ETV Bharat / business

పర్సనల్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్! - PERSONAL LOAN TIPS - PERSONAL LOAN TIPS

Personal Loan Dos And Don'ts : అవసరం ఏమిటన్నది అడగకుండా క్షణాల్లో వ్యక్తిగత రుణాలను ఇచ్చే సంస్థలు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. అత్యవసరమైనప్పుడు అప్పు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ పర్సనల్ లోన్స్ తీసుకునేటప్పుడు చాలా విషయాలను ముందుగానే తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Personal Loan
Personal Loan (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2024, 5:18 PM IST

Personal Loan Dos And Don'ts : ఆర్థిక అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో చెప్పలేం. ఆ సమయానికి మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. లేదా మన దగ్గరున్న సొమ్ము సరిపోకపోవచ్చు. కనుక అలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత రుణం తీసుకోవడంలో ఎలాంటి తప్పులేదు. కానీ పర్సనల్ లోన్స్ తీసుకునే ముందు కొన్ని విషయాలను కచ్చితంగా చెక్ చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

వడ్డీ రేట్లు : వ్యక్తిగత రుణం తీసుకునేటప్పుడు వడ్డీ రేటు తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. చాలా బ్యాంకులు 12 శాతం లేదా అంత కంటె ఎక్కువ వడ్డీ రేటును విధిస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలు 23 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. రుణ యాప్​లైతే మరీ దారుణంగా అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. నకిలీ యాప్​లైతే మిమ్మల్ని మోసం చేసి, భారీగా డబ్బులు కూడా దోచుకుంటాయి. కనుక అధిక వడ్డీ రేటున్న రుణాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. అందుకే లోన్స్ తీసుకునే ముందు వివిధ బ్యాంకులు, రుణ సంస్థలు విధిస్తున్న వడ్డీ రేట్లను పోల్చి చూసుకోవాలి.

లోన్ వ్యవధి : పర్సనల్ లోన్స్​ వ్యవధి సాధారణంగా 12-60 నెలల వరకు ఉంటుంది. కనుక మీరు రుణం సులువుగా తీర్చడానికి అవసరమైన, అనుకూలమైన వ్యవధిని ఎంచుకోండి. 36 నెలలకు మించి వ్యవధి ఉండకపోవడమే మంచిదని గుర్తుంచుకోండి.

బ్యాంకు, ఎన్‌బీఎఫ్‌సీ : పర్సనల్​ లోన్స్​ను ఎక్కడి నుంచి తీసుకోవాలన్నది మనమే నిర్ణయించుకోవాలి. గతంలో బ్యాంకులు వ్యక్తిగత రుణాన్ని ఇచ్చేందుకు కనీసం నాలుగైదు రోజుల వ్యవధిని తీసుకునేవి. కానీ ఎన్‌బీఎఫ్‌సీలు, లోన్​ యాప్‌లు క్షణాల్లోనే రుణాలను ఇచ్చేవి. ఇప్పుడు దాదాపు అన్ని సంస్థలు, యాప్​లు ఒకే విధంగా స్పందిస్తున్నాయి. దరఖాస్తు చేసి, కొన్ని లాంఛనాలు పూర్తి చేస్తే చాలు, లోన్ అమౌంట్​ మీ బ్యాంక్​ అకౌంట్​లో జమ చేస్తున్నాయి. అయినప్పటికీ రుణం తీసుకునేటప్పుడు బ్యాంకు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ఎందులో తీసుకోవాలనుకునేది మీరే నిర్ణయించుకోవాలి. సరళమైన షరతులు ఉన్నదాన్ని ఎంచుకోవడమే ఎప్పుడూ మంచిది. మీ అర్హతను బట్టి, ఎవరు ఎంత మేరకు రుణం ఇస్తున్నారన్నదీ చూసుకోండి.

అపరాధ రుసుములు​ : కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి ముందస్తు చెల్లింపు రుసుము లేకుండానే మీ బాకీ మొత్తాన్ని చెల్లించే అవకాశం కల్పిస్తాయి. కొన్ని బ్యాంకులు, యాప్‌లు మాత్రం బాకీ మొత్తాన్ని ముందుగానే చెల్లిస్తే 2-6 శాతం అపరాధ రుసుమును వసూలు చేస్తున్నాయి. కనుక వ్యక్తిగత రుణం తీసుకునేటప్పుడు దీన్ని తప్పనిసరిగా గమనించాలి. ముందస్తు చెల్లింపు రుసుములు, పెనాల్టీలు విధించని సంస్థల దగ్గర్నుంచే లోన్ తీసుకోవడం మంచిది.

గుడ్ & బ్యాడ్​ లోన్స్​ : వ్యక్తిగత రుణాల్లో గుడ్​, బ్యాడ్ రెండూ ఉంటాయి. ఈ రెండింటి మధ్య గల తేడాను మీరు గుర్తించాలి. విలువ పెరిగే ఆస్తుల కొనుగోలుకు లోన్స్​ తీసుకోవడం ఎప్పుడూ మంచిదే. విలాసాలను, కోరికలను తీర్చుకునేందుకు చేసే రుణాలు చెడ్డవి. ఇవి మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజారుస్తాయి. కనుక అత్యవసరాలకు, జీవితంలో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన రుణాలు మాత్రమే తీసుకోవాలి.

పర్సనల్​ లోన్​ తీసుకోవాలా? అత్యవసర నిధి వాడాలా? ఏది బెస్ట్ ఆప్షన్​? - Emergency Fund Vs Personal Loan

అప్పులు దొరకట్లేదా? బ్యాంకులు నో అంటున్నాయా? ఇలా చేస్తే లోన్ గ్యారెంటీ! - Personal Loan Rejected

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.