Bharat Mobility Global Expo 2024 : దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 సూపర్ హిట్ అయ్యింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం, పరిశ్రమ అభివృద్ధి కోసం దీనిని నిర్వహించడం జరిగింది.
భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రయాణికుల వాహన మార్కెట్‌గా, రెండో అతిపెద్ద టూ-వీలర్ మార్కెట్‌గా ఉంది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ హబ్‌గా మారడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
సూపర్ కార్స్
ఈ మెగా ఈవెంట్లో మారుతి సుజుకి, టాటా, మహీంద్రా, హ్యూందాయ్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ సహా పలు ఆటోమొబైల్ కంపెనీలు పాల్గొన్నాయి. తమ లేటెస్ట్, అప్‌కమింగ్ వెహికల్స్‌ను ప్రదర్శించాయి.
- Tata Upcoming Cars : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ - టాటా సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్, నెక్సాన్ ఈవీ డార్క్, టాటా నెక్సాన్ సీఎన్జీ, టాటా ఆల్ట్రోజ్ రేసర్, టాటా కర్వ్, హారియర్ ఈవీ కార్లను ప్రదర్శించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- Maruti Suzuki Upcoming Cars : మారుతి సుజుకి ఈ ఎక్స్‌పోలో తమ అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ కార్ eVX, ఫ్లెక్స్ ప్యూయెల్ వ్యాగన్-ఆర్, స్ట్రాంగ్ హైబ్రిడ్ విటారా, జిమ్నీ, స్కైడ్రైవ్ ఈ-ఫ్లయింగ్ కార్ మోడల్స్‌ను ప్రదర్శించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- Toyota Upcoming Cars : టయోటా ఈ ఎక్స్‌పోలో తమ అప్‌కమింగ్ ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్, మిరాయ్, హైరైడర్ సీఎన్జీ కార్లను ప్రదర్శించింది.
- Mahindra Upcoming Cars : దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా ఈ ఎక్స్‌పోలో XUV 700, స్కార్పియో ఎన్, ఆల్ న్యూ థార్, XUV 400 EL ప్రో, సుప్రో ప్రాఫిట్ ట్రక్ ఎక్సెల్; ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే, ట్రియో ప్లస్, జోర్ గ్రాండ్లను డిస్ప్లే చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- Bharat Mobility Global Expo Cars : ఈ భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో మెర్సిడెస్ బెంజ్ కంపెనీ EQG కారును, స్కోడా - ఎన్యాక్ ఐవీ, హ్యుందాయ్ - Nexo కార్లను ప్రదర్శించాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బెస్ట్ బైక్స్
Bharat Mobility Global Expo Two Wheelers : బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, హీరో మోటోకార్ప్, హోండా, రాయల్ ఎన్ఫీల్డ్, ఏథర్, యమహా, టోర్క్ మోటార్స్ లాంటి పలు టూ-వీలర్ తయారీ కంపెనీలు కూడా ఈ మెగా ఈవెంట్లో పాల్గొన్నాయి. తమ లేటెస్ట్ బైక్స్‌ను ప్రదర్శించాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వాణిజ్య వాహనాలు
అశోక్ లేలాండ్, వోల్వో లాంటి వాణిజ్య వాహన తయారీ కంపెనీలు కూడా తమ లేటెస్ట్, అప్‌కమింగ్ వెహికల్స్‌ను ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించాయి. ఈ ఎక్స్‌పోలో పలు స్టార్టప్‌లు, టెక్నాలజీ కంపెనీలు కూడా పాల్గొన్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వాణిజ్యం, పరిశ్రమలు, రోడ్డు రవాణా, పెట్రోలియం, సహజ వాయువు, విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖలు సహా వివిధ ప్రభుత్వ శాఖల మద్దతులో ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 నిర్వహించారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చురర్స్ (SIAM), ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చురర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ACMA), నాస్కామ్ (NASSCOM)లు కలిసి ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 నిర్వహించాయి.
త్వరలో మార్కెట్లోకి రానున్న బెస్ట్ ఈవీ స్కూటర్స్ ఇవే!
ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్ - KYC గడువు పెంపు - కొత్త తేదీ ఇదే!