ETV Bharat / business

మీ ఫ్యామిలీ కోసం మంచి కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్‌-9 మోడల్స్ ఇవే! - BEST CARS UNDER 10 LAKH

లేటెస్ట్ ఫీచర్స్, స్పెక్స్‌తో పాటు - బెస్ట్ మైలేజ్ ఇచ్చే - టాప్‌ 9 ఫ్యామిలీ కార్స్ ఇవే!

family cars
family cars (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2024, 3:14 PM IST

Best Cars Under 10 Lakh : మీ ఫ్యామిలీ కోసం మంచి కారు కొనాలని అనుకుంటున్నారా? లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు, స్పెక్స్ ఉండాలా? మంచి మైలేజ్‌ కూడా ఇవ్వాలా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో రూ.6 లక్షల - రూ.10 లక్షల బడ్జెట్లో లభిస్తున్న టాప్‌-9 కార్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Tata Punch : భారత్‌లో ఉన్న బెస్ట్ ఫ్యామిలీ కార్లలో టాటా పంచ్ ఒకటి. పట్టణాల్లో, చిన్న ఫ్యామిలితో కలిసి ప్రయాణించడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇది హ్యాచ్‌బ్యాక్ కారు అయినప్పటికీ, ఎస్‌యూవీ లాంటి స్టైలింగ్‌తో వస్తుంది. ఈ కారు ఇంటీరియర్‌ చాలా విశాలంగా, మోడ్రన్ ఫీచర్లు కలిగి ఉంటుంది. సేఫ్టీపరంగా చూస్తే, దీనికి 5-స్టార్ క్రాస్‌ టెస్ట్‌ రేటింగ్ ఉంది. పైగా దీని ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ చాలా బాగుంటుంది. దీనిలో సీఎన్‌జీ వెర్షన్ కూడా ఉంది. ఈ కారు మొత్తం 35 వేరియంట్లలో, 8 భిన్నమైన రంగుల్లో లభిస్తుంది.

  • ఇంజిన్‌ - 1199 సీసీ
  • పవర్‌ - 72-87 bhp
  • టార్క్‌ - 103 -115 Nm
  • ట్రాన్స్‌మిషన్‌ - మాన్యువల్‌/ ఆటోమేటిక్‌
  • డ్రైవ్ టైప్ - FWD
  • గ్రౌండ్ క్లియరెన్స్‌ - 187 mm
  • గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్ - 5 స్టార్‌
  • మైలేజ్‌ - 18.8-20.9 కి.మీ/లీటర్‌

Tata Punch Price : మార్కెట్లో ఈ టాటా పంచ్‌ కారు ధర రూ.6.13 లక్షలు - రూ.10.15 లక్షలు వరకు ఉంటుంది.

2. Maruti Swift : మారుతి స్విఫ్ట్‌ అనేది ఒక మిడ్‌సైజ్ హ్యాచ్‌బ్యాక్‌. మంచి మైలేజ్ ఇచ్చే కారు కొనాలని ఆశించేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది 18 వేరియంట్లు, 10 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

  • ఇంజిన్‌ - 1197 సీసీ
  • పవర్‌ - 68.8-80.46 bhp
  • టార్క్‌ - 101.8 -111.7 Nm

  • మైలేజ్ - 24.8 - 25.75 కి.మీ/ లీటర్‌
  • ఫ్యూయెల్‌ - పెట్రోల్‌/సీఎన్‌జీ

Maruti Swift Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి స్విఫ్ట్‌ కారు ధర సుమారుగా రూ.6.49 లక్షల నుంచి రూ.9.60 లక్షలు ఉంటుంది.

3. Maruti Baleno : ఇండియాలోని మోస్ట్ పాపులర్ కార్లలో మారుతి సుజుకి బాలెనో ఒకటి. ఈ కారు 13 వేరియంట్లలో, 8 అందమైన రంగుల్లో లభిస్తుంది. నలుగురు ఉండే చిన్న కుటుంబానికి ఇది చాలా బాగుంటుంది.

  • ఇంజిన్‌ - 1197 సీసీ
  • పవర్‌ - 76.43-88.5 bhp
  • టార్క్‌ - 98.5 -113 Nm

  • మైలేజ్ - 22.35 - 22.94 కి.మీ/ లీటర్‌
  • ఫ్యూయెల్‌ - పెట్రోల్‌/సీఎన్‌జీ

Maruti Baleno Price : మార్కెట్లో ఈ మారుతి బాలెనో కారు ధర సుమారుగా రూ.6.66 - 9.84 లక్షల వరకు ఉంటుంది.

4. Toyota Taisor : టయోటా టైసర్‌ ఒక కాంపాక్ట్‌ ఎస్‌యూవీ. సేఫ్టీ పరంగా ఇది బెస్ట్ కారు అని చెప్పుకోవచ్చు. హైవేల్లో, సిటీల్లో ప్రయాణించడానికి ఇది బాగుంటుంది. ఈ టైసర్ కారు ఇంటీరియర్ చాలా విశాలంగా ఉంటుంది. పైగా దీనిలో చాలా లేటెస్ట్ ఫీచర్లు ఉంటాయి. ఈ కారు 16 వేరియంట్లలో, 8 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

  • ఇంజిన్‌ - 998 - 1197 సీసీ
  • పవర్‌ - 76.43-98.69 bhp
  • టార్క్‌ - 98.5 -147.6 Nm
  • సీటింగ్ కెపాసిటీ - 5
  • మైలేజ్ - 20 - 22.8 కి.మీ/ లీటర్‌

Toyota Taisor Price : మార్కెట్లో టయోటా టైసర్‌ కారు ధర సుమారుగా రూ.7.74 లక్షలు - రూ.13.08 లక్షల వరకు ఉంటుంది.

5. Mahindra Bolero : ఇండియాలోని మోస్ట్ పాపులర్ కార్లలో మహీంద్రా బొలెరో ఒకటి. ఎలాంటి రోడ్లపై అయినా సుఖంగా ప్రయాణించడానికి ఇది అనువుగా ఉంటుంది. ఈ కారు 3 వేరియంట్లలో, 3 కలర్లలో లభిస్తుంది. సేఫ్టీ పరంగానూ ఇది అద్భుతంగా ఉంటుంది.

  • ఇంజిన్‌ - 1493 సీసీ
  • పవర్‌ - 74.96 bhp
  • టార్క్‌ - 210 Nm
  • ట్రాన్స్‌మిషన్‌ - మాన్యువల్‌
  • గ్రౌండ్ క్లియరెన్స్ - 180 mm
  • మైలేజ్ - 16 కి.మీ/ లీటర్‌

Mahindra Bolero Price : మార్కెట్లో ఈ మహీంద్రా బొలెరో కారు ధర సుమారుగా రూ.9.79 లక్షలు - రూ.10.91 లక్షలు ఉంటుంది.

6. Renault Triber : రెనో ట్రైబర్‌ అనేది ఒక 7-సీటర్‌ సబ్‌కాంపాక్ట్ మల్టీ పర్పస్‌ వెహికల్ (MPV). ఒక పెద్ద ఫ్యామిలీ హాయిగా ప్రయాణించడానికి ఇది అనువుగా ఉంటుంది. తక్కువ బడ్జెట్లో పెద్ద కారు కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ కోరు 9 వేరియంట్లలో, 8 డిఫరెంట్ కలర్లలో లభిస్తుంది.

  • ఇంజిన్‌ - 999 సీసీ
  • పవర్‌ - 71.01 bhp
  • టార్క్‌ - 96 Nm
  • ట్రాన్స్‌మిషన్‌ - మాన్యువల్‌
  • మైలేజ్ - 18.2 -20 కి.మీ/ లీటర్‌
  • సీటింగ్ కెపాసిటీ - 7
  • గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్ - 4

Renault Triber Price : మార్కెట్లో ఈ రెనో ట్రైబర్ కారు ధర సుమారుగా రూ.6 లక్షలు - రూ.8.97 లక్షలు ఉంటుంది.

7. Nissan Magnite : నిస్సాన్‌ మాగ్నైట్ అనేది ఒక 5 సీటర్‌ సబ్‌కాంపాక్ట్‌ ఎస్‌యూవీ. దీనిలో లేటెస్ట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ ఉన్నాయి. మీడియం బడ్జెట్లో మంచి కారు కొనాలని అనుకునే వారికి ఇది చాలా బాగుంటుంది. ఈ కారు 18 వేరియంట్లలో, సింగిల్‌ కలర్‌లో లభిస్తుంది.

  • ఇంజిన్‌ - 999 సీసీ
  • పవర్‌ - 71 -99 bhp
  • టార్క్‌ - 96 - 160 Nm
  • ట్రాన్స్‌మిషన్‌ - మాన్యువల్‌/ఆటోమేటిక్‌
  • మైలేజ్ - 17.9 -19.9 కి.మీ/ లీటర్‌

Nissan Magnite Price : మార్కెట్లో ఈ నిస్సాన్ మాగ్నైట్‌ కారు ధర సుమారుగా రూ.5.99 లక్షలు - రూ.11.50 లక్షలు ఉంటుంది.

8. Hyundai Venue : హ్యుందాయ్‌ వెన్యూ ఒక 5 సీటర్ కారు. ఇది 32 వేరియంట్లలో, 7 అందమైన రంగుల్లో లభిస్తుంది. హ్యుందాయ్ బ్రాండ్ కారు కొనాలని అనుకునేవారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.

  • ఇంజిన్‌ - 998 - 1493 సీసీ
  • పవర్‌ - 82 -118 bhp
  • టార్క్‌ - 113.8-250 Nm
  • మైలేజ్ - 24.2 కి.మీ/ లీటర్‌

Hyundai Venue Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్ వెన్యూ రూ.7.94 లక్షలు - రూ.13.53 లక్షలు వరకు ఉంటుంది.

9. Kia Sonet : ఫ్యామిలీ కోసం మంచి కారు కొనాలని అనుకునేవారికి కియా సోనెట్ మంచి ఛాయిస్. ఇది 5 సీటర్‌ కారు. ఇది మొత్తం 29 వేరియంట్లలో, 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

  • ఇంజిన్‌ - 998 - 1493 సీసీ
  • పవర్‌ - 81.8 -118 bhp
  • టార్క్‌ - 115-250 Nm
  • మైలేజ్ - 18.4-24.1 కి.మీ/ లీటర్‌

Kia Sonet Price : మార్కెట్లో ఈ కియా సోనెట్ కారు ధర సుమారుగా రూ.7.99 లక్షలు - రూ.15.77 లక్షల వరకు ఉంటుంది.

దీపావళికి కొత్త స్కూటర్ కొనాలా? రూ.1.5 లక్షల బడ్జెట్లోని టాప్‌-10 మోడల్స్ ఇవే!

దీపావళి డీల్స్‌ - ఆ స్కూటీపై రూ.25,000 డిస్కౌంట్‌ - హీరో, హోండా, టీవీఎస్‌ బైక్‌ ఆఫర్స్‌ ఎలా ఉన్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.