం పని చేసేలా చూస్తుంది. ఇంజిన్ వెడెక్కకుండా చల్లగా ఉండేలా చేస్తుంది. కల్తీ ఇంజిన్ ఆయిల్ లాంటివి వాడినప్పుడు, ఇంజిన్ సామర్ధ్యం తగ్గుతుంది. అందుకే రెగ్యులర్‌గా ఆయిల్ లెవల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అవసరమైతే ఇంజిన్ ఆయిల్‌ను మార్చుకోవాలి. - టైర్లను చెక్ చేసుకోవటం
Inspect The Tyres Regularly : అరిగిపోయిన టైర్లతో వాహనాన్ని నడుపకూడదు. ఒకవేళ అలానే నడుపుతుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు టైర్లను తనిఖీ చేసుకుంటూ అవసరమైనప్పుడు వాటిని మార్చుకోవాలి. అలానే టైర్లలో సరిగా గాలి ఉందా? లేదా? అనేది తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి. టైర్లు మంచిగా ఉంటే ప్రయాణం కూడా సురక్షితంగా సాగతుంది. - ఎయిర్ ఫిల్టర్లను శుభ్రం చేసుకోవాలి
Keep Air Filters Clean : బైక్ ఎయిర్ ఫిల్టర్లను ఎప్పుటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఎందుకుంటే దుమ్ము, ధూళి ఫిల్లర్లో పేరుకుపోతే, ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ఎయిర్ ఫిల్లర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం, అవసరమైతే వాటిని మార్చేయాలి. - బ్రేక్
Pay Attention To The Brakes : ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చేసేవి బ్రేక్స్. అవి మరీ గట్టిగా లేదా మరీ లూజ్‌గా ఉండకూడదు. బ్రేక్ ప్యాడ్లు కాలక్రమేణా అరిగిపోతుంటాయి. వాటిని మార్చటం అవసరం. అలానే బ్రేక్ వేసేటప్పడు సౌండ్ ఏమైనా వస్తే, వెంటేనే వాటిని మార్చాలి. అలానే బ్రేక్స్ సరిగ్గా పనిచేసేందుకు ఆయిల్ వేస్తూ ఉండాలి. - బైక్ మాన్యువల్ చదవాలి
Do Not Ignore The Bike Manual : వాహనాలను కొనేటప్పుడు మ్యానువల్ ఇస్తారు. దానిని చాలా మంది చదవకుండా పక్కన పడేస్తారు. దానిలో వాహనానికి సంబంధించిన ప్రతి భాగం గురించి వివరాలు ఉంటాయి. అలానే వాటి నిర్వహణ గురించి, అలానే ఎలాంటి ఆయిల్‌ను ఉపయోగించాలి? టైర్ల సంరక్షణ గురించి ఏం చేయాలి? ఇలా ప్రతి విషయాన్ని గురించి సమాచారం ఉంటుంది. కానీ చాలా మంది దానిని చదవకుండా పక్కన పడేస్తుంటారు. కానీ ఇది సరికాదు. కచ్చితంగా మాన్యువల్‌ను చదవాలి. - క్లచ్ అడ్జస్ట్మెంట్
Clutch Adjustment Is Important : టైర్ల లాగానే వివిధ బైక్‌లలో క్లచ్ అడ్జస్ట్మెంట్ కూడా భిన్నంగా ఉంటుంది. గేర్లను మార్చటం కోసం క్లచ్ని ఉపయోగిస్తుంటాం. ఒకవేళ క్లచ్ గట్టిగా లేదా వదులుగా ఉంటే గేర్లను మార్చేటప్పుడు సమస్యలు వస్తాయి. దాని వల్ల వాహనానికి డ్యామేజ్ కావచ్చు. కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా దారితీయవచ్చు. బైక్ ఇంజిన్ సామర్థ్యం మంచిగా ఉన్నప్పటికీ, క్లచ్ సరిగ్గా లేకపోతే, బైక్ ఫ్యూయెల్ ఎఫీషియన్సీ తగ్గే అవకాశం ఉంటుంది. - వాహనాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి
Keep It Clean : క్రమం తప్పకుండా వాహనాన్ని శుభ్రం చేసుకోవటం వల్ల వాటి పని తీరు బాగుంటుంది. అలానే ఎక్కవకాలం ఉండేలా చేస్తుంది. మాన్యువల్‌లో ఇచ్చిన ప్రకారం బైక్‌లను క్లీన్ చేసుకోవాలి. స్విఛ్ యూనిట్, సైలెన్సర్‌ను కూడా శుభ్రం చేసుకోవాలి. బైక్‌ను ఉపయోగించనప్పుడు దానిని కవర్ లైదా ఏదైనా వస్త్రంతో కప్పి ఉంచటం మంచిది. - బ్యాటరీ నిర్వహణ తప్పనిసరి
Battery Maintenance Is Essential : ఎలక్ట్రిక్ బైక్‌ల విషయంలో బ్యాటరీ మెయింటెనెన్స్ చాలా ముఖ్యం. బ్యాటరీ మంచిగా లేకపోతే సమస్యలు వస్తాయి. హైడ్లైట్లు, హార్న్, ఇండికేటర్స్ పనిచేయకపోవడానికి దారితీస్తుంది. అందుకే వైర్లు అన్నీ సరిగ్గా బ్యాటరీకి కనెక్ట్ అయ్యి ఉన్నాయా? లేదా? అనేది క్రమం తప్పకుండా చూసుకోవాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ముందుగానే బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్‌లో ఉందా? లేదా? అనేది చూడాలి. కొంత కాలం పాటు వాహనాన్ని ఉపయోగించకుండా ఉంటే, కచ్చితంగా బ్యాటరీని డిస్కనెక్ట్ చేయటం మంచిది. - రైడింగ్ స్పీడ్
Be A Responsible Rider : ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్‌తో, రోడ్లపై విన్యాసాలు చేయటం లాంటి వాటి వల్ల ప్రమాదాలు జరుగుతాయి. దీనివల్ల బైక్ పాడైపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే ట్రాఫిక్ నియమాలను అనుసరించటం, నిబంధనల ప్రకారం, స్పీడ్ లిమిట్ దాటకుండా డ్రైవ్ చేయడం మంచిది. - Keep The Transmission System Healthy : బైక్ గొలుసును క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. అందుకోసం నీటిని వినియోగించకూడదు. బ్రష్ ఉపయోగించి, చైన్‌ను క్లీన్ చేయాలి. తరువాత చైన్‌కు ఇంజిన్ ఆయిల్ పూయాలి.
త్వరలో మార్కెట్లోకి రానున్న బెస్ట్ ఈవీ స్కూటర్స్ ఇవే!
మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్-10 ఆప్షన్స్ ఇవే!