Best Mileage Bikes Under 1 Lakh : భారత్‌లో బైక్స్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ యువతను ఆకర్షించేందుకు సూపర్ స్టైలిష్ లుక్స్‌తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్, రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే బైక్‌లను మార్కెట్‌కి విడుదల చేస్తున్నాయి. వాటిలో రూ.1 లక్ష బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్-10 బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Bajaj Platina 100 : తక్కువ బడ్జెట్లో మంచి రైడింగ్ ఎక్స్‌పీరియెన్స్ కావాలనుకునే వారికి బజాజ్ ప్లాటినా 100 మంచి ఆప్షన్ అవుతుంది. దీనిలో 102 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.79 bhp @ 7500 rpm పవర్ జనరేట్ చేస్తుంది. దీని మైలేజీ 72 kmpl . మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.61,617 (యూవరేజ్ ఎక్స్ షో రూం ధర)ఉంటుంది.
TVS Sport : టీవీఎస్ కంపెనీ రిలీజ్ చేసిన సూపర్ స్టైలిష్ మోడల్ ఈ టీవీఎస్ స్పోర్ట్. ఇది మంచి డైనమిక్, స్పోర్టీ లుక్ కలిగి ఉంటుంది. దీనిలో 109.7 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్ అమర్చారు. దీనిపై లీటర్ పెట్రోల్‌తో 80 kmpl మైలేజ్ ఇస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.63,319 (యూవరేజ్ ఎక్స్ షో రూం ధర)ఉంటుంది.
Honda SP 125 : హోండా కంపెనీ నుంచి వచ్చిన సూపర్ స్టైలిష్ బైక్ హోండా SP 125. ఈ ఛార్మింగ్ బైక్‌లో 124 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. దీని మైలేజ్ 65 kmpl . ఇది 7 రంగుల్లో లభిస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.86,747(ఎక్స్ షో రూం) ఉంటుంది.
Hero HF Deluxe : ఆఫీసుకు వెళ్లేవారికి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ బైక్‌లో 97.2 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఈ బైక్ మైలేజ్ 65 kmpl. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.56,207 (ఎక్స్ షో రూం)ఉంటుంది.
Honda Shine 100 : సోర్ట్స్ లుక్స్‌తో ఉండే హోండా షైన్ 100 ఆఫీస్, ఇంటి అవసరాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బైక్‌పై గంటకు 68 kmpl మైలేజ్ ఇస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.65,011(ఎక్స్ షో రూం) ఉంటుంది.
Hero Splendor Plus : బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్‌ల్లో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. ఈ బైక్ 97.2 cc ఇంజిన్ సామర్థ్యం కలిగిఉంది. 60 kmpl మైలేజ్ ఇచ్చే స్ప్లెండర్ ప్లస్, 9.8 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. ఈ బైక్‌కు ప్రస్తుతం మార్కెట్లో సుమారుగా రూ.73,633 (ఎక్స్ షో రూం) ఉంటుంది.
Hero Splendor Plus Xtec : స్ప్లెండర్ ప్లస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ను 2022లో హీరో కంపెనీ లాంఛ్ చేసింది. 97.2 cc ఇంజిన్, గంటకు 68 kmpl మైలేజ్‌తో వస్తున్న ఈ బైక్‌లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చారు. ఈ సెగ్మెంట్లో ఈ ఫీచర్‌తో వస్తున్న మొదటి బైక్ ఎక్స్‌టెక్ అని కంపెనీ చెబుతోంది. ఈ ఫీచర్ ద్వారా కాల్స్, మేసేజ్‌లను క్లస్టర్ స్క్రీన్‌పై చూసుకోవచ్చు. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.79,707(ఎక్స్ షో రూం)ఉంటుంది.
TVS Raider 125 : టీవీఎస్ కంపెనీ విడుదల చేసిన పవర్ఫుల్ బైక్ టీవీఎస్ రైడర్ 125. ఇందులో 124.8 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. దీనిపై లీటర్ పెట్రోల్‌తో 56.7 kmpl వరకు ప్రయాణించవచ్చు. ఇది స్టైలిష్ లుక్స్‌తో, రైడింగ్ చేయడానికి మంచి కంఫర్ట్‌గా ఉంటుంది. మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.97,071(ఎక్స్ షో రూం) ఉంటుంది.
Honda Shine : హోండా రిలీజ్ చేసిన స్టైలిష్ బైక్ హోండా షైన్ యూత్‌ను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ బైక్123.94 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 10.59 bhp పవర్ జనరేట్ చేస్తుంది. ఈ హోండా బైక్ మైలేజ్ 55 kmpl. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.80,409(ఎక్స్ షో రూం) ఉంటుంది.
Hero Glamour : స్టైలిష్ లుక్స్‌తో హీరో విడుదల చేసిన బైక్ హీరో గ్లామర్. దీనిలో 124.7 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 10.39 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లీటర్‌కు 55 kmpl మైలేజ్ ఇస్తుంది. మంచి బడ్జెట్ బైక్ కొనాలని అనుకునేవారికి ఈ సూపర్ స్ప్లెండర్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.83,110(ఎక్స్ షో రూం) ఉంటుంది.
రూ.5 లక్షల్లో మంచి కారు కొనాలా? టాప్-6 మోడల్స్ ఇవే! - Best Cars Under 5 Lakh