Bank Holidays In November 2024 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2024 నవంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 13 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది.
నోట్ : అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
List Of Bank Holidays In November 2024
2024 నవంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే!
- నవంబర్ 1 (శుక్రవారం) : దీపావళి సందర్భంగా త్రిపుర, కర్ణాటకల్లోని బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 2 (శనివారం) : దీపావళి (బలి ప్రతిపద)
- నవంబర్ 3 (ఆదివారం)
- నవంబర్ 7 (గురువారం) : ఛత్ పూజ సందర్భంగా బిహార్, ఝార్ఖండ్, బంగాల్‌ల్లోని బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 8 (శుక్రవారం) : ఛత్ పూజ సందర్భంగా బిహార్, ఝార్ఖండ్, బంగాల్‌ల్లోని బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 9 (రెండో శనివారం)
- నవంబర్ 10 (ఆదివారం)
- నవంబర్ 12 (మంగళవారం) : ఎగాస్ బగ్వాల్ సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 15 (శుక్రవారం) : గురునానక్ జయంతి
- నవంబర్ 17 (ఆదివారం)
- నవంబర్ 18 (సోమవారం) : కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 23 (నాలుగో శనివారం) : సెంగ్ కుట్‌స్నెమ్ సందర్భంగా మేఘాలయలోని బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 24 (ఆదివారం)
సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : నవంబర్ నెలలో 13 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయి. కనుక బ్యాంక్‌లకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చు.