Best Scooters Or College Students : ప్రస్తుత కాలంలో మహిళలు ఎక్కువగా స్కూటీలను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వారికి స్కూటీలు నడపడానికి సౌకర్యవంతంగా అనిపిస్తాయి. అందుకే కాలేజ్‌కు వెళ్లే విద్యార్థినిలు, ఆఫీసులకు వెళ్లే మహిళలు ఎక్కువగా స్కూటీలను వాడుతున్నారు. అందుకే ఈ ఆర్టికల్‌లో ఒక లక్ష రూపాయల బడ్జెట్లో, మంచి మైలేజ్, పెర్ఫార్మెన్స్ ఇచ్చే టాప్-10 స్కూటర్స్ గురించి తెలుసుకుందాం.
1. Honda Activa 6G Specifications : హోండా యాక్టివా 6జీ స్కూటర్ 109.51 సీసీ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 7.79 పీఎస్ పవర్‌ను, 8.84 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా యాక్టివా 6జీ స్కూటీ కెర్బ్ వెయిట్ 106 కేజీలు. ఈ స్కూటీ లీటర్ పెట్రోల్‌కు 50 కి.మీ మైలేజ్‌ను ఇస్తుంది. దీనికి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. హోండా యాక్టివా 6జీకి మార్కెట్లో ప్రధాన పోటీదారులుగా టీవీఎస్ జూపిటర్, టీవీఎస్ స్కూటీ జెస్ట్, హోండా డియోలు ఉన్నాయి. హోండా యాక్టివా 6జీ మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర సుమారుగా రూ.76,234 - రూ.82,734 వరకు ఉంటుంది.
2. Suzuki Access 125 Specifications : భారతదేశంలోని అత్యంత పాపులర్ స్కూటర్లలో సుజుకి యాక్సిస్ 125 ఒకటి. ఈ స్కూటీ మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. సుజుకి యాక్సిస్ 125 స్కూటర్ 124 సీసీ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 8.7 పీఎస్ పవర్‌ను, 10 టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ స్కూటీ కెర్బ్ వెయిట్ 104 కేజీలు. ఇది లీటర్ పెట్రోల్‌కు 45 కి.మీ మైలేజ్‌ను ఇస్తుంది. ఈ హోండా సుజుకి యాక్సిస్ 125లో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. మార్కెట్లో సుజుకి యాక్సిస్ 125కు ప్రధాన పోటీదారులుగా విడా వీ1, హోండా యాక్టివా 6జీ, టీవీఎస్ ఎన్ టీఓఆర్ క్యూ 125 ఉన్నాయి. సుజుకి యాక్సిస్ 125 మొత్తం 4 వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర సుమారుగా రూ.79,900 - రూ.90,500 వరకు ఉంటుంది.
3. TVS NTORQ 125 Specifications : టీవీఎస్ ఎన్‌టార్క్ క్యూ 125 స్కూటీ ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 47 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ.84,636 - రూ.1.05 లక్షల వరకు ఉంటుంది. టీవీఎస్ ఎన్‌టార్క్ క్యూ 125 బైక్‌లో 124.8 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 9.51 పీఎస్ పవర్, 10.6 టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ స్కూటీ కెర్బ్ వెయిట్ 111 కేజీలు. దీనిలో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. మార్కెట్లో టీవీఎస్ ఎన్‌టార్క్ క్యూ 125 బండికి విడా వీ1, హోండా యాక్టివా 125, ఏప్రిలియా ఎస్ఆర్ 124 ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.
4. Honda Activa 125 Specifications : హోండా యాక్టివా 125 బైక్‌లో 124 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.30 పీఎస్ పవర్, 10.4 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని ధర రూ.80,256 - రూ. 89,429 వరకు ఉంటుంది. ఈ స్కూటీ కెర్బ్ వెయిట్ 110 కేజీలు. ఇది లీటర్ పెట్రోల్‌కు 60కి.మీ మైలేజ్ ఇస్తుంది. మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలనుకునేవారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. హోండా యాక్టివా 125కి మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ 125, టీవీఎస్ ఎన్‌టార్క్ క్యూ 125, సుజుకి అవెనిస్ స్కూటీలు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ఈ స్కూటీ 4 వేరియంట్లలో లభిస్తుంది.
5. TVS Jupiter Specifications : టీవీఎస్ జూపిటర్ స్కూటీ 4 వేరియంట్లలో లభిస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ.80,256 - రూ.89,429 వరకు ఉంటుంది. టీవీఎస్ జూపిటర్ 124 సీసీ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 8.30 పీఎస్ పవర్‌ను, 10.4 టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ స్కూటీ కెర్బ్ వెయిట్ 110 కేజీలు. ఈ స్కూటీకి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. టీవీఎస్ జూపిటర్ స్కూటీకి పోటీగా మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ 125, టీవీఎస్ ఎన్‌టార్క్ క్యూ 125, సుజుకి అవెనిస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.
6. Honda Dio Specifications : హోండా డియో స్కూటీ మహిళలు నడపడానికి కంఫర్ట్‌గా ఉంటుంది. దీని ధర రూ.70,211 - రూ. 77,712 వరకు ఉంటుంది. హోండా డియో 109.51 సీసీ ఇంజిన్‌తో లభిస్తుంది. ఇది 7.85 పీఎస్ పవర్, 9.03 టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కెర్బ్ వెయిట్ 103 కేజీలు. హోండా డియోకి మార్కెట్లో హీరో జూమ్, హోండా యాక్టివా 6జీ, సుజుకి యాక్సిస్ 125 ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. హోండా డియో 3 వేరియంట్లలో లభిస్తుంది.
7. Ola S1 X Specifications : ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మంచి స్కూటర్లలో ఓలా ఎస్1 ఎక్స్ ఒకటి. ఇది 4 వేరియంట్లలో లభిస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 95 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. దీని ధర రూ.74,999 - రూ.99,999 వరకు ఉంటుంది. ఓలా ఎస్1 ఎక్స్ కెర్బ్ వెయిట్ 101 కేజీలు. బ్యాటరీ కెపాసిటీ 2 Kwh. ఈ ఈవీ స్కూటీ టాప్ స్పీడ్ గంటకు 85 కి.మీ. కేవలం 5 గంటల్లోనే ఈ స్కూటీ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. దీనికి బజాజ్ చేతక్, హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా స్కూటీలు పోటీగా ఉన్నాయి.
8. Yamaha RayZR 125 Fi Hybrid : మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీ కొనాలకునేవారికి యమహా రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఈ స్కూటీ లీటర్ పెట్రోల్‌కు 71.33 కి.మీ మైలేజ్ ఇస్తుంది. యమహా రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్ 125సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 8.2 పీఎస్ పవర్, 10.3 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బండి 5 వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.85,300 - రూ.95,730 వరకు ఉంటుంది. దీని కెర్బ్ వెయిట్ 98 కేజీలు. ఈ బండికి మార్కెట్లో హీరో జూమ్ 110, హోండా యాక్టివా 6జీ, సుజుకి యాక్సిస్ 125 ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.
9. TVS Jupiter 125 Specifications : టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ 124.8 సీసీ ఇంజిన్‌తో లభిస్తుంది. ఇది 8.15 పీఎస్ పవర్, 10.5 టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టీవీఎస్ జూపిటర్ 125 స్కూటీ కెర్బ్ వెయిట్ 108 కేజీలు. ఇది లీటర్ పెట్రోల్‌కు 57.27 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీనికి వీడా వీ1, హోండా యాక్టివా 6జీ, సుజుకి యాక్సిస్ 125 స్కూటీలు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ 125 మొత్తం 3 వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర సుమారుగా రూ.86,405 - రూ.96,855 వరకు ఉంటుంది.
10. Suzuki Burgman Street Specifications : సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటీ లీటరు పెట్రోల్‌తో 48 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇది 124 సీసీ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 8.7 పవర్, 10 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ కెర్బ్ వెయిట్ 110 కేజీలు. ఈ స్కూటీ 3 వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.94,301 - రూ.1.15 లక్షల వరకు ఉంటుంది. సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్‌కు హీరో జూమ్ 110, హోండా యాక్టివా 6జీ, సుజుకి యాక్సిస్ 125 ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.
నోట్ : ఈ స్కూటీలను అమ్మాయిలు మాత్రమే కాదు, అబ్బాయిలు కూడా హాయిగా డ్రైవ్ చేయవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, స్త్రీ, పురుష అనే భేదం లేకుండా ఇంట్లో ఉన్న వారందరూ వీటిని హాయిగా నడపవచ్చు.