ETV Bharat / business

BH సిరీస్ వాహనదారులకు బిగ్​ షాక్ - 14 ఏళ్ల ట్యాక్స్​ను ఒకేసారి కట్టాలట! - BH Number Plate Vehicle Rules

BH Number Plate Vehicle Tax : భారత్​ సిరీస్ నంబర్ ప్లేట్ కలిగిన వాహనదారులకు కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. 14 ఏళ్ల పన్నును కేంద్ర రవాణా శాఖకు ఒకేసారి కట్టేందుకు సిద్ధం కావాలి. 'బీహెచ్' నంబర్ కొనసాగించాలంటే 60 రోజుల్లోగా సింగిల్ పేమెంట్‌ను పూర్తి చేయాలి.

BH Number Plate Vehicle Tax
BH Number Plate Vehicle Tax (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 1:28 PM IST

BH Number Plate Vehicle Tax : 'భారత్' సిరీస్(BH) నంబర్ ప్లేటు కలిగిన వాహనదారులకు బిగ్ అలర్ట్. వారంతా రానున్న 14 ఏళ్ల వాహన పన్నును ఒకేసారి ముందస్తుగా చెల్లించాలి. ఇంతకుముందు రెండేళ్లకోసారి ఈ పన్నును చెల్లించే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో 14 ఏళ్లకోసారి ఏకమొత్తంలో పన్నును కట్టేయాలనే నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు.

బీహెచ్ నంబర్ ప్లేట్లతో 731 వాహనాలు
2021 సంవత్సరం నుంచి కేంద్ర రవాణా శాఖ 'బీహెచ్' నంబర్ ప్లేట్లను జారీ చేస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నడుమ నిత్యం రాకపోకలు సాగించే వ్యాపారులు, ఉద్యోగులు, నిపుణులు, రాజకీయ నాయకుల సౌకర్యం కోసం ఈ నంబర్ ప్లేట్లను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ఇలాంటి వారికి వివిధ రాష్ట్రాల ఆర్టీఓ కార్యాలయాల్లో ప్రత్యేక అనుమతులను పొందాల్సిన తిప్పలు తప్పాయి. ఎంతో సమయం, ధనం ఆదా అయింది. దేశంలోని ఒకటి మించిన రాష్ట్రాల్లో తిరిగే వాహనాలపై జాతీయ స్థాయిలో ఒక డేటాబేస్ తయారైంది. ప్రస్తుతం మన దేశంలో బీహెచ్ నంబర్ ప్లేటు కలిగిన 731 వాహనాలు ఉన్నాయని అంచనా. 14 ఏళ్ల ట్యాక్సును ఒకేసారి చెల్లించాలంటూ వారందరికీ కేంద్ర రవాణాశాఖ, సంబంధిత రాష్ట్ర విభాగాలు త్వరలోనే నోటీసులు పంపనున్నాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నగదు చెల్లించడానికి ఆయా వాహనదారులకు 60 రోజుల సమయం ఇస్తారని అంటున్నారు. అయితే ఈ వివరాలను అధికార వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు.

ఏ వాహనానికి ఎంత ట్యాక్స్?
బీహెచ్ నంబర్ ప్లేటు కలిగిన వారు చెల్లించే రహదారి పన్ను కూడా 14 ఏళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. రూ.10 లక్షలలోపు ధర కలిగిన వాహనాలకు 8 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలలోపు ధర కలిగిన వాహనాలకు 10శాతం, రూ.20 లక్షలకుపైగా ధర కలిగిన వాహనాలకు 12 శాతం వరకు పన్ను విధిస్తారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖకు చెందిన పరివాహన్ వెబ్‌సైట్‌‌లోకి వెళ్లి బీహెచ్ నంబర్ ప్లేటు కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే ఒకటికి మించి రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తుంటామని ధ్రువీకరించే పత్రాలు సమర్పించడం తప్పనిసరి.

వాహనాలకు 'BH' సిరీస్ నంబర్ ప్లేట్లు- ఎలా అప్లై చేయాలి? లాభాలేంటి?

Different Types Of Number Plates In India : వాహనాల నంబర్​ ప్లేట్ల రంగులు​.. వాటి ప్రత్యేకతలు ఏమిటో మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.