ETV Bharat / business

రూ.1 లక్ష బడ్జెట్లో మంచి బైక్​ కొనాలా? టాప్​-10 పవర్​ఫుల్​ మోడల్స్​ ఇవే! - Best Bikes Under 1 Lakh

Best Bikes Under 1 Lakh : మీరు కొత్త బైక్ కొనాలని అనుకుంటున్నారా? రూ.1 లక్ష వరకు బడ్జెట్ పెట్టగలరా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో సూపర్ స్టైలిష్​ లుక్స్​తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్, రైడింగ్ ఎక్స్​పీరియన్స్​ ఇచ్చే టాప్​-10 బైక్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

Best Bikes Under 1 Lakh
Best Bikes Under 1 Lakh
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 5:25 PM IST

Best Bikes Under 1 Lakh : భారత్​లో బైక్స్​కు ఎంత క్రేజ్​ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ యువతను ఆకర్షించేందుకు సూపర్​ స్టైలిష్​ లుక్స్​తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్, రైడింగ్ ఎక్స్​పీరియన్స్​ ఇచ్చే బైక్​లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వాటిలో రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్​-10 బైక్​ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. TVS Raider 125 : మంచి రైడింగ్ ఎక్స్​పీరియెన్స్​ కావాలనుకునే వారికి టీవీఎస్​ రైడర్​ 125 మంచి ఆప్షన్ అవుతుంది. దీనిలో 124.8 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 25bhp​ పవర్​ జనరేట్ చేస్తుంది. దీని మైలేజీ 56.7 కి.మీ/లీటర్​. మార్కెట్​లో ఈ టీవీఎస్​ రైడర్ ధర సుమారుగా రూ.97,054 ఉంటుంది.

2. Hero Xtreme 125R : హీరో కంపెనీ రిలీజ్ చేసిన సూపర్​ స్టైలిష్​​ మోడల్ ఈ హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్. ఇది మంచి డైనమిక్​, స్పోర్టీ లుక్​ కలిగి ఉంటుంది. దీనిలో 124.7 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ అమర్చారు. ఇది 11.4 bhp పవర్ జనరేట్ చేస్తుంది. దీనిపై లీటర్ పెట్రోల్​తో 66 కి.మీ ప్రయాణించవచ్చు. మార్కెట్​లో దీని ధర సుమారుగా రూ.96,786 ఉంటుంది.

3. Suzuki Burgman Street 125 : ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి టూవీలర్​లోనూ మంచి బైక్స్​ను విడుదల చేస్తోంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన సూపర్​ స్పోర్ట్స్​ స్కూటీ సుజుకి బర్గ్​మ్యాన్ 125. ఈ ఛార్మింగ్​ స్కూటీలో 124 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. దీని మైలేజ్​ 58.5 km/l. ఇది 13 రంగుల్లో లభిస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.96,524 ఉంటుంది.

4. Suzuki Avenis 125 : కాలేజీ, ఆఫీసుకు వెళ్లేవారికి సుజుకి అవెనిస్ 125 మంచి ఆప్షన్ అవుతుంది. ఈ స్కూటీలోలో 124.3 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్​ ఉంది. ఇది 8.58 bhp పవర్​ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటీ మైలేజ్​ 49.6 కి.మీ/లీటర్​. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.94,503 ఉంటుంది.

5. Benling Aura : క్యూట్​ లుక్స్​తో ఉండే బెన్​లింగ్ ఆరా ఎలక్ట్రిక్ స్కూటీ కాలేజీ, ఆఫీస్​, ఇంటి అవసరాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్కూటీపై గంటకు 60 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.91,667 ఉంటుంది.

6. Kinetic Green Zulu : స్టైలిష్ లుక్స్​తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఎలక్ట్రిక్​​ స్కూటీల్లో కైనెటిక్ గ్రీన్ జులు ఒకటి. ఇది 2000 W పవర్ జనరేట్ చేస్తుంది. దీని రేంజ్​ 104 కి.మీ​. టెలిస్కోపిక్​ ఫోర్క్​ ఫ్రంట్​ సస్పెన్షన్, డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్​​ వెనుక సస్పెన్ష్​తో వస్తున్న ఈ స్కూటీ ధర మార్కెట్లో సుమారుగా రూ.94,990 ఉంటుంది.

7. TVS Ntorq 125 : మంచి రైడింగ్​ ఎక్స్​పీరియెన్స్, అత్యుత్తమ ఫీచర్స్​, సూపర్​ స్పోర్ట్స్​ లుక్స్​తో ఆకట్టుకుంటోంది టీవీఎస్​ ఎన్​టార్క్​ 125. ఈ స్పోర్ట్స్​ స్కూటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీనిలో 124.8 సీసీ ఇంజిన్ ఉంది. ఈ బైక్ మైలేజ్​ 41 కి.మీ/లీటర్.​ ఈ స్కూటీలో వాయిస్ అసిస్టెంట్​ ఫీచర్​ను పొందుపరిచారు. దీని ద్వారా వివిధ బైక్​ ఫంక్షన్లను యాక్సెస్​ చేయొచ్చు. ఇందులో లోకేషన్ సర్వీసెస్, కాల్​ నోటిఫికేషన్స్​ వంటి 20 రకాల కమాండ్స్​ ఉన్నాయి. రైడింగ్​ చేస్తున్నప్పుడు హెల్మెట్​కు బ్లూటూత్​ లేదా వైర్​ ఇయర్​ఫోన్స్​ కనెక్ట్​ చేసి కమాండ్స్​తో​ స్కూటీ సిస్టమ్​ను ఆపరేట్​ చేయొచ్చు. మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.87,133 ఉంటుంది.

8. Yamaha Ray ZR 125 : యమహా కంపెనీ విడుదల చేసిన పవర్​ఫుల్​ స్కూటీ​ ఈ యమహా రే జెడ్​ఆర్​125. ఇందులో 125 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. దీనిపై లీటర్​ పెట్రోల్​తో 49 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఇది స్టైలిష్ లుక్స్​తో, రైడింగ్ చేయడానికి మంచి కంఫర్ట్​గా ఉంటుంది. మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.87,079 ఉంటుంది.

9. Honda Dio 125 : హోండా రిలీజ్​ చేసిన స్పోర్ట్స్​ స్కూటీ హోండా డియో 125 యూత్​ను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ బైక్​లో 123.92 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 8.14 bhp​ పవర్​ జనరేట్ చేస్తుంది. ఈ హోండా స్కూటీ మైలేజ్​ 48kmpl. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.86,147 ఉంటుంది.

10. Hero Super Splendor : హీరో విడుదల చేసిన మరో బడ్జెట్​ బైక్​ హీరో సూపర్​ స్ప్లెండర్. దీనిలో 124.7 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 10.72 bhp పవర్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సూపర్ స్ప్లెండర్ లీటర్​కు 55 కి.మీ మైలేజ్​ ఇస్తుంది. మంచి బడ్జెట్​ బైక్​ కొనాలని అనుకునేవారికి ఈ సూపర్​ స్ప్లెండర్​ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.80,759 ఉంటుంది.

స్టన్నింగ్ ఫీచర్స్​తో టయోటా టైజర్ లాంఛ్​ - ధర ఎంతంటే? - Toyota Taisor Launch

బెస్ట్​ మైలేజ్ ఇచ్చే కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్​-5 మోడల్స్ ఇవే! - Best Mileage Cars In India 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.