Bank Holidays In July 2024 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2024 జులై నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 12 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది.
List Of Bank Holidays In July 2024
2024 జులై నెలలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే!
- జులై 3 (బుధవారం) : బేహ్ డీఇన్కలమ్ పండుగ సందర్భంగా మేఘాలయలోని బ్యాంకులకు సెలవు.
- జులై 6 (శనివారం) : 'మిజో హ్మీచే ఇన్సుయిహ్ఖామ్ పాల్' (MHIP) సందర్భంగా మిజోరంలోని బ్యాంకులకు సెలవు.
- జులై 7 (ఆదివారం) :
- జులై 8 (సోమవారం) : కాంగ్ (రథజాత్ర) సందర్భంగా మణిపుర్‌లోని బ్యాంకులకు సెలవు.
- జులై 9 (మంగళవారం) : బౌద్ధులకు అత్యంత పవిత్రమైన 'ద్రుక్పా త్షే-జి' సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు.
- జులై 13 (శనివారం) : రెండో శనివారం సందర్భంగా బ్యాంకులకు హాలీడే.
- జులై 14 (ఆదివారం) :
- జులై 16 (మంగళవారం) : హిందూ పండుగ హరేలా సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని బ్యాంకులకు సెలవు.
- జులై 17 (బుధవారం) : మొహర్రం/ అషూరా/ యు తిరోట్ సింగ్ డే సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు. అయితే గుజరాత్, ఒడిశా, చంఢీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అసోం, మణిపుర్, ఇటానగర్, కేరళ, నాగాలాండ్, గోవాలో మాత్రం బ్యాంకులు పనిచేస్తాయి.
- జులై 21 (ఆదివారం) :
- జులై 27 (శనివారం) : నాలుగో శనివారం కనుక బ్యాంకులు పనిచేయవు.
- జులై 28 (ఆదివారం) :
సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : జులై నెలలో 12 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయి. కనుక బ్యాంక్‌లకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చు.
పర్సనల్ లోన్ తిరిగి చెల్లించలేదా? డిఫాల్టర్లకు జరిగే నష్టాలివే! - What Happens To Loan Defaulters