Best Pension Plan In India : వృద్ధాప్యంలో వ్యక్తుల జీవితానికి ఆర్థిక ఆసరా కల్పించేందుకు 'అటల్ పెన్షన్ యోజన' అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిలో చేరినట్లయితే మీకు 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ.5వేల చొప్పున పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో ఎవరి సహాయం అవసరం లేకుండా, కేంద్రం నుంచి వచ్చే ఈ పెన్షన్‌తో మీరు జీవితాన్ని హాయిగా గడపవచ్చు.
చాలా మంది నిరుపేదలు, సామాన్య ప్రజలు పెన్షన్ స్కీమ్‌లలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేరు. ఇలాంటి వారికి కూడా అటల్ పెన్షన్ స్కీమ్ చాలా అనువుగా ఉంటుంది. ఎందుకంటే, కేవలం రోజుకు రూ.13 మాత్రమే చెల్లించి ఈ అటల్ పెన్షన్ యోజనలో చేరవచ్చు. అందుకే ఈ స్కీమ్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Atal Pension Yojana : కేంద్ర ప్రభుత్వం 2015-16లో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల, అల్పాదాయ వర్గానికి చెందిన ప్రజల కోసం అటల్ పెన్షన్ యోజన(APY) అనే స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ పథకంలో చేరినవారు 60 సంవత్సరాలు దాటిన తర్వాత నెలకు రూ. 1,000 నుంచి గరిష్ఠంగా రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ స్కీమ్‌లో మీ పెట్టుబడితో పాటు, ప్రభుత్వం కూడా సంవత్సరానికి రూ.1,000 వరకు నిధులను కూడా అందిస్తుంది.
అటల్ పెన్షన్ యోజన అర్హతలు ఏమిటి?
Atal Pension Yojana Eligibility : ప్రభుత్వ నియమాల ప్రకారం 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఈ అటల్ పెన్షన్ స్కీమ్‌లో చేరవచ్చు. అందువల్ల 18 సంవత్సరాలు నిండిన, చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఈ స్కీమ్‌లో చేరి తమ భవిష్యత్తు పదవీవిరమణ జీవితం కోసం పెట్టుబడి పెట్టవచ్చు. అయితే 40 ఏళ్లు దాటిన తర్వాత ఈ స్కీమ్‌లో చేరేందుకు వీలుండదు. అలాగే దీనిలో చేరేవారు ఏ ఇతర ప్రభుత్వ ప్రాయోజిత సామాజిక భద్రతా పథకాలను కలిగి ఉండకూడదు. అదేవిధంగా పన్ను చెల్లింపుదారుగా కూడా ఉండకూడదు.
ఈ స్కీమ్‌లో ఎలా చేరాలి?
అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలని భావించే వారు తప్పనిసరిగా ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో పొదుపు ఖాతాను కలిగి ఉండాలి. అలాగే మీకు దగ్గరలోని పోస్ట్ ఆఫీసులో కూడా పెట్టుబడి పెట్టి ఈ పెన్షన్ పథకంలో చేరవచ్చు. అలాగే ఈ స్కీమ్‌లో చేరిన వారు ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద రూ. 50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
నెలకు రూ.5,000 పెన్షన్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరేందుకు గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలు. ఉదాహరణకు మీరు నెలకు రూ.5000 పెన్షన్ పొందాలని భావిస్తున్నారు అనుకుందాం. ప్రస్తుతం మీ వయస్సు 25 సంవత్సరాలు అనుకుంటే, మీ ఉద్యోగ విరమణకు ఇంకా 35 సంవత్సరాలు ఉంటుంది. ఉద్యోగ విరమణ వయస్సు (60 ఏళ్లు) వచ్చే వరకు ఇందులో నెలకు రూ.376 పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. అంటే రోజుకు రూ.13 చొప్పున మీరు ఇన్వెస్ట్ చేయ్యాలి అన్నమాట. అదే ఒకవేళ మీ వయస్సు 40 సంవత్సరాలు అనుకుంటే మీరు 20 ఏళ్లపాటు నెలకు రూ. 1454 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి చిన్న వయస్సులోనే ఈ స్కీమ్‌లో చేరడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చునని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు.
అటల్ పెన్షన్ యోజన కంట్రిబ్యూషన్ చార్ట్ ప్రకారం : మీరు 18 ఏళ్ల నుంచి అటల్ పెన్షన్ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే, ప్రతి నెలా కనీసం రూ.210 పెట్టాలి. అదే మీరు కొంచెం ఆలస్యంగా 25 సంవత్సరాలకు ప్రారంభిస్తే, మీరు నెలవారీ రూ.376 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అదే 30 సంవత్సరాల వద్ద అయితే నెలకు రూ.577; మీకు 35 ఏళ్లు వచ్చాక అయితే నెలవారీగా రూ.902 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఈ స్కీమ్‌లో మీ వయస్సుకు తగ్గట్టు నెలవారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనితో మీకు 60 ఏళ్లు వచ్చిన తరువాత నెలకు రూ.5వేలు పెన్షన్‌గా పొందవచ్చు.
నెలకు రూ.10,000 పెన్షన్ రావాలంటే?
అటల్ పెన్షన్ స్కీమ్‌లో భార్యభర్తలు ఇద్దరూ చేరవచ్చు. ఇలా చేస్తే దంపతులు ఇద్దరికీ కలిపి రూ.10,000 పెన్షన్ వస్తుంది. ఒకవేళ ఇద్దరిలో ఒకరు మరణిస్తే, బతికి ఉన్న వ్యక్తికి సదరు పెన్షన్ చెల్లిస్తారు. ఒక వేళ దంపతులు ఇద్దరూ మరణిస్తే, నామినీకి మొత్తం పరిహారం చెల్లిస్తారు.
How to Enroll in Atal Pension Yojana?
మీకు బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్ ఉంటే చాలు. దేశంలోని ఏ బ్యాంకులో అయినా అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మీరు ఉద్యోగులా? '50:30:20 స్ట్రాటజీ'తో సాలరీని మేనేజ్ చేయండిలా! - How Much To Save In Salary